Begin typing your search above and press return to search.

షర్మిల వెనకాల పొలిటికల్ మాస్టర్ బ్రైన్ ఉన్నారా?

ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిలకు ఏపీలో కీలక బాధ్యతలు అప్పగించడం, పులివెందులలో పోటీకి నిలబెట్టే ఆలోచనలు చేస్తున్నారని కథనాలు రావడం వెనుక మాస్టర్ బ్రైన్ ఉన్నారా అనే చర్చ తెరపైకి వచ్చింది.

By:  Tupaki Desk   |   17 Jan 2024 9:35 AM GMT
షర్మిల వెనకాల పొలిటికల్  మాస్టర్  బ్రైన్  ఉన్నారా?
X

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో కాంగ్రెస్ కొత్త వ్యూహాలు సిద్దం చేస్తోంది. ఈ క్రమంలోనే షర్మిలకు కీలక బాధ్యతలు అప్పగించిందని తెలుస్తుంది. ఇదే సమయంలో ఏకంగా ఆమెను పులివెందులలో పోటీకి నిలబెట్టే అవకాశాలున్నాయని కథనాలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిలకు ఏపీలో కీలక బాధ్యతలు అప్పగించడం, పులివెందులలో పోటీకి నిలబెట్టే ఆలోచనలు చేస్తున్నారని కథనాలు రావడం వెనుక మాస్టర్ బ్రైన్ ఉన్నారా అనే చర్చ తెరపైకి వచ్చింది.

అవును... ఏపీలో కాంగ్రెస్ పూర్వవైభవం సాధించాలని ప్రయత్నాలు చేస్తోంది. 2014లో రాష్ట్ర విభజన సమయం నుంచి ఏపీలో కాంగ్రెస్ ని పూర్తిగా పక్కనపెట్టిన నేపథ్యంలో... మరోసారి నాటి వైభవం తెచ్చుకోవాలని పరితపిస్తుంది. పైగా... ఇప్పుడు వైఎస్ జగన్ వెనుక ఉన్న ఓటు బ్యాంక్ అంతా తమదే అని కాంగ్రెస్ బలంగా నమ్ముతుంది. దీంతో... ఆ ఓట్ బ్యాంక్ మరోసారి తమ వైపు తిప్పుకోవాలంటే.. అది వైఎస్ షర్మిలతో సాధ్యమని భావిస్తోంది.

వాస్తవానికి షర్మిలకు పీసీసీ పగ్గాలు ఇవ్వటం ద్వారా జగన్ ఓట్ బ్యాంక్ కు గండి పడుతుందని.. అది పరోక్షంగా తమకు సహకరిస్తుందని బాబు & కో భావించారని చెబుతుంటారు. బాబు ఈ విషయంలో చాలా ఆలోచించారని.. ఆమేరకు కాంగ్రెస్ పార్టీ పెద్దలతోనూ మంతనాలు సాగించారనే ప్రచారమూ ఉంది. జగన్ కు బలమైన ఓటుబ్యాంకుగా చెప్పే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఓట్లలో షర్మిళ చీలిక తేగలదని వీరి నమ్మకం!

అయితే... కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ గా నియమితులైన మాణిక్కం ఠాగూర్ మాత్రం తమ లక్ష్యాన్ని స్పష్టం చేస్తున్నారు. ఇందులో భాగంగా... ఏపీలో టీడీపీ, వైసీపీ, జనసేన మూడు పార్టీలు బీజేపీకి అనుకూలంగా ఉన్నాయని దుయ్యబట్టారు. అనంతరం... ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కాంగ్రెస్ తోనే సాధ్యమని చెప్పుకొచ్చారు.

ఈ సమయంలో షర్మిళ ఏపీలో ఎంట్రీ ఇవ్వడంవల్ల టీడీపీకి ప్రత్యేకంగా ఒరిగేదీ లేదు.. వైసీపీకి కలిగే నష్టమూ లేదు అనే చర్చ తెరపైకి వస్తుంది. మరోపక్క... కాంగ్రెస్ మాత్రం తమకు ఆ మూడు పార్టీలూ సమాన దూరంలోనే ఉన్నాయని చెప్పుకొస్తున్నారు. దీంతో... ఆయా పార్టీల్లో టిక్కెట్లు దక్కనివారికి కాంగ్రెస్ పార్టీ ఒక ఆప్షన్ అనే మాటలూ వినిపిస్తున్నాయి..

ఇలా ఒకరికి ప్లస్సూ, మరొకరికి మైనస్సూ వంటి ఆలోచనలు ఏమీ లేకుండా... అటు జగన్ ని, ఇటు చంద్రబాబుని లక్ష్యంగా చేసుకుని విమర్శలు, రాజకీయాలూ చేయాలని.. ఇవన్నీ బీజేపీ జట్టని, వాటిని ప్రత్యామ్నయం కాంగ్రెస్ అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ అధిష్టాణం సూచించిందని అంటున్నారు. ఇదే సమయంలో వచ్చే ఎన్నికల్లో పోటీకి కూడా సిద్ధపడాలని షర్మిలకు సూచించారని చెబుతున్నారు.

ఇందులో భాగంగా... కడప పార్లమెంట్ స్థానం నుంచి షర్మిల పోటీ చేస్తారని కథనాలొస్తున్నాయి. పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా షర్మిల పోటీచేస్తారని కథనాలొస్తున్నప్పటికీ... ఆమె హస్తినకు వెళ్లడానికే మొగ్గుచూపుతునారని సమాచారం. అయితే ప్రస్తుతం కుమారుడి వివాహ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న షర్మిల... త్వరలో ఏపీ పీసీసీ బాధ్యతలు తీసుకుని ఫుల్ టైం రంగంలోకి దిగుతారని చెబుతున్నారు.