Begin typing your search above and press return to search.

పీకే తాజా జోస్యాలు... తలలు పట్టుకుంటున్న తమ్ముళ్లు... వైరల్ గా కారణాలు!

సార్వత్రిక ఎన్నికల సమయంలో పీకే మరోసారి ఎంట్రీ ఇచ్చారు. ఇందులో భాగంగా ఏపీలో జగన్ గెలవడం కష్టం అని జోస్యం చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   8 April 2024 10:00 AM GMT
పీకే తాజా జోస్యాలు...  తలలు పట్టుకుంటున్న తమ్ముళ్లు... వైరల్  గా కారణాలు!
X

ప్రస్తుతం ఏపీలో పీకే చేసిన వ్యాఖ్యలపై తీవ్ర చర్చ నడుస్తోంది. అతడు చెప్పే కబుర్లకు ప్రామాణికత ఉందా.. గతకొంతకాలంగా ఆయన చెబుతున్న మాటలకు శాస్త్రీయత ఉందా.. విశ్లేషణ పేరు చెప్పి చెబుతున్న ఈ జోస్యం ప్యాకేజీ ఎంత.. గతంలో ఈయన చెప్పిన మాటలు నెరవేరిన పరిస్థితులు ఏమైనా ఉన్నాయా అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు ఏపీ ప్రజానికం!

అవును... గతంలో ఎన్నికల వ్యూహకర్తగా బీజేపీ, వైఎస్సార్సీసీ లతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన ప్రశాంత్ కిశోర్... అనంతరం బీహార్ లో పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా రూపుదాల్చిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో తానేమీ సర్వే చేయించలేదు కానీ... అంటూనే ఏపీ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇందులో భాగంగా రానున్న ఎన్నికల్లో జగన్ గెలవడం కష్టం అని అన్నారు!

దీంతో... రాజకీయ నాయకుడిగా మారినా కూడా ఇంకా పాతవాసనలు పోయినట్లు లేవని.. ఇందులో భాగంగానే అప్పుడప్పుడూ డబ్బులు తీసుకుని ఎవరిపై ఏది చెప్పమంటే అది చెబుతున్నారనే విమర్శలు ఏపీ ప్రజానికం నుంచి వినిపిస్తున్నాయి! కనస్ట్రక్టివ్ గా ఒక సర్వే చేసుకుని.. ఆ రిపోర్ట్స్ ప్రజల ముందుపెట్టి.. ఆ తర్వాత ఆ సర్వే చేసిన విధానాన్ని చెబుతు, విశ్లేషిస్తే క్రెడిబిలిటీ ఉంటుంది కానీ... ఇలాంటి కబుర్లు చెప్పడం వల్ల ఉండదని అంటున్నారు.

ప్రధానంగా... కూటమి నేతలు ఏర్పాటుచేసే ప్రత్యేక విమానాల్లో అప్పుడప్పుడూ హైదరబాద్ కి వస్తుంటారని.. ఈ సమయంలో చంద్రబాబు వద్ద కొంత ఫీజు తీసుకుంటారని.. అనంతరం, ఎలాంటి సర్వేలూ చేపట్టకుండానే, నివేదికలు లేకుండానే తోచిన అభిప్రాయాలు చెబుతుంటారని విమర్శిస్తున్నారు. ఇలా వ్యూహకర్తల ముసుగులో పెయిడ్ ఆర్టిస్ట్ పనులు చేస్తున్నారని దుయ్యబడుతున్నారు.

తాజాగా... రానున్న ఎన్నికల్లో జగన్ గెలవడం కష్టం అంటూ చేసిన వ్యాఖ్యలు ఈ కోవలోకే వస్తాయని అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో... ప్రజలు అభిప్రాయాల్లో కూడా వాస్తవాలు లేకపోలేదని అంటున్నారు పరిశీలకులు. వాస్తవానికి ప్రశాంత్ కిశోర్ కు ఆంధ్రాలో ఎలాంటి సర్వే వ్యవస్థ లేదు, నెట్ వర్క్ లేదు, ఫలితంగా.. ప్రజాభిప్రాయాలు తెలుసుకునే అవకాశం లేదు! అయినా కూడా తన వ్యక్తిగత అభిప్రాయాన్ని ప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు.

గతంలో జోస్యాలన్నీ రివర్స్... ఇదిగో ట్రాక్ రికార్డ్!

అయితే ఇలాంటి జోస్యాలు చెప్పడం పీకేకి ఇదే ఫస్ట్ టైం కాదు. గతంలో కూడా అయన ఇలా పలుమార్లు చెప్పారు. అయితే... ఆయన చెప్పినదానికి పూర్తి ఆపోజిట్ గా ఫలితాలు రావడం గమనార్హం. అలాంటి మచ్చుకు కొన్ని ఉదాహరణలు ఇప్పుడు చూద్దాం...!

"95 శాతం హిందువులున్న హిమాచల్ ప్రదేశ్‌ లో కాంగ్రెస్ గెలిచే అవకాశం లేదు" అని చెప్పుకొచ్చాడు పీకే! అయితే... వాస్తవ ఫలితాలు మాత్రం అందుకు పూర్తి రివర్స్ లో వచ్చాయి. ఇందులో భాగంగా... హిమాచల్‌ ప్రదేశ్‌ లో 60% మెజారిటీతో కాంగ్రెస్ గెలిచింది.

ఇదే సమయంలో గత ఏడాది జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లోనూ పీకే జోస్యం చెప్పారు! ఇందులో భాగంగా.. కర్ణాటకలో మళ్లీ బీజేపీ ప్రభుత్వమే వస్తుందని చెప్పుకొచ్చారు. కట్ చేస్తే... బంపర్ మెజారిటీతో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది.. ఈయన గెలుస్తుందంటూ జోస్యం చెప్పిన బీజేపీ ఓడిపోయింది!

ఇక, మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపైనా స్పందించిన పీకే... మరోసారి గెలిచి కేసీఆర్ హ్యాట్రిక్ కొడతారని చెప్పారు. కట్ చేస్తే... తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 64 స్థానాల్లో గెలిచింది. బీఅరెస్స్ 39 సీట్లకు పరిమితమైంది.

ఇవే కాదు... ఛత్తీస్ ఘడ్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ గెలవవొచ్చు.. ఉత్తరాఖండ్ లో బీజేపీ గెలుస్తుంది అని చెప్పడం.. అక్కడ కూడా ఫలితాలు తారుమారు అవ్వడం జరిగింది! ఇది ఎన్నికల ఫలితాల జోస్యంపై ప్రశాంత్ కిశోర్ కి ఉన్న ట్రాక్ రికార్డ్!

తాజా జోస్యాలు... తలలు పట్టుకుంటున్న తమ్ముళ్లు!

సార్వత్రిక ఎన్నికల సమయంలో పీకే మరోసారి ఎంట్రీ ఇచ్చారు. ఇందులో భాగంగా ఏపీలో జగన్ గెలవడం కష్టం అని జోస్యం చెబుతున్నారు. దీంతో... ఈయన ట్రాక్ రికార్డ్ గురించి తెలిసిన తమ్ముళ్లు తలలు పట్టుకుంటున్నారని తెలుస్తుంది. ఇదే సమయంలో తెలంగాణలో బీజేపీ మొదటిస్థానంలో నిలుస్తుందన్నట్లుగా వ్యాఖ్యానించారు. అదే జరగాలంటే... తెలంగాణలో బీజేపీ కనీసం 8 ఎంపీ స్థానాల్లో గెలవాలి. తెలంగాణలో బీజేపీకి ఆ పరిస్థితి ఉందా?

ఇక, దక్షిణాదిలో బీజేపీ భారీగా సీట్లు గెలుస్తుందని అంచనా వేస్తున్నారు ప్రశాంత్ కిషోర్! ఆయన అంచనా నిజం కావాలి అంటే మొత్తం సౌత్ లో బీజేపీ కనీసం 30 సీట్లు గెలవాలి లేదా 2019లో గెలిచిన 25 సీట్లు అయినా గెలవాలి. ప్రస్తుతం కర్ణాటకలో ప్రభుత్వం మారిపోవడంతో బీజేపీకి అంత అవకాశం ఉంటుందా.. తమిళనాడులో జరిగేపనేనా.. తెలంగాణలో కాంగ్రెస్ కు జోరు లేదా.. ఏపీలో కూటమిలో తీసుకున్న 6 సీట్లలో ఎన్ని గెలిచే అవకాశాలున్నాయి?

దీంతో... పీకే చెబుతున్న మాటలను పోసుకోలు కబుర్లుగా అభివర్ణిస్తున్నారు పలువురు పరిశీలకులు. ఇలాంటి కబుర్లు చెప్పి ఫీజు తీసుకోవడం తప్ప అయన మాటలకు ప్రామాణికత, ఆ మాటల్లో శాస్త్రీయత లేదని చెబుతున్నారు!