Begin typing your search above and press return to search.

రూ.10 వేలకే వీసాలు.. త్వరపడండి

కనీసం 18 ఏళ్లు నిండిన ఐరోపాయేతర దేశ పౌరులు ఈ వీసాకు అర్హులు. నెలవారీ జీతం కనీసం 3,480 యూరోలు (సుమారు రూ.3.53 లక్షల కంటే ఎక్కువ) ఉండాలి.

By:  Tupaki Desk   |   26 July 2025 12:00 AM IST
రూ.10 వేలకే వీసాలు.. త్వరపడండి
X

ప్రపంచవ్యాప్తంగా 'వర్క్ ఫ్రమ్ హోమ్', 'రిమోట్ వర్కింగ్' సంస్కృతి విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఉద్యోగులు, ఫ్రీలాన్సర్‌ల కోసం అనేక దేశాలు ప్రత్యేక వీసాలను అందుబాటులోకి తెస్తున్నాయి. ఈ కోవలోనే పోర్చుగల్, జర్మనీ దేశాలు తక్కువ ఖర్చుతో కూడిన వీసాలను అందిస్తూ, తమకు నచ్చిన ప్రదేశం నుంచే పని చేయాలనుకునే వారికి అద్భుతమైన అవకాశాలను కల్పిస్తున్నాయి.

పోర్చుగల్ డిజిటల్ నోమాడ్ వీసా.. కేవలం రూ.9,156కే!

పోర్చుగల్ ప్రభుత్వం డిజిటల్ నోమాడ్‌ల కోసం రెండు రకాల వీసాలను అందిస్తోంది. మొదట 4 నెలల చెల్లుబాటుతో లభించే ఈ వీసాను 2 ఏళ్లకు, ఆ తర్వాత మరో 3 ఏళ్లకు రెన్యూవల్ చేసుకోవచ్చు. మొత్తం 5 ఏళ్ల తర్వాత పోర్చుగల్ పౌరసత్వానికి దరఖాస్తు చేసుకునే అర్హత లభిస్తుంది.12 నెలల పాటు చెల్లుబాటయ్యే ఈ వీసా, ఈ కాలంలో ఎన్నిసార్లయినా దేశంలోకి వెళ్లి రావడానికి అనుమతిస్తుంది. దీనిని నాలుగు సార్లు రెన్యూవల్ చేసుకోవచ్చు, అయితే ఇది శాశ్వత నివాసానికి మాత్రం ఉపయోగపడదు.

-అర్హతలు:

కనీసం 18 ఏళ్లు నిండిన ఐరోపాయేతర దేశ పౌరులు ఈ వీసాకు అర్హులు. నెలవారీ జీతం కనీసం 3,480 యూరోలు (సుమారు రూ.3.53 లక్షల కంటే ఎక్కువ) ఉండాలి. హెల్త్ ఇన్సూరెన్స్, పాస్‌పోర్ట్, ఉద్యోగ ధ్రువీకరణ, నేరచరిత్ర లేకపోవడం తప్పనిసరి.

దరఖాస్తు విధానం:

అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకుని పోర్చుగీస్ కాన్సులేట్ లేదా ఎంబసీలో దరఖాస్తు చేయాలి. వీసా ఫీజు 90 యూరోలు (సుమారు రూ.9,156). లాంగ్ టర్మ్ వీసా పొందినవారు దేశంలోకి వెళ్ళిన వెంటనే నివాస అనుమతికి దరఖాస్తు చేసుకోవాలి.

కుటుంబ సభ్యులతో వెళ్లే అవకాశం, పోర్చుగల్‌లో పని చేయడంపై రాజ్యాంగ హక్కు, పౌరసత్వం పొందే అవకాశం వంటివి ప్రధాన లాభాలు ఉన్నాయి.. నెల జీతం ఎక్కువగా ఉండాలి, వీసా ప్రాసెసింగ్ వేగం తక్కువ, మరియు జీవన వ్యయం అధికంగా ఉండటం కొన్ని ఇబ్బందులు.

జర్మన్ ఫ్రీలాన్స్ వీసా – కేవలం రూ.7,486!

జర్మనీ కూడా రిమోట్ వర్కర్ల కోసం ప్రత్యేక వీసాను అందిస్తోంది. దీని ఫీజు కేవలం 75 యూరోలు (సుమారు రూ.7,486).

ముఖ్యమైన షరతులు:

నెలవారీ కనీస జీతం 1,280 యూరోలు ఉండాలి. జర్మనీలో దిగిన 15 రోజుల్లో పౌరసేవల కార్యాలయంలో రిజిస్టర్ కావాలి. విదేశాంగశాఖ కార్యాలయం నుండి నివాస అనుమతి తీసుకోవాలి.

లాభాలు:

మూడేళ్లపాటు జర్మనీలో ఉండే అవకాశం, రెన్యూవల్ సదుపాయం, ఐదేళ్ల తర్వాత శాశ్వత నివాసం, ఆపై పౌరసత్వానికి దరఖాస్తు చేసుకునే అవకాశం ఈ వీసా ద్వారా లభిస్తాయి. స్థానిక ట్యాక్స్ ఐడీ కూడా పొందవచ్చు.

వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ, సరైన ప్రణాళికతో, అవసరమైన డాక్యుమెంట్స్‌తో సిద్ధమైతే, పోర్చుగల్, జర్మనీ వంటి దేశాల్లో నివసిస్తూ పని చేయడం ద్వారా ప్రపంచస్థాయి అనుభవం పొందవచ్చు. తక్కువ ఖర్చుతో విదేశాల్లో పనిచేయాలనుకునే వారికి ఈ వీసాలు నిజంగానే సువర్ణావకాశాలు. మీ కెరీర్‌ను కొత్త దారిలో తీసుకెళ్లేందుకు ఇది సరైన సమయం.