Begin typing your search above and press return to search.

ఫస్ట్ టైం ఇన్ హైదరాబాద్.. 31 నైట్ గం.8 నుంచి పోలీసుల కొత్త టెస్ట్ లు!

న్యూ ఇయర్ వేడుకలకు హైదరాబాద్ సిద్ధమవుతోంది. సిటీ మొత్తంలో పబ్బులు, క్లబ్బులు, బార్ లలో అడ్వాన్స్డ్ రిజర్వేషన్ చేయించుకున్న జనం... ఆ సమయం కోసం ఎదురుచూస్తున్నారు

By:  Tupaki Desk   |   30 Dec 2023 10:49 AM GMT
ఫస్ట్  టైం ఇన్  హైదరాబాద్..  31 నైట్ గం.8 నుంచి పోలీసుల కొత్త టెస్ట్  లు!
X

న్యూ ఇయర్ వేడుకలకు హైదరాబాద్ సిద్ధమవుతోంది. సిటీ మొత్తంలో పబ్బులు, క్లబ్బులు, బార్ లలో అడ్వాన్స్డ్ రిజర్వేషన్ చేయించుకున్న జనం... ఆ సమయం కోసం ఎదురుచూస్తున్నారు. మరోపక్క ఈసారి కొత్తగా ఏర్పాటైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం... నగరంలో శాంతిభద్రతల నిబంధనలపై ఉక్కుపాదం మోపుతుంది. ఇందులో భాగంగా హైదరాబాద్ పోలీస్ సరికొత్త పరీక్షలు సిద్ధమవుతున్నారు.

అవును... తెలంగాణలో డ్రగ్స్ వినియోగం ఎక్కువగా ఉందని, ఈ విషయంపై ప్రభుత్వం మెతక వైఖరి అవలంభిస్తుందంటూ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో నాటి బీఆరెస్స్ ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించేవారు. ఒకానొక సమయంలో కేటీఆర్ కు సవాల్ కూడా విసిరారు. ఈ నేపథ్యలో తాను సీఎం అయిన అనంతరం డ్రగ్స్ పై రేవంత్ రెడ్డి ఫుల్ కాన్ సంట్రేషన్ పెట్టినట్లు తెలుస్తుంది.

ఇందులో భాగంగా డ్రగ్స్ వినియోగానికి చాలా అవకాశం ఉందని, గతంలో చాలా ఫిర్యాదులు కూడా అందాయని సమాచారం ఉన్న నేపథ్యంలో హైదరాబాద్ లో "సన్ బర్న్ ''ఈవెంట్ కు రేవంత్ సర్కార్ పర్మిషన్ ఇవ్వలేదు. పైగా అనుమతి తీసుకోకుండా ఆన్ లైన్ లో టిక్కెట్లు అమ్మకానికి పెట్టడంపై అటు నిర్వాహకులతో పాటు బుక్ మై షో పై కూడా కేసులు పెట్టారు!

ఇదే సమయంలో న్యూ ఇయర్ వేడుకల్లో భారీగా డ్రగ్స్ వినియోగం జరిగే అవకాశం ఉందని కథనాలొస్తున్న నేపథ్యంలో... హైదరాబాద్ పోలీస్ మొట్టమొదటిసారి సరికొత్త పరీక్షలు నిర్వహించబోతున్నారు. ఇందులో భాగంగా... డిసెంబర్ 31వ తేదీ రాత్రి 8 గంటల నుంచి నగరమంతటా విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు ఉంటాయని హైదరాబాద్ పోలీసులు ఇప్పటికే ప్రకటించారు.

ఇదే సమయంలో... హైదరాబాద్ పోలీసులు నగరం అంతటా కొత్తగా "డ్రగ్ డిటెక్షన'' పరికరాలను మోహరించారు. నూతన సంవత్సర వేడుకల్లో డ్రగ్స్ వాడకాన్ని అరికట్టేందుకు ఈ కార్యక్రమం చేపట్టగా.. తెలంగాణ పోలీసులు తొలిసారిగా ఈ టెక్నిక్‌ ను ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలో... తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో డ్రగ్స్ డిటెక్షన్ పరికరాలను సేకరించింది. డిసెంబర్ 31 సాయంత్రం నుంచి వీటిని ఉపయోగించనున్నారు.

అంటే... డిసెంబర్ 31 రాత్రి నుంచి పబ్బులు, పార్టీ స్థలాల వద్ద హైదరాబాద్ పోలీసులు డ్రగ్ డిటెక్షన్ పరీక్షలు నిర్వహిస్తారు. హైదరాబాద్‌ లో డ్రగ్స్ డిటెక్షన్ పరీక్షలు భారీ ఎత్తున జరగడం ఇదే తొలిసారి కాగా.. ఈ పరీక్షల్లో డ్రగ్స్ తీసుకున్నట్లు రుజువైతే వెంటనే వారిని పోలీసులు అదుపులోకి తీసుకుంటారని తెలుస్తుంది.