Begin typing your search above and press return to search.

వైసీపీలో మరో ఎంపీ పార్టీ మార్పు... క్లారిటీ వచ్చేసింది!

ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఫిరాయింపుల ట్రెండ్ ఊపందుకుంది. అసంతృప్తిని వెళ్లగక్కుతూ రాజీనామాలు, పార్టీలు మారడాలు, మెడలో కొత్త రంగు కండువాల సీజన్ స్టార్ట్ అయిపోయింది.

By:  Tupaki Desk   |   11 Jan 2024 11:21 AM GMT
వైసీపీలో మరో ఎంపీ పార్టీ మార్పు... క్లారిటీ వచ్చేసింది!
X

ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఫిరాయింపుల ట్రెండ్ ఊపందుకుంది. అసంతృప్తిని వెళ్లగక్కుతూ రాజీనామాలు, పార్టీలు మారడాలు, మెడలో కొత్త రంగు కండువాల సీజన్ స్టార్ట్ అయిపోయింది. ఈ సమయంలో ఎవరి కారణాలు వారికి ఉండటం అత్యంత సహజం. ఈ నేపథ్యంలో ఇన్ ఛార్జ్ ల మార్పు.. పైగా ఎంపీల విషయానికొస్తే అందరికీ స్థానచలనం వంటి కామెంట్లు వినిపిస్తున్న నేపథ్యంలో... ఒక్కో సిట్టింగ్ ఎంపీ గురించీ ఒక్కోరకమైన ఊహాగాణాలు తెరపైకి వస్తున్నాయి.

వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సిట్టింగ్ ఎంపీలందరినీ మారుస్తున్నట్లు కథనాలొస్తున్న వేళ ఇప్పటికే కర్నూలు ఎంపీ రాజీనామా ప్రకటించారు! ఇదే సమయంలో మరో ఇద్దరు ముగ్గురు ఎంపీల పేర్లు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో నెల్లూరు సిట్టింగ్ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా ప్రముఖంగా తెరపైకి వచ్చింది. దీంతో ఈ ఊహాగాణాలపై ఆయన స్పందించారు

అవును... నెల్లూరు సిట్టింగ్ ఎంపీ పార్టీ మారబోతున్నారంటూ వస్తున్న ఊహాగాణాలపై ఆదాల ప్రభాకర్ రెడ్డి స్పందించారు. ఇందులో భాగంగా.. తాను పార్టీ మారుతున్నానని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, అయితే తాను మాత్రం పార్టీ మరే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తనను నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇంచార్జ్‌ గా నియమించినప్పటి నుంచి.. తనపై కొంతమంది కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా... గతంలోనూ ఆదాల ప్రభాకర్‌ రెడ్డి టీడీపీలో చేరబోతున్నారనే ప్రచారం సాగిన సంగతి తెలిసిందే. ప్రధానంగా... కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రాం నారాయణ రెడ్డి వంటి అధికార పార్టీ నేతలు టీడీపీలో చేరిన సమయంలో... నెల్లూరు నుంచి మరింత మంది వైసీపీ నేతలు టీడీపీలో చేరతారనే ప్రచారం జరిగింది.

ఈ నేపథ్యంలోనే లోక్ సభ ఇన్ ఛార్జ్ లను మారుస్తున్న నేపథ్యంలో ఆదాలపై అలాంటి ఆరోపణలు వినిపించాయి. దీంతో ఈ విషయాలపై ఆయన సీరియస్ గా స్పందించారు. వచ్చే ఎన్నికల్లో నెలూరు రూరల్ నుంచి పోటీ చేస్తా అని.. గెలిచి తీరుతానని విశ్వాసం వ్యక్తం చేశారు.