Begin typing your search above and press return to search.

మోడీపై ఫుల్ ట్రోల్స్.. రీడ్ దిస్ స్టోరీ

అమెరికాలో 50 మంది వరదల్లో చనిపోతే తల్లిడిల్లిపోయే మోడీ.. మన దేశంలోని హిమాచల్ ప్రదేశ్ లో 74 మంది చనిపోయినా కనీసం సానుభూతి తెలపరు.. అడిగి తెలుసుకోరు.. సంతాపానికి కనీసం ట్వీట్ చేయరు. ఇదే నెటిజన్లకు కోపం తెప్పిస్తోంది. మోడీని ప్రశ్నించేలా చేస్తోంది.

By:  Tupaki Desk   |   7 July 2025 9:57 AM IST
మోడీపై ఫుల్ ట్రోల్స్.. రీడ్ దిస్ స్టోరీ
X

మేడి పండు చూడు మేలిమై ఉండు పొట్ట విప్పి చూడు పురుగులు ఉండు అన్న సామెత ఊరికే పుట్టలేదు.. ప్రపంచవ్యాప్తంగా పేరు.. గ్లోబల్ లీడర్ అని పొగడ్తలు.. దేశాన్ని ముందుకు తీసుకెళుతున్నాడని కీర్తి ప్రతిష్టలు.. అన్నీ బాగానే ఉన్నాయి.. కానీ అంతకుమించిన విషాదాలు, సమస్యలు దేశంలో ఉన్నాయి. కానీ వాటిపైన మాత్రం మోడీ మాట్లాడరు. తగిన చర్యలు తీసుకోరు. అదో పెద్ద సమస్య కానట్టు ప్రవర్తిస్తారు. అమెరికాలో 50 మంది వరదల్లో చనిపోతే తల్లిడిల్లిపోయే మోడీ.. మన దేశంలోని హిమాచల్ ప్రదేశ్ లో 74 మంది చనిపోయినా కనీసం సానుభూతి తెలపరు.. అడిగి తెలుసుకోరు.. సంతాపానికి కనీసం ట్వీట్ చేయరు. ఇదే నెటిజన్లకు కోపం తెప్పిస్తోంది. మోడీని ప్రశ్నించేలా చేస్తోంది.

ఇటీవల హిమాచల్ ప్రదేశ్‌లో చోటుచేసుకున్న భీకర వరదల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో ట్రోల్స్ జరుగుతున్నాయి. దేశంలోని ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా.. కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా ప్రధాని మోదీ స్పందించకపోవడంపై నెటిజన్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

- అమెరికా వరదలపై ట్వీట్.. కానీ హిమాచల్‌పై మౌనం

అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో వచ్చిన వరదలపై ప్రధాని మోదీ ట్వీట్ చేసి, ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలిపారు. అమెరికా ప్రభుత్వానికి, బాధిత కుటుంబాలకు తన సానుభూతిని వ్యక్తం చేశారు. అయితే, అదే సమయంలో హిమాచల్ ప్రదేశ్‌లో గత 5 రోజులుగా కొనసాగుతున్న వర్షాలు, వరదల వల్ల 70కి పైగా మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది ఇళ్లు కోల్పోయారు. రాష్ట్రంలో తీవ్ర నష్టాలు సంభవించాయి. అయినప్పటికీ మోదీ దీనిపై ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం విమర్శలకు దారితీస్తోంది.

- నెటిజన్ల అసహనం.. ట్రోల్స్, మీమ్స్ వెల్లువ

మోడీ మౌనాన్ని ప్రశ్నిస్తూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్, మీమ్స్‌ రూపొందిస్తున్నారు. "మోదీజీ.. మీకు దేశం ముఖ్యం కాదా?", "విదేశాల్లో జరుగుతుంటేనే స్పందన ఎందుకు? దేశం విషయంలో మౌనం ఎందుకు?" అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మోదీ చర్యలను పీఆర్ స్టంట్ గా, ఫొటో ఆపర్చునిటీగా విమర్శిస్తున్నారు. దేశంలో ఏం జరిగినా మాట్లాడకుండా.. స్పందించకుండా ఉండే మోడీ విదేశాల్లో మాత్రం పేరు, పరపతి, హోదా కోసం ఇలా చేస్తున్నారని దుమ్మెత్తిపోస్తున్నారు.

- రాజకీయ మౌనం.. మానవతా దృక్పథం లేకపోవడమేనా?

దేశం లోపల జరిగే విషాదకర సంఘటనలపై ప్రభుత్వ అధినాయకుడు స్పందించకపోవడం ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని విశ్లేషఖులు అభిప్రాయపడుతన్నారు.. ప్రధానిగా మోదీ దేశంలోని ప్రతి రాష్ట్రాన్ని సమానంగా చూసేందుకు బదులుగా, రాజకీయ లాభనష్టాలను దృష్టిలో ఉంచుకుని కొన్ని అంశాలపై మౌనం వహిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇది ప్రభుత్వ సానుభూతిని గణనీయంగా ప్రభావితం చేయగల అంశం.

సమకాలీన రాజకీయాల్లో స్పందన ఒక బాధ్యత

ఒక్కటే దేశం.. ఒకటే ప్రజలు అనే నినాదాన్ని నమ్మే నాయకుడు, ఏ ప్రాంతం అయినా సరే, దారుణ సంఘటనలపై స్పందించాల్సిన బాధ్యత కలిగివుంటాడు. ముఖ్యంగా సామాన్య ప్రజలు మానవీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నపుడు, అటువంటి పరిస్థితులపై ప్రధాని స్పందించకపోవడం ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది.

విదేశీ బంధాలకు ప్రాధాన్యత ఇవ్వడంలో తప్పులేదు. కానీ దేశంలోనే విపత్తులు జరిగితే మౌనంగా ఉండడం ఓ నాయకునికి తగ్గదని ప్రజల భావన. మోదీకి ప్రజల్లో తిరుగులేని ఆదరణ ఉన్నా.. ఇటువంటి మౌనమే ఆ ఆదరణను ప్రశ్నించేలా చేస్తోంది. "దేశం ముందే.. పేరు, పరపతులు తర్వాతే" అన్న దృక్పథాన్ని గుర్తుచేసే అవసరం ఈ సమయంలో ఉంది. ప్రజల ప్రాణాలకు విలువ ఇవ్వాలన్న విజ్ఞప్తినే ఈ ట్రోల్స్ వెనుక ఉన్న మనోభావంగా చూడాలి.