Begin typing your search above and press return to search.

పోలీస్ న్యూ (ఇయర్) ఆఫర్!... డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే...!

ఇందులో భాగంగా ప్రధానంగా డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో స్ట్రిట్ గా ఉండటంతో పాటు డ్రగ్స్ విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టింది.

By:  Tupaki Desk   |   31 Dec 2023 10:39 AM GMT
పోలీస్  న్యూ (ఇయర్) ఆఫర్!... డ్రంక్  అండ్  డ్రైవ్  లో దొరికితే...!
X

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం పలు జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా ప్రధానంగా డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో స్ట్రిట్ గా ఉండటంతో పాటు డ్రగ్స్ విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఇందులో భాగంగా స్పాట్ లో డ్రగ్స్ టెస్ట్ చేయనున్నారు హైదరబాద్ పోలీసులు. ఇదే సమయంలో డ్రంక్ అండ్ డ్రైవ్ ఫైన్ ని కూడా భారీగా పెంచేశారు తెలంగాణ పోలీసులు.

అవును... న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో భాగంగా ఆదివారం రాత్రి 8 గంటల నుంచి రాష్ట్రంలోని అన్ని పోలీస్‌ స్టేషన్‌ ల పరిధిలో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌, డ్రగ్స్‌ డిటెక్షన్ టెస్టులు నిర్వహించాలని డీజీపీ రవి గుప్తా.. పోలీసులను ఆదేశించారు. ఇందులో భాగంగా ఎవరైనా మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్ట ప్రకారం జరిమానాలు, జైలుశిక్ష కాస్త భారీగానే ఉంటాయనే హెచ్చరికలు పంపారు!

ఈ క్రమంలో డ్రంక్ అండ్ డ్రైవ్‌ లో పట్టుబడితే రూ.10 వేల జరిమానాతో పాటు గరిష్టంగా 6 నెలల‌ జైలు శిక్ష విధించనున్నారు. దీనికోసం ప్రతి పోలీస్ స్టేషన్‌ పరిధిలో 5 చెక్‌ పాయింట్స్‌ ఏర్పాటు చేశారని తెలుస్తుంది. ఇదే సమయంలో హైదరాబాద్‌, సైబరాబాద్‌ కమిషనరేట్ల పరిధిలో మరిన్ని ప్రత్యేక ఆంక్షలు ఉంటాయని డీజీపీ వెల్లడించారు.

ఇందులో భాగంగా... ఫ్లైఓవర్‌ లు, ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై వాహనాల రాకపోకలపై ఆంక్షలు ఉంటాయని.. ఇదే సమయంలో ఎయిర్‌ పోర్టుకు వెళ్లేవారు తప్పనిసరిగా పాస్‌ లు కలిగి ఉండాలని సూచించారు. ఇదే సమయమో క్యాబ్, ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా యూనిఫాం ధరించాలని అన్నారు. లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

విశాఖ, విజయవాడల్లోనూ ఆంక్షలు!:

విశాఖలోనూ న్యూ ఇయర్‌ వేడుకలపై పోలీసుల అప్రమత్తమయ్యారు. ఇందులో భాగంగా ఆర్కే బీచ్‌ రోడ్‌ లో నేటి రాత్రి నుంచి వాహనాలకు అనుమతి లేదని... ఇదే సమయంలో తెలుగు తల్లి ఫ్లైఓవర్‌ పై వాహనాల నిషేధం అమలులో ఉంటుందని తెలిపారు. ఇదే సమయంలో... అర్ధరాత్రి ఒంటిగంటలోపే న్యూ ఇయర్ వేడుకలు ముగించాలని పోలీసులు సూచిస్తున్నారు.

ఇదే సమయంలో నూతన సంవత్సర సంబరాల పేరిట చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని విజయవాడ సీపీ క్రాంతి రానా టాటా వెల్లడించారు. రోడ్లపై కేక్‌ కట్ చెయ్యటానికి అనుమతులు లేవని.. సిటీలో సెక్షన్ 30 అమలులో ఉందని.. అందువల్ల ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమికూడవద్దని తెలిపారు. ఇదే సమయంలో ఎంజీ రోడ్డు, బందర్ రోడ్, ఫ్లై ఓవర్లపై ట్రాఫిక్ ఆంక్షలను విధించినట్లు తెలిపారు.