Begin typing your search above and press return to search.

100శాతం పోలింగ్ నమోదవ్వాలంటే ఆ రూల్స్ రావాల్సిందేనా?

కొనసాగాలన్నా ప్రజలు ఓటును తప్పనిసరిగా వినియోగించుకోవాలి. ఈ ఓటు పైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది

By:  Tupaki Desk   |   29 Nov 2023 12:57 PM GMT
100శాతం పోలింగ్ నమోదవ్వాలంటే ఆ రూల్స్ రావాల్సిందేనా?
X

కొనసాగాలన్నా ప్రజలు ఓటును తప్పనిసరిగా వినియోగించుకోవాలి. ఈ ఓటు పైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఓటు హక్కు వినియోగించుకోవడం అందరి బాధ్యత. మన తల రాతల్ని మార్చేసే నాయకుల రాతలను ఒక్క సిరా చుక్కతో.. వేలికోనలతో మార్చేసే అవకాశం ఓటుతో వస్తుంది. ఇలా ఎన్ని చెప్పినా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచీ 100శాతం పోలింగ్ కి భారత్ నోచుకోలేదు!

ఓటు వేయాలంటే వాహనాలు ఉచితంగా ఏర్పాటు చేస్తుంటారు. తాజాగా హైదరాబాద్ లో రాపిడో బైక్ సంస్థ అలాంటి అవకాశమే ఇచ్చింది. ఇక ఆ రోజు ఆఫీసులకు సెలవులు కూడా ఇస్తున్నారు. అయినప్పటికీ... ఓటు వేయడం కనీస బాధ్యత అనే ఇంగితం సగటు ఓటరు మరిచిపోతున్నాడనే విమర్శలు ఎన్నికలు వచ్చిన ప్రతీసారీ వినిపిస్తుంటాయి. ఓటు విలువ గురించి ఎంతమంది ఎన్ని విధాలుగా ప్రయత్నించినా... సగటు ఓటరులోని బద్దకమో, నిర్లక్ష్యమో... బూత్ వరకూ రానివ్వకుంది!

దీంతో... ఓటు హక్కు వినియోగించుకోకపోవడం దేశానికి ద్రోహం చేస్తున్నట్లే అనే కొందరి వాదనకు కొన్ని పాశ్చాత్య దేశాలను ఉదాహరణగా చూపుతున్నారు! ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సుమారు 22 దేశాల్లో నిర్బంధ ఓటు హక్కు ఉంది. అంటే... ఎట్టిపరిస్థితుల్లోను పౌరులు ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందే! అలా కానిపక్షంలో జైలు శిక్షలు, జరిమానాలు, జీతాలు ఇవ్వకపోవడాలు, డ్రైవింగ్ లైసెన్స్లు రద్దు చేయడాలు వంటి ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి!

అవును... ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్, ఈజిప్టు, అర్జెంటీనా, బ్రెజిల్‌, బెల్జియం, ఈక్వెడార్, గ్రీస్, పెరూ, బొలీవియా, ఆస్ట్రియా, ఇటలీ, పరాగ్వే, టర్కీ, థాయ్ ల్యాండ్, సింగపూర్‌ లలో నిర్బంధ ఓటు హక్కు ఉంది. ఈ దేశాల్లో ఓటు హక్కు వినియోగించుకోకపోతే... వారికి రకరకాల శిక్షలు విధిస్తుంటారు. ఇందులో భాగంగా... పెరూ, సింగపూర్, బ్రెజిల్, ఈక్వెడార్, బెల్జియం, ఆస్ట్రియా దేశాల్లో ఓటు వేయని ప్రజలకు జరిమానాలు విధిస్తారు.

ఇందులో భాగంగా... బెల్జియం దేశంలో ఓటు హక్కు వినియోగించుకోకపోతే కోర్టుకు హాజరు కావాల్సి వస్తుంది. ఒకవేళ నాలుగేళ్ళు వరుసగా ఓటు వేయకపోతే.. ఆ తర్వాత పదేళ్ళ పాటు ఓటు హక్కు రద్దుచేస్తారు. ఇదే సమయంలో... ఓటు వేయని వారు ప్రభుత్వ ఉద్యోగానికి అర్హత కోల్పోతారు. అర్జెంటీనాలో ఓటు వేయనివారికి ఏడాది పాటు ప్రభుత్వ పథకాలు కట్ అయిపోతాయి.

ఇదే క్రమంలో... పెరూలో ఓటు వేయనివారి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తారు. గ్రీస్, ఈజిప్ట్ దేశాల్లో ఓటు వేయకపోతే... ప్రభుత్వానికి సరైన కారణం చెప్పాలి. అలాకానిపక్షంలో జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. బ్రెజిల్‌ లో ఓటు వేయకపోతే జరిమానా విధిస్తారు. ఇదే సమయంలో బొలీవియాలో ఓటు వేయని వారికి జీతాలు కూడా ఇవ్వరు. ఇలా అనేక దేశాల్లో ఓటు వేయని వారిపట్ల కఠినంగా వ్యవహరించే చట్టాలు ఉన్నాయి.

కానీ భారతదేశంలో మాత్రం అవి లేవు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 74 గడిచినా ఇప్పటివరకు ఏనాడూ 100 శాతం ఓటింగ్ నమోదు కాలేదంటే... ఇతర దేశాల్లో అమలవుతున్న చట్టాలు భారత్ లో కూడా అవసరమేమో అనే చర్చకు దారితీస్తున్నాయి.