Begin typing your search above and press return to search.

వ‌రుస క‌ట్టేసిన వార‌సులు.. బాబుకు త‌ల‌నొప్పేనా?

వార‌సుల రంగ ప్ర‌వేశం రాజ‌కీయాల్లో కొత్త‌కాదు. అయితే.. ఎప్పుడూ.. ఇలాంటి స‌మ‌స్య అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యం లోనే ఉంటుంది. త‌మ కుటుంబానికి చెందిన నాయ‌కుల‌ను రంగంలోకి దింపేందుకు నాయ‌కులు సిద్ధంగా ఉంటారు.

By:  Garuda Media   |   6 Sept 2026 12:00 PM IST
వ‌రుస క‌ట్టేసిన వార‌సులు.. బాబుకు త‌ల‌నొప్పేనా?
X

వార‌సుల రంగ ప్ర‌వేశం రాజ‌కీయాల్లో కొత్త‌కాదు. అయితే.. ఎప్పుడూ.. ఇలాంటి స‌మ‌స్య అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యం లోనే ఉంటుంది. త‌మ కుటుంబానికి చెందిన నాయ‌కుల‌ను రంగంలోకి దింపేందుకునాయ‌కులు సిద్ధంగా ఉంటా రు. అయితే.. ఇప్పుడు స్థానిక ఎన్నిక‌ల్లోనూ వార‌సుల ప‌రంప‌ర పెరుగుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల‌కంటే ముందుగానే త‌మ వార‌సుల‌ను లైన్‌లో పెట్టుకునేందుకు మెజారిటీ సీనియ‌ర్ నేత‌లు.. రెడీ అయ్యారు. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబ‌రు నాటికి స్థానిక ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.

ఈ నేప‌థ్యంలో త‌మ వారికి అవ‌కాశం ఇవ్వాలంటూ..నాయ‌కులు జాబితాల‌ను, ప్రొఫైళ్ల‌ను పార్టీకి పంపిస్తున్నారు. వీరిలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల‌తోపాటు.. ప్ర‌స్తుతం ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. 130 మంది వార‌సులు రంగంలో ఉన్నార‌ని.. పార్టీకి స‌మాచారం చేరింది. వీరిలో మెజారిటీ నాయ‌కులు కార్పొరేష‌న్ మేయ‌ర్లు, మునిసిపాలిటీ చైర్మ‌న్ పోస్టుల‌కు ఎక్కువ‌గా పోటీలో ఉండ‌డం గ‌మ‌నార్హం. వాస్త‌వానికి ఇలాంటి పోస్టుల‌కు.. ఎప్పుడూ డిమాండ్ ఉంటోంది.

అయితే.. ఆయా ప‌ద‌వులు ద‌క్కించుకునేందుకు ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత తెర‌మీద‌కు వ‌చ్చేవారు. కానీ, ఈ ద‌ఫా మేయ‌ర్‌, మునిసిప‌ల్ చైర్మ‌న్ పోస్టుల‌ను కూడా ప్ర‌త్య‌క్ష ఎన్నికల ద్వారా ఎన్నుకోవాల‌ని చంద్ర‌బాబు నిర్ణ‌యించా రు. దీనికి సంబంధించిన జీవో కూడా ఇచ్చారు. అన్నీ రెడీ అయ్యాయి. ఈ నేప‌థ్యంలో తాజాగా ఆయా పోస్టుల‌ను ద‌క్కించుకునేందుకు నాయ‌కులు త‌మ వార‌సుల‌ను బ‌రిలో నిల‌పాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ముఖ్యంగా కీల‌క న‌గ‌రాలైన‌.. విజ‌య‌వాడ‌, విశాఖ‌, క‌డ‌ప‌, క‌ర్నూలు, నెల్లూరు, కృష్ణా, తిరుప‌తి వంటి ప్రాంతాల్లోపోటీ ఎక్కువ‌గా ఉంది.

ఒక పోస్టుకు ముగ్గురు నుంచి న‌లుగురు పోటీలో ఉండ‌డం.. సిఫార‌సులు చేయించుకోవ‌డంతోపాటు.. పార్టీప‌రంగా తాము ఏం చేస్తున్నామో కూడా వివ‌రిస్తూ.. కొంద‌రుఅధిష్టానాన్ని మెప్పించే ప‌నిలో ప‌డ్డారు. అయితే.. ఇక్క‌డ కీల‌క స‌మ‌స్య తెర‌మీదికి వ‌చ్చింది. వార‌స‌త్వ రాజ‌కీయాల‌కు వ్య‌తిరేకం కాక‌పోయిన‌.. క్షేత్ర‌స్థాయిలో పార్టీ కోసం క‌ష్టించిన వారు.. వెనుక ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేనివారిని ప్రోత్స‌హించాల‌ని చంద్ర‌బాబు భావిస్తున్నారు. కానీ, వార‌స‌త్వ‌పు చిక్కులు ఆయ‌న‌కు ముప్పుగా ప‌రిణ‌మిస్తున్నాయి. దీంతో ఈ వ్య‌వ‌హారంపై తేల్చాల‌ని నిర్ణ‌యించుకున్నారు. మ‌రి ఏం చేస్తార‌న్న‌ది చూడాలి.