ముసుగు వీరులు.. కూటమిపై తెరచాటు దాడి.. !
మాజీ మంత్రి, టీడీపీ మాజీ నాయకుడు, వడ్డే శోభనాద్రీశ్వరరావు.. గత వారం రోజులుగా అమరావతిపై వి షం చిమ్ముతున్నారని టీడీపీ నాయకులు వాపోతున్నారు.
By: Tupaki Desk | 13 May 2025 5:00 AM ISTసలహాలు ఇస్తున్నట్టే మాట్టాడతారు.. కానీ, ఆ మాటల వెనుక పుల్లవిరుపులు వినిపిస్తాయి. మంచి చెబుతు న్నట్టే వ్యవహరిస్తారు.. కానీ, ఆ మాటల్లో పక్కా విషం పెల్లుబుకుతుంది. ప్రబుత్వానికి.. సీఎం చంద్రబాబు కు మంచి చెబుతున్నామంటూనే కొందరు ముసుగు వేసుకుని చేస్తున్న ప్రచారం రాష్ట్రంలో కలకలం రేపుతోంది. అమరావతి రాజధాని నుంచి.. సూపర్ సిక్స్ వరకు.. అన్ని విషయాలపైనా.. కొందరు మేదావుల రూపంలో చేస్తున్న ప్రచారంపై ప్రజల్లో చర్చ సాగుతోంది.
మాజీ మంత్రి, టీడీపీ మాజీ నాయకుడు, వడ్డే శోభనాద్రీశ్వరరావు.. గత వారం రోజులుగా అమరావతిపై వి షం చిమ్ముతున్నారని టీడీపీ నాయకులు వాపోతున్నారు. రైతుల నుంచి భూములు తీసుకోవడాన్ని ఆయ న తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. డిబేట్లలో పాల్గొంటున్నారు. అంతేకాదు.. రైతులను రెచ్చగొట్టేలా.. వారికి బహిరం గ లేఖలు కూడా సంధిస్తున్నారు. ఈ ప్రభావం తాజాగా కొత్తగా సేకరించాలని భావించిన భూములపై పడుతోంది. 44 వేల ఎకరాలను కొత్తగా తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.
కానీ.. దీనిని ఇచ్చేందుకు రైతులు ఇరకాటంలో పడ్డారు.దీనికి కారణం.. గత విషయాలను తవ్వడంతోపా టు ప్రముఖ కంపెనీలకు భూములు కేటాయించడాన్ని తప్పుబడుతూ.. వడ్డే చేస్తున్న అడ్డమైన ప్రచార మేనని ప్రభుత్వం కూడా విశ్వసిస్తోంది. ఇక, ఇదే కోవలో మాజీ ఎంపీ, రాజమండ్రికి చెందిన ఉండవల్లి అరుణ్‌కుమార్ కూడా వ్యవహరిస్తున్నారు. జెత్వానీ కేసులో పీఎస్ ఆర్ ఆంజనేయులును అరెస్టు చేయడంపై ఆయన కన్నీరు పెట్టుకున్నంత పనిచేశారు.
అదేవిధంగా రూల్స్, పోలీసుల గురించి కూడా మాట్లాడుతూ.. ప్రభుత్వంపై విషయ ప్రచారం కంటే విష ప్రచారం చేస్తున్నారని.. టీడీపీ నేతలు అంతర్మథనం చెందుతున్నారు. అలానే హైదరాబాద్‌లో ఉంటూ.. ఓ మాజీ ఐఏఎస్ కూడాఇలానే సూపర్ సిక్స్‌పై విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంవీటిని అమలు చేయాలని భావిస్తున్న విసయం తెలిసిందే. వచ్చే నెల నుంచి వీటి అమలుకు కార్యాచరణ కూడా రూపొందించింది. అయినా.. మేధావుల ముసుగులో వీరు మాత్రం కూటమిపై దండయాత్ర చేస్తుండడం గమనార్హం.
