Begin typing your search above and press return to search.

వైసీపీలో 'రెడ్లు' కూడా.. ఇంతేనా ..!

కానీ, వైసీపీ విష‌యానికి వ‌స్తే.. రెడ్లు.. దీనిని త‌మ పార్టీగానే ఓన్ చేసుకున్నారు.

By:  Tupaki Desk   |   1 May 2025 2:30 AM
వైసీపీలో రెడ్లు కూడా.. ఇంతేనా ..!
X

కులం ప్రాతిప‌దిక‌న రాజ‌కీయాలు చేయ‌డం.. జ‌ర‌గడం కామ‌న్ అయిపోయింది. కులాలు క‌లిసి ఉండి.. రాజ‌కీయాల‌ను ముందుకు న‌డిపించిన ప‌రిస్థితి ఉంది. ఈ క్ర‌మంలో కులాల ప్రాతిప‌దిక పార్టీలు ఏర్పడిన సంద‌ర్భాలు కూడా.. దేశంలో కోకొల్ల‌లు. మ‌న ఏపీ విష‌యానికి వ‌స్తే.. కులాల పేరుతో పార్టీలు లేవు కానీ.. కుల సంఘాలు, కులాల‌కు చెందిన వ్య‌క్తులు మాత్రం.. ఆయా పార్టీల‌కు మ‌ద్ద‌తుగా నిలుస్తున్నాయి. నాయ‌కులకు అండ‌గా ఉంటున్నాయి.

టీడీపీకి క‌మ్మ‌లు ఆద‌ర‌ణ‌. ఈ విష‌యం ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యం లో చంద్ర‌బాబు కోసం.. దేశ దేశాలు దాటి వ‌చ్చి.. ఇక్క‌డ నెల‌ల పాటు పాగా వేసి.. సొంత సొమ్ము ఖ‌ర్చు చేసుకుని మ‌రీ.. ప్ర‌చారం చేశారు. చంద్ర‌బాబు గెలుపులో భాగ‌మ‌య్యారు. ఇక‌, జ‌న‌సేన విష‌యంలోనూ.. కాపులు ఇలానే చేశారు. వారు కూడా అంత‌ర్గ‌త స‌మావేశాలు పెట్టుకుని.. పార్టీ నాయ‌కుడి కోసం ప్ర‌య త్నించారు. అయితే.. ఈ రెండు పార్టీలూ.. ఎక్క‌డా కుల ట్యాగ్‌ను పెట్టుకోలేదు.

కానీ, వైసీపీ విష‌యానికి వ‌స్తే.. రెడ్లు.. దీనిని త‌మ పార్టీగానే ఓన్ చేసుకున్నారు. పార్టీ అధినేత జ‌గ‌న్‌.. త‌న‌కు కులం లేదు.. మ‌తం లేద‌ని అన్నా.. రెడ్డి సామాజిక వ‌ర్గం ఈ పార్టీని సొంతం చేసుకుని.. 2019 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ విజ‌యానికి బాట‌లు వేసింది. కానీ.. దీనిని జ‌గ‌న్ ఒప్పుకోలేదు. త‌న ఇమేజ్‌.. పాద‌యాత్ర తోనే పార్టీ అధికారంలోకి వ‌చ్చింద‌న్న వాద‌న వినిపించారు. ఇది పార్టీకి-రెడ్డి సామాజిక వ‌ర్గానికి మ‌ధ్య అంత‌రాన్ని పెంచేసింది.

మ‌రీ ముఖ్యంగా గ‌త ఎన్నిక‌ల‌కు ముందు.. రెడ్లు వైసీపీకి మ‌రింత దూర‌మ‌య్యారు. జ‌గ‌న్‌ను గెలిపించినా త‌మ‌కు ఎలాంటి ప్ర‌యోజ‌నం లేద‌ని వారు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దీంతో లోపాయికారీగా.. ఇత‌ర పార్టీల నాయ‌కుల‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. క‌ట్ చేస్తే.. ఎన్నిక‌లు ముగిసి ప‌ది మాసాలు పూర్త‌యినా.. ఇప్ప‌టి వ‌ర‌కు రెడ్డి సామాజక‌ వ‌ర్గం.. జ‌గ‌న్ వైపు నిల‌బ‌డుతున్న ప‌రిస్థితి అయితే క‌నిపించ‌డం లేదు. మ‌రి ఎప్ప‌టికి వారు మార‌తారో చూడాలి. మ‌రోవైపు.. జ‌గ‌న్ అయినా.. స్పందిస్తున్నారా? అంటే అది కూడా లేదు. సో.. ఇప్ప‌టికైతే.. రెడ్లు ఇంతే! అనే టాక్ వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.