Begin typing your search above and press return to search.

ఏవోబీలో 'పుష్ప' సీన్ రిపీట్... వీడియో వైరల్!

వివరాళ్లోకి వెళ్తే... ఏపీ, ఒడిశా సరిహద్దుల్లో చిత్రకొండ పోలీసులు పెట్రోలింగ్ చేస్తుండగా ఓ వ్యాన్ ఆగకుండా దూసుకెళ్లింది.

By:  Tupaki Desk   |   20 Sep 2023 4:51 AM GMT
ఏవోబీలో పుష్ప సీన్  రిపీట్... వీడియో వైరల్!
X

ఆంధ్రా - ఒడిశా సరిహద్దు (ఏఓబీ) ల్లో 'పుష్ప' సినిమా తరహా సీన్‌ చోటుచేసుకుంది. స్మగ్లింగ్ కి పాల్పడుతున్న వాహనం వేగంగా రావడం, చెక్ పోస్ట్ పోలీసులు ఆపడం, స్మగ్లర్లు కారు ఆపకుండా వెళ్లిపోవడం, వెంటనే పోలీసులు చేజ్ చేయడం, స్మగ్లర్లు వారి వాహనంలో ఉన్న సరుకులు పోలీస్ వాహనాలకు అడ్డంగా రోడ్డుపైన పారేసే ప్రయత్నం చేయడం.

అవును... ఇలాంటి సీన్ ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలో పుష్ప సినిమా సీన్ రిపీట్ అయినట్లుగా కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తుంది. రియల్ లైఫ్ లో ఉన్న పాత్రలను చూసి ఇన్ స్పైర్ అయ్యి సినిమాల్లో పాత్రల సృష్టి జరుగుతుంది అనే వాదనకు బలం చేకూర్చేలా ఈ సీన్ ఉంది. కాకపోతే సినిమా స్థాయిలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఉండదంతే...!

వివరాళ్లోకి వెళ్తే... ఏపీ, ఒడిశా సరిహద్దుల్లో చిత్రకొండ పోలీసులు పెట్రోలింగ్ చేస్తుండగా ఓ వ్యాన్ ఆగకుండా దూసుకెళ్లింది. ఫుల్ లోడ్ తో ఉన్న ఆ వాహనం ఫుల్ స్పీడ్ తో వెళ్తుంది. దీంతో అప్రమత్తమైన పోలీసులు మరో వాహనంలో వారిని వెంబడించారు. అయితే, స్మగ్లర్లు మాత్రం తప్పించుకునేందుకు గంజాయి మూటలను రోడ్డుకు అడ్డంగా ఒక్కోటి వేసుకుంటూ పోయారు.

అప్పుడు పోలీస్ వాహనం టైర్ సడన్ ఆ భారీ మూటలపై ఎక్కి సినిమాల్లో టైపు ఎగురుతుందని వారి భావన కావొచ్చు! అయినప్పటికీ పోలీసులు వెనక్కి తగ్గకుండా ముందుకు వెళ్లారు. "తగ్గేదే లే" అన్నట్లుగా వెంబడించారు. ఇదంతా వీడియోలో రికార్డు అయింది. ఆ వీడియో వైరల్ అవుతుంది.

ఈ సందర్భంగా దాదాపు రూ.కోటి విలువైన గంజాయిని పోలీసులు సీజ్ చేశారని తెలుస్తుంది. ఈ క్రమంలో ఏవోబీలో గంజాయి స్మగ్లర్లను పోలీసులు తరిమిన దృశ్యాలు.. 'పుష్ప' సినిమాలో బన్నీని వెంబడించిన దృశ్యాన్ని తలపించేలా ఉన్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ ఘటన ఎప్పుడు జరిగిందనేది తెలియదు!