Begin typing your search above and press return to search.

పూనం కౌర్ : ప్రజ్వల్ సేఫ్ ల్యాండింగ్

‘’ప్రజ్వల్ రేవణ్ణ సేఫ్ గా జర్మనీకి పారిపోయాడు. ఆయనకు ఎంతో డబ్బు, పలుకుబడి ఉన్నాయి.

By:  Tupaki Desk   |   30 April 2024 9:49 AM GMT
పూనం కౌర్ : ప్రజ్వల్ సేఫ్ ల్యాండింగ్
X

‘’ప్రజ్వల్ రేవణ్ణ సేఫ్ గా జర్మనీకి పారిపోయాడు. ఆయనకు ఎంతో డబ్బు, పలుకుబడి ఉన్నాయి. అందుకే ఈ ప్రభుత్వం ఆయనను ఏమీ చేయలేకపోయింది. అందుకే ఆయన సేఫ్ గా జర్మనీకి వెళ్లిపోయాడు’’ సినీ నటి పూనం కౌర్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. సోషలి మీడియాలో యాక్టివ్ గా ఉండే పూనమ్ ఈ అంశంపై స్పందించడం కలకలం రేపుతున్నది.

మాజీ ప్రధాని దేవెగౌడ పెద్ద కుమారుడు రేవణ్ణ కుమారుడు ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అసభ్యకర వీడియోల అంశం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. దాదాపు 3 వేల వీడియోలు వెలుగులోకి రావడం అందరినీ విస్మయానికి గురిచేసింది.

ఈ నేపథ్యంలో కర్ణాటక హసన్ పార్లమెంట్ ఎన్నికలు ముగిశాక ప్రజ్వల్ జర్మనీకి వెళ్లిపోవడం వెనక బీజేపీ సహకారం ఉందన్న సమాచారం ఇప్పుడు విమర్శలకు దారితీస్తున్నది.

రేపిస్టులను బీజేపీ దేశం దాటిస్తుందని, కేవలం రాజకీయ ప్రయోజనాలు తప్ప బీజేపీకి ప్రజల ప్రయోజనాలు పట్టవని విమర్శలు వస్తున్నాయి. మరో 5 విడతల ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ వ్యవహారం ఎక్కడికి దారితీస్తుందో వేచి చూడాలి.