Begin typing your search above and press return to search.

ఐక్య రాజ్యసమితిలో మెరిసిన పేద పిల్లలు

ఆంధ్రప్రదేశ్ నుంచి పది ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్ధినీ విద్యార్ధులు ఈ నెల 15 నుంచి 28 దాకా అమెరికాలో పర్యటించనున్నారు.

By:  Tupaki Desk   |   18 Sep 2023 1:30 AM GMT
ఐక్య రాజ్యసమితిలో మెరిసిన పేద పిల్లలు
X

వారు నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలు. తల్లిదండ్రులు దినసరి కూలీలుగా ఆటో డ్రైవర్లుగా, మెకానిక్కులుగా, సెక్యూరిటీ గార్డులుగా, లారీ డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. అంటు వంటి వారి కుటుంబం నుంచి వచ్చిన పిల్లలు హైదరాబాద్ వెళ్లాలంటేనే కష్టం అనుకొవాలి.

కానీ వారు ఒక్కసారిగా ఐక్యరాజ్యసమితిలో మెరిసారు. దాదాపుగా పదిహేను రోజుల పాటు వారు అక్కడ పర్యటించే సౌభాగ్యాన్ని పొందారు. ఇదంతా ఎలా సాధ్యం అంటే ఏపీలో వైసీపీ ప్రభుత్వం విద్యారంగం మీద పెట్టిన శ్రద్ధ, చూపించిన స్పేషల్ ఫోకస్ వల్లనే అని అంటున్నారు

ఆంధ్రప్రదేశ్ నుంచి పది ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్ధినీ విద్యార్ధులు ఈ నెల 15 నుంచి 28 దాకా అమెరికాలో పర్యటించనున్నారు. ఐక్య రాజ్యసమితిలో జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈ విద్యార్ధులు వెళ్లారు.

అక్కడ అమెరికా అధికారులు ఈ విద్యార్ధి బృందాన్ని వరల్డ్ బ్యాంక్, యూస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్, కొలంబియా యూనివర్సిటీ, వాషింటన్ డీసీలోని వైట్ హౌజ్ ని సందర్శించాల్సిందిగా ఆహ్వానించడం అనుమతి ఇవ్వడం గొప్ప విశేషంగా చూడాల్సి ఉంది.

ఏపీలో చిన్న పల్లెలలో తమ చదువులతో తమ ఊరికే పరిమితమైన ఈ సామాన్య బడుగు విద్యార్ధులు ఇపుడు అమెరికాలో పర్యటించడం అంటే అంతకంటే అద్భుతం వేరేది లేదు అనుకోవాల్సిందే. ఈ విద్యార్ధినీ విధ్యార్దులు న్యూయార్క్ లోని ఐక్య రాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో జరుగుతున్న సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ అన్న కారక్రమానికి హాజరయ్యేందుకు ఆహ్వానం అందుకున్నారు.

ఇలా ఒక అంతర్జాతీయ సమ్మిట్ లో పాల్గొనే అవకాశం ఏపీ విద్యార్ధులకు లభించడం ఇదే ప్రధమం అని అంటున్నారు అధికారులు. ఈ సమ్మిట్ లో ఏపీ విద్యార్ధులు ప్రసంగించే భాగ్యాన్ని పొందారు. ఏపీలో అమలు అవుతున్న నాడు నేడు, జగనన్న అమ్మ ఒడి, జగనన్న విద్యా కానుక, జగనన్న వసతి దీవెన వంటి వాటి గురించి ఐక్య రాజ్య సమితి వేదిక మీద వివరిస్తారు.

ఏపీలో విద్యా సంస్కరణలు ఎలా అమలవుతున్నాయన్నది ఈ చిన్నారులు ప్రపంచానికి తెలియచేస్తారు. ఏపీ ప్రభుత్వం సర్కార్ బడులలో అమలు చేస్తున్న ద్విభాషా విధ్యా విధానం. పాఠ్యాంశాలు, టాబ్లెట్స్, డిజిటల్ క్లాస్ రూంస్, ఆంగ్ల విద్యా బోధన, కరికులం లో కొత్త మార్పులు వంటివి కూడా ప్రస్తావిసారని అధికారులు చెబుతున్నారు.

ఒక అత్యున్నతమైన అంతర్జాతీయ వేదిక మీద ఏపీలోని పేద విద్యార్ధులు తమ గళం విప్పి మాట్లాడం కంటే విజయం మరోటి లేదని అంటున్నారు. ఏపీలో అమలవుతున్న కార్యక్రమాలు రాజకీయ నేతలు అధికారులు చెప్పడం వేరు, వాటి ఫలాలు ఫలితాలు అనుభవిస్తున్న భావి తరాల విద్యార్ధులు చెప్పడమే గొప్ప విషయం.

ఒక విధంగా ఇది ఏపీకి గర్వకారణం అయిన విషయం అంటున్నారు. అమెరికాకు వెళ్లడం అంటే పేదలకు వల్ల కాని పని. కేవలం ఏపీలోని విద్యా సంస్కరణల వల్లనే పేద విద్యార్ధులకు ఈ సువరణ అవకాశం దక్కింది, ఐక్య రాజ్య సమితి చూపు కూడా ఏపీ వైపు పడిందని అంటున్నారు. సో ఐక్య రాజ్య సమితి వెళ్ళిన విద్యార్ధులందరికీ బెస్ట్ ఆఫ్ లక్ చెప్పేద్దాం.