Begin typing your search above and press return to search.

బండి సంజయ్ అవినీతిపై కిషన్ రెడ్డి నోరు విప్పాలి: పొన్నం

ఈటల రాజేందర్ కు బండి సంజయ్ కు మధ్య విభేదాలున్నాయని, వారిద్దరికీ పడదని పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి.

By:  Tupaki Desk   |   20 March 2024 11:43 AM GMT
బండి సంజయ్ అవినీతిపై కిషన్ రెడ్డి నోరు విప్పాలి: పొన్నం
X

మంత్రి పొన్నం ప్రభాకర్ పై బీజేపీ ఎంపీ బండి సంజయ్ కొద్దిరోజుల క్రితం సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బండి సంజయ్ వ్యాఖ్యలకు పొన్నం ప్రభాకర్ కూడా దీటుగా కౌంటర్ ఇచ్చారు. తన తల్లిని బండి సంజయ్ అవమానించారంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి బండి సంజయ్ వర్సెస్ పొన్నం ప్రభాకర్ అన్న రీతిలో మాటల యుద్ధం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా బండి సంజయ్ పై పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈటల రాజేందర్ కు బండి సంజయ్ కు మధ్య విభేదాలున్నాయని, వారిద్దరికీ పడదని పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి.

కరీంనగర్ కు బండి సంజయ్ ఏం చేశారో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఆస్కార్ అవార్డు పొందే రేంజ్ లో బండి సంజయ్ నటిస్తున్నారని సెటైర్లు వేశారు. సెప్టెంబర్ లో బీఆర్ఎస్ అధికారంలో ఉందని, తాము డిసెంబర్లో అధికారంలోకి వచ్చామని, అది వర్షాకాలం కాదని చెప్పారు. పంట నష్టం గురించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా బండి సంజయ్ ను ఎందుకు తొలగించారో సమాధానం చెప్పాలని పొన్నం డిమాండ్ చేశారు. బండి సంజయ్ పై అవినీతి ఆరోపణలు వచ్చినందునే ఆయనను తొలగించారని ఆరోపించారు.

కారణం లేకుండా తనమీద బండి సంజయ్ అభాండం వేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే తాను సజీవ దహనానికైనా సిద్ధం అని సవాల్ విసిరానని, కానీ, తనపై ఆరోపణలు బండి సంజయ్ నిరూపించలేక సైలెంట్ గా ఉన్నారని చెప్పుకొచ్చారు. బండి సంజయ్ అవినీతిపరుడు కాదని కిషన్ రెడ్డి చెప్పాలని పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. తన వాయిస్ రికార్డ్ చేసిన ఆర్డీవోపై చీఫ్ సెక్రటరీకి ఫిర్యాదు చేశానని, చర్యలు తీసుకుంటారని చెప్పుకొచ్చారు.

ఉచిత బస్సుల్లో ఇప్పటిదాకా 30 కోట్ల మంది మహిళలు ప్రయాణించారని అన్నారు. బండి సంజయ్ అవినీతిపై తెలంగాణ రాష్ట్రం కోడై కూస్తుందని, దానికి ఆయన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కిషన్ రెడ్డిని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా కేసీఆర్ అపాయింట్ చేయించారని సంచలన ఆరోపణలు చేశారు. సిట్టింగ్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ ఎమ్మెల్యేగా ఓడిపోయారని ఎద్దేవా చేశారు. గంగుల కమలాకర్ బండి సంజయ్ ల మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని ఆరోపించారు.