Begin typing your search above and press return to search.

మధ్యాహ్నం 3 గంటలకు జిల్లాలవారీగా పోలింగ్‌ వివరాలివే!

ఈ రోజు ఉదయం నుంచీ వృద్ధులు, విక‌లాంగులు, పేషంట్లు కూడా వ‌చ్చి ఈ ఎన్నిక‌ల్లో పాలు పంచుకుంటున్నారు.

By:  Tupaki Desk   |   30 Nov 2023 10:43 AM GMT
మధ్యాహ్నం 3 గంటలకు జిల్లాలవారీగా పోలింగ్‌ వివరాలివే!
X

తెలంగాణ వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్‌ కొనసాగుతోంది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల దగ్గర జనం బారులు తీరారు. ఈ సమయంలో ఉదయం పోలింగ్ ప్రారంభంలో కొన్నిచోట్ల ఈవీఎంలు మొరాయించాయి. దీంతో పలుచోట్ల గంట ఆలస్యంగా పోలింగ్‌ ప్రారంభమైంది. ఈ సమయంలో ఆశించిన స్థాయిలో పోలింగ్ నమోదవుతుందా లేదా అనేది ఆసక్తిగా మారింది.

ఈ రోజు ఉదయం 7 గంటలకు పోలింగ్ నమోదవ్వగా... ఉదయం 9 గంటల నాటికి 7.78 శాతం పోలింగ్ నమోదైంది. ఈ క్రమంలో ఉదయం 11 గంటల వరకూ 20.64శాతం మధ్యాహ్నం 1 గంటకు 36.68 శాతం నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఈ క్రమంలో మధ్యాహ్నం 3 గంటల వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్‌.. 51.89శాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.

ఈ పోలింగ్ నమోదైన ప్రాంతాల్లో అత్యధికంగా మెదక్ లో మధ్యాహ్నం 3 గంటలకు 69.33% నమోదవ్వగా... చాలా మంది ఆందోళన వ్యక్తం చేసినట్లుగానే హైదరాబాద్ లో అత్యల్పంగా 31.17% పోలింగ్ నమోదైంది. ఈ క్రమంలో జిల్లాల వారీగా పోలింగ్ శాతం ఎలాగ ఉందనేది ఇప్పుడు చూద్దాం!

ఆదిలాబాద్ 62.34%

భద్రాద్రి 58.38%

హనుమకొండ 49.00%

హైదరాబాద్ 31.17%

జగిత్యాల 58.64%

జనగామ 62.24%

భూపాలపల్లి 64.30%

గద్వాల 64.45%

కామారెడ్డి 59.06%

కరీంనగర్ 56.04%

ఖమ్మం 63.62%

కుమురంభీం 59.62%

మహబూబాబాద్ 65.05%

మహబూబ్ నగర్ 58.89%

మంచిర్యాల 59.16%

మెదక్ 69.33%

మేడ్చల్ మల్కాజిగిరి 38.27%

ములుగు 67.84%

నాగర్ కర్నూల్ 57.52%

నల్గొండ 59.98%

నారాయణపేట 57.17%

నిర్మల్ 60.38%

నిజామాబాద్ 56.50%

పెద్దపల్లి 59.23%

రాజన్న సిరిసిల్ల 56.66%

రంగారెడ్డి 42.43%

సంగారెడ్డి 56.23%

సిద్ధిపేట 64.91%

సూర్యాపేట 62.07%

వికారాబాద్ 57.62%

వనపర్తి 60.10%

వరంగల్ 52.28%

యాదాద్రి భువనగిరి 64.08 %