Begin typing your search above and press return to search.

సిస్టీన్ చాపెల్ నుంచి తెల్లటి పొగ... పూర్తైన కొత్త పోప్ ఎంపిక!

గురువారం నాడు సిస్టీన్ చాపెల్ నుంచి తెల్లటి పొగ పైకి లేచింది. సెయింట్ పీటర్స్ గంటలు మోగాయి.

By:  Tupaki Desk   |   9 May 2025 3:44 AM
Historic Moment Robert Prevost Elected as Pope Leo First American Pope
X

గురువారం నాడు సిస్టీన్ చాపెల్ నుంచి తెల్లటి పొగ పైకి లేచింది. సెయింట్ పీటర్స్ గంటలు మోగాయి. దీంతో.. కార్డినల్స్ పోప్ ఫ్రాన్సిస్ స్థానంలో కొత్త పోప్ ను ఎన్నుకున్నారనే విషయం వెలుగులోకి వచ్చింది.. ఆయనే రోమన్ కాథలిక్ చర్చి బాధ్యతలు స్వీకరించారని సూచిస్తుంది.. ఆ నూతన పోప్ పేరు.. రాబర్ట్ ప్రవోస్ట్!

అవును... 1.4 బిలియన్ సభ్యులతో కూడిన చర్చిని 12 సంవత్సరాలు పాలించిన తర్వాత పోప్ ఫ్రాన్సిస్ ఏప్రిల్ 21న మరణించిన సంగతి తెలిసిందే. దీంతో.. కొత్త పోప్ ఎవరనే చర్చ మొదలైంది. ఈ సమయంలో 133 మంది కార్డినల్ లు శతాబ్ధాల నాటి సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. వాటికన్ మద్యయుగ గోడల వెనుక అత్యంత రహస్యంగా సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా నూతన పోప్ గా అమెరికాకు చెందిన రాబర్ట్ ప్రవోస్ట్ ను ఎన్నుకున్నారు. ఆయన్ను ఇకపై పోప్ లియోగా పిలువనున్నారు. ఈ ఎంపికకు సూచికగా వాటికన్ లోని సిస్టీన్ చాపెల్ చర్చి పొగగొట్టం నుంచి తెల్లటి పొగ వెలువడింది. దీంతో సెయింట్ పీటర్స్ స్క్వేర్ లోని సమూహం ఆనందోత్సాహాల మధ్య హర్షధ్వానాలు చేసింది.

ఈ సందర్భంగా అత్యునంత కార్డినల్ కొత్త పోప్ పేరు ప్రకటించారు. తొలుత నూతన పోప్ పుట్టిన పేరును లాటిన్ లో చదివి, అనంతరం "పోప్ లియో" పేరును వెల్లడించారు. అనంతరం నూతన పోప్.. "పోప్ లియో" తొలిసారిగా బహిరంగంగా ప్రజలకు కనిపించారు. కాగా.. పోప్ గా అమెరికన్ ఎన్నిక కావడం చరిత్రలో ఇదే తొలిసారి!