Begin typing your search above and press return to search.

మాట నిలుపుకుంటివయ్యా జగన్... తెరపైకి నీతి ఆయోగ్ రిపోర్ట్!

అభివృద్ధి అంటే రోడ్లు.. భవనాలు.. ప్రాజెక్టులు మాత్రమే అనేది ఇదివరకటి పాలకుల భావన!

By:  Tupaki Desk   |   22 July 2023 7:36 PM IST
మాట నిలుపుకుంటివయ్యా జగన్... తెరపైకి నీతి ఆయోగ్  రిపోర్ట్!
X

అభివృద్ధి అంటే రోడ్లు.. భవనాలు.. ప్రాజెక్టులు మాత్రమే అనేది ఇదివరకటి పాలకుల భావన! కానీ "దేశమంటే మట్టికాదోయ్... దేశమంటే మనుషులోయ్" అని ప్రవచించిన గురజాడ అడుగుజాడల్లో నడుస్తూ మన రాష్ట్రంలోని ప్రజల అభివృద్దే రాష్ట్రాభివృద్ధి అని సరికొత్త నినాదం ఇచ్చారు.

మనసున్న ప్రభుత్వం ఉంటే ఇలాంటి ఫలితాలే వస్తాయి... "పాలన అంటే అధికారం" అనుకునే చాలామంది పాలకులకు భిన్నంగా.. "పాలన అంటే బాధ్యత” అని కొత్త నిర్వచనం చెప్పి ముందడుగు వేసిన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆలోచన మంచి ఫలితాలను సాధిస్తోంది.

అందుకే రాష్ట్రమంతా పేదలే ఉండి.. రోజు గడవడమే ఇబ్బందిగా ఉంటే... ఎత్తైన బిల్డింగులు నిర్మించి, ఆరులైనల్ రోడ్లు వేసేస్తే ప్రయోజనం ఏముంది? ముందు రాష్ట్ర ప్రజలను పేదరికం నుంచి దూరం చేయాలి.. పేదరికం తగ్గాలి అనే సంకల్పంతో నాలుగేళ్లుగా పాలన సాగించిన సీఎం జగన్ ఆలోచన ఇప్పుడు సత్ఫలితాలను ఇస్తోంది.

"నా పేదలు.. నా బీసీలు... నా ఎస్సీలు... నా ఎస్టీలు" అని తరచూ కలవరించే జగన్.. తాజాగా ఆ విషయంలో సక్సెస్ అయ్యారు. వారి జీవితాలను పేదరికానికి దూరంగా జరిపి వారి ఇళ్లలో వెలుగులు.. కళ్ళలో కాంతులు నింపారు!

కేంద్రం చెబుతున్న వాస్తవాలివి!:

మనగురించి మనం చెప్పుకోవడం.. మనవల్ల కాకపోతే మన భజనపరులతో చెప్పించుకోవడం.. మన జబ్బలు మనం చరుచుకోవడం.. మన భూజాన్లు మనం చరుచుకోవడం.. ఎంతముద్దుగా ఉన్నానో అంటూ మన చెంపలు మనం ముద్దాడుకోవడం కాదు.

పక్కోళ్లు.. ఇరుగుపొరుగోళ్ళు.. కుదిరితే పక్కూరి వాళ్ళు.. పక్కజిల్లావాళ్ళు పొగడాలి. అంతకంటే ముందు శత్రువులు సైతం చీకట్లో అయినా పొగుడుకోవాలి. ఆ స్థాయిలో మన పనితనం ఎల్లలు దాటాలి. సరిగ్గా ఇదే విధంగా పేదల సంక్షేమం.. పేదరిక నిర్మూలన కోసం అహోరాత్రులు కృషిచేస్తున్న జగన్ మోహన్ రెడ్డి కష్టానికి ప్రతిఫలం వచ్చింది.

నాలుగేళ్ళ క్రిందట ఆయన వేసిన సంక్షేమ మొలకలు మొక్కలయ్యాయి.. చెట్లయ్యాయి.. కాపు కాస్తున్నాయి.. మహా వృక్షాలుగా మారబోతున్నాయి.. పేదల ఇళ్లలో పూలు.. పళ్ళు ఇస్తున్నాయి. ఇవి సోషల్ మీడియాలో అనుచరులు వేస్తున్న పోస్టులు కాదు.. కేంద్ర ప్రభుత్వం చెబుతున్న మాట.

అవును… 2016లో ఆంధ్రాలో పేదరికం 11.7 శాతం ఉండగా 2021 నాటికి అది 6.06 శాతానికి తగ్గింది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో అయితే 2016 నాటికి 14.72 శాతం పేదరికం ఉండగా అది 2021 నాటికి 7.71 శాతానికి తగ్గింది. అదే సమయంలో పట్టణ ప్రాంత పేదరికం 4.63 శాతం నుంచి 2.20 శాతానికి తగ్గినట్లు కేంద్రప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ వెల్లడించింది.

సంక్షేమ పథకాలే పహారా సైనికులు:

రాష్ట్రంలో జగనన్న అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేదల పాలిట కావలి కోటలుగా నిలిచాయి. ఈ పథకాలను దాటుకుని ప్రజల ఇళ్లలోకి పేదరికం చొరబడడం అసాధ్యం అవుతోంది. ఉచిత విద్య, వైద్యం, రైతులకు భరోసా, బాలలకు పౌస్టికాహారం, గర్భిణులకు ఇచ్చే ప్రత్యేక ఆహారం వంటివి ప్రజలకి ఎంతగానో మేలు చేశాయి. ఇలా ఏ వర్గాన్నీ వదలకుండా సంక్షేమ పథకాలు అనే రాతి గోడను నిర్మించిన జగన్.. ఆ గోడ దాటి పేదరికం ఆయా ఇళ్లలోకి రావడానికి ఏ చిన్న అవకాశం ఇవ్వడం లేదు.

ఇల్లు దాటి కదల్లేని వృద్ధులకు సైతం ఇళ్లకే పెన్షన్లు... ఇంటి ముంగిటకు ఆరోగ్య సేవలు అందిస్తూ పేదరికపు కాటు నుంచి ప్రజల్ని కాపాడే సైనికుడి బాధ్యత జగనన్న తీసుకున్న నేపథ్యంలో.. రాష్ట్రంలో పేదరికపు ఛాయలు తగ్గుతూ వస్తున్నాయి. ప్రజలు సంక్షేమ రాజ్యంలో సుభిక్షంగా ఉండటంతోపాటు.. పోషకాహారం తీసుకుంటూ ఉన్నత జీవన ప్రమాణాలు పొందుతున్నట్లు నీతి ఆయోగ్ వెల్లడించింది.

ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాల వారీగా చంద్రబాబు పాలనలో ఉన్న పేదరికం.. జగన్ పాలన చేపట్టిన తర్వాత తగ్గిన పేదరికం లెక్కలు సవివరంగా విడుదలయ్యాయి.

ఈ లెక్కల ప్రకారం...

విజయనగరం జిల్లాలో గతంలో 19 శాతం పేదరికం ఉండగా... జగన్ పాలనలో అది 8.66శాతానికి పడిపోయింది. అంటే సగానికంటే పైగా, సుమారు 54.42శాతం పేదరికాన్ని తగ్గించి చూపించారు జగన్.

శ్రీకాకుళం జిల్లాల్లో చంద్రబాబు పాలన సమయంలో పేదరికం 14.01శాతం ఉండగా... జగన్ హయాంలో అది 5.20శాతానికి పడిపోయింది. అంటే పేదరికంలో తగ్గుదల సుమారు 62.88శాతం అన్నమాట.

ఇక విశాఖ జిల్లా విషయానికొస్తే... చంద్రబాబు సమయంలో 15.10% పేదరికం ఉండగా... జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత 7.60 శాతానికి తగ్గింది. ఈ లెక్కన చూసుకుంటే 49.66% మేర పేదరికం జగన్ పాలనలో తగ్గిందన్నమాట.

ఉత్తరాంధ్ర జిల్లాల సంగతి అలా ఉంటే... ఇక గోదావరి జిల్లాలతోపాటు కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిలాల్లో జగన్ పేదరికంలో తీసుకొచ్చిన తగూదల ఎంతనేది ఇప్పుడు చూద్దాం.

కడప జిల్లాల్లో చంద్రబాబు హయాంలో పేదరికం 9.14% ఉండగా... జగన్ పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత ఈ పేదరికం 3.34 శాతానికి పడిపోయింది. తగ్గుదల 63.45 శాతం మేర పేదరికం తగ్గిపోయిందన్నమాట.

ఇక కర్నూలు విషయానికొస్తే... 19.64శాతం పేదరికం చంద్రబాబు హయాంలో ఉండగా... జగన్ సీఎం అయిన తర్వాత వీరి సంఖ్య 12.84శాతానికి పడిపోయింది. ఫలితంగా... సుమారు 34.62శాతం పేదలు తగ్గిపోయారన్నమాట.

ఇక అనంతపురం జిల్లా విషయానికొస్తే... చంద్రబాబు పాలనలో ఈ జిల్లాలో 12.47% ప్రజలు పేదరికంలో మగ్గిపోతే... జగన్ సీఎం అయిన తర్వాత ఈ పేదరికంలో 6.74శాతానికి తగ్గిపోయింది. అంటే... సుమారు 45.95 శాతం తగ్గుదల జగన్ హయాంలో నమోదైందన్నమాట.

ఇక మరో రాయలసీమ జిల్లా చిత్తురు విషయానికొస్తే... చంద్రబాబు హయాంలో తన సొంత జిల్లాలో 9.64 శాతం పేదరికంతో జనం మగ్గుతుంటే... జగన్ సీఎం అయినతర్వాత వీరి సంఖ్య 5.66శాతానికి పడింది. అంటే... చంద్రబాబు సొంత జిల్లాలో జగన్ సీఎం అయిన తర్వాత 41.28 శాతం పేదరికం తగ్గిందన్న మాట.

ఇక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా విషయానికొస్తే... ఈ జిల్లాలో చంద్రబాబు హయాంలో పేదరికం 8.51% ఉండగా... జగన్ హయాంలో 6.13శాతానికి తగ్గింది. అంటే... 27.96శాతం పేదరికం తగ్గిందన్న మాట.

ఇక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా విషయానికొస్తే... ఈ జిల్లాలో టీడీపీ పాలనలో పేదరికం 9.11శాతం ఉండగా... వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2.42శాతానికి పేదరికం పడిపోయింది. అంటే... 73.43శాతం పేదలు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జగన్ హయాంలో తగ్గిపోయారన్నమాట.

ఇక కృష్ణాజిల్లా విషయానికొస్తే... 8.69% పేదరికం చంద్రబాబు హయాంలో ఉండగా... అది జగన్ పాలనలో 4.38 శాతానికి పడిపోయింది. ఫలితంగా... 49.59శాతం పేదలు తగ్గారన్నమాట.

ఇక గుంటూరు జిల్లా విషయానికొస్తే... చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 7.26% పేదరికం ఉంటే... జగన్ ముఖ్యమంత్రి అయినతర్వాత 4.36శాతానికి తగ్గింది. అంటే జగన్ సీఎం అయ్యాక గుంటూరు జిల్లాలో సుమారు 39.94శాతం పేదరికం తగ్గింది.

ఇక ప్రకాశం జిల్లాలో పరిస్థితిని గమనించినట్లయితే... చంద్రబాబు హయాంలో ఈ ఉమ్మడి జిల్లాలో పేదరికం 13.84% ఉండగా.. జగన్ సీఎం అయ్యాక 6.28శాతానికి పేదరికం పడిపోయింది. అంటే... 54.62 శాతం తగ్గింది.