Begin typing your search above and press return to search.
సుప్రీంకోర్టు తీర్పుపై అపోహలు వద్దు: సునీతా కృష్ణన్
Sunitha Krishnan Clarifies Supreme Court Judgment, Slams Misleading Narratives
By: Tupaki Desk | 5 Jun 2026 12:02 AM ISTమానవ అక్రమ రవాణా, లైంగిక దోపిడీ బాధితుల రక్షణ కోసం సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుపై ప్రజ్వల వ్యవస్థాపకురాలు సునీతా కృష్ణన్ వివరణ ఇచ్చారు. ఈ తీర్పును కొందరు తప్పుగా అర్థం చేసుకుంటూ ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ తీర్పు ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యభిచారాన్ని ప్రోత్సహించేదీ కాదని, బాధిత మహిళల భద్రత, గౌరవం, హక్కుల పరిరక్షణ కోసమే రూపొందించబడిందని ఆమె స్పష్టం చేశారు. బాధితులను నేరస్తులుగా కాకుండా బాధితులుగానే చూడాలన్నదే సుప్రీంకోర్టు ఉద్దేశమని చెప్పారు.
తీర్పు అసలు భావాన్ని వక్రీకరించకుండా బాధ్యతాయుతంగా ప్రజలకు చేరవేయాలని మీడియాకు సునీతా కృష్ణన్ సూచించారు.
