Begin typing your search above and press return to search.

ఆంధ్రా ప్రజలకు పొలిటికల్ ఇంటరెస్ట్ పోయిందా...!?

మరో మూడు నెలలలో ఏపీలో ఎన్నికలు ఉన్నాయి. అంటే కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్లే. అయితే ఏపీ జనాలు నింపాదిగా ఉన్నారు.

By:  Tupaki Desk   |   24 Dec 2023 11:30 PM GMT
ఆంధ్రా ప్రజలకు పొలిటికల్ ఇంటరెస్ట్ పోయిందా...!?
X

మరో మూడు నెలలలో ఏపీలో ఎన్నికలు ఉన్నాయి. అంటే కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్లే. అయితే ఏపీ జనాలు నింపాదిగా ఉన్నారు. వారికి ఈ రాజకీయ వేడి పట్టడంలేదు. వారి పనేంటో వారేంటో అన్నట్లుగానే ఉన్నారు. నిజం చెప్పాలీ అంటే ఏపీ ప్రజలకు రాజకీయాల మీద ఆసక్తి చచ్చిపోయింది అన్నది కఠిన సత్యంగా ఉంది.

ఎందుకు అంటే ఉమ్మడి ఏపీ నుంచి 2014లో ఏపీ విడిపోయాక అయిదు కోట్ల ప్రజలు నిర్ఘంతపోయారు. ఒక విధంగా వారు ఊహించని సంఘటనగా ఉంది అది. దాని నుంచి తేరుకునేలోగానే ఏపీకి ఎన్నికలు ముంచుకొచ్చాయి. అప్పట్లో కేంద్రంలో మోడీ క్రేజ్ ఉంది. ఆయన ఫస్ట్ టైం జాతీయ రాజకీయాల్లోకి వచ్చారు.

ఆయన దేశాన్ని కొత్త శకం వైపు నడిపించే నాయకుడు అని దేశం మొత్తం ఊగిపోతున్న రోజులవి. దాంతో కేంద్రంలో కాంగ్రెస్ చేసిన అన్యాయాన్ని సరిద్దేందుకు బీజేపీ వస్తే బాగు అనుకున్నారు ఏపీ జనాలు. ఇక ఏపీలో విభజన తరువాత హైదరాబాద్ రాజధాని తెలంగాణాకు వెళ్ళింది.

దాంతో ఏపీకి కూడా అలాంటిది కావాలంటే అనుభవం ఉన్న నేతగా చంద్రబాబు రావాలని అంతా కోరుకున్నారు. అలా బాబు మోడీ సూపర్ హిట్ కాంబోకి జనాలు జై కొట్టారు. పవన్ కళ్యాణ్ కూడా నాడు తోడు కావడంతో ఆ కొత్త కాంబోకి జనాలు ఓటేత్తారు. అయితే అయిదేళ్ల కాలంలో ప్రజల ఆశలు తీరలేదు, దాంతో పాటు చంద్రబాబు రాజధాని పేరిట గ్రాఫిక్స్ చూపించారు. ప్రజలు కోరుకున్న ప్రత్యేక హోదాని మోడీ అటకెక్కించేస్తే ఏపీలో టీడీపీ కూడా చోద్యం చూసింది. ప్యాకేజి ముద్దు అంటూ సన్నాయి నొక్కులు నొక్కింది. ఇక జనసేన పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తాను అంటూ వచ్చి ఏమీ ప్రశ్నించకుండానే అలా ఉండిపోయారు.

ఈ నేపధ్యంలో అయిదేళ్ల పాటు ఆశలు గల్లంతు అయినె నేపధ్యంలో 2019 లో ప్రజలు వైసీపీలో కొత్త నేతను చూసుకున్నారు. కేంద్రం మెడలు వచ్చి ప్రత్యేక హోదా తెస్తాను అంతే నమ్మి 22 మంది ఎంపీలను ఇచ్చారు. అలాగే ఏపీలో పోలవరం రాజధాని వంటి వాటిని వైసీపీ పూర్తి చేస్తుంది అని భావించారు. తీరా అయిదేళ్ళు తిరిగేసరికి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది.

దాంతో పాటు యువకుండు న్యూ జనరేషన్ సీఎం అని ఓటెత్తి 151 సీట్లు ఇచ్చిన జగన్ చూపించిన రాజకీయ సినిమాను కూడా జనాలు చూసేశారు. ఇపుడు మళ్లీ చంద్రబాబు సీఎం అవుతానని అంటున్నారు. ఇటు చూస్తే జగన్ సీఎం గా ఉన్నారు. ఏపీలో థర్డ్ ఫోర్స్ అంటూ లేదు. దాంతో ప్రజలకు రాజకీయాలంటేనే పెద్దగా ఇంటరెస్ట్ లేకుండా పోయింది అని అంటున్నారు. ఎవరైతేనేంటి సీఎం అన్న ఆలోచనలు కూడా వచ్చాయి.

ఈ నేపధ్యంలో రాజకీయ పార్టీల మధ్యనే రచ్చ తప్ప సామాన్య జనంలో అయితే ఆ తరహా వేడి అయితే లేదు అంటున్నారు. మొత్తానికి చూస్తే ఏపీలో ఎన్నికల వేడి అన్నది కనిపించడంలేదు, ప్రజలు సైతం మాకెందుకొచ్చిన రాజకీయం అని ఎవరి పనులు వారు చేసుకుంటున్నారు. ఇదండీ మ్యాటర్.