Begin typing your search above and press return to search.

మోడీ పొదుపు మంత్రం.. ఎన్డీయే సీఎంలు ఏం చేశారంటే!

ఢిల్లీలో ముఖ్య‌మంత్రి రేఖాగుప్తా.. త‌న వేత‌నాన్ని త‌గ్గించుకునే ప్ర‌తిపాద‌న‌ల‌పై ఆలోచ‌న చేస్తున్నారు. ఇప్ప‌టికిప్పుడు.. త‌న కాన్వాయ్‌లో 50 శాతం కోత పెట్టాల‌ని నిర్దేశించారు.

By:  Garuda Media   |   13 May 2026 11:14 PM IST
మోడీ పొదుపు మంత్రం.. ఎన్డీయే సీఎంలు ఏం చేశారంటే!
X

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ఇచ్చిన పొదుపు మంత్రం పిలుపుతో బీజేపీ నేతృత్వంలోనిఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు అలెర్ట్ అయ్యారు. అదేస‌మ‌యంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని ముఖ్య‌మంత్రు లు కూడా రాత్రికి రాత్రి కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. ప్ర‌స్తుతం ఢిల్లీ, యూపీ, మ‌హారాష్ట్ర‌, అస్సాం, ప‌శ్చిమ బెంగాల్‌, ఏపీ స‌హా.. ప‌లు రాష్ట్రాల్లో ఎన్డీయే కూట‌మి పార్టీలు ప్ర‌భుత్వాలు న‌డుపుతున్నాయి. ఈ క్ర‌మంలో ప్ర‌ధాని మోడీ పొదుపు మంత్రాన్ని ఆయా ప్ర‌భుత్వాలు పాటించేందుకు రెడీ అయ్యాయి.

ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా ఈ పొదుపు మంత్రానికి శ్రీకారం చుట్టారు. యూపీలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్‌.. త‌న కాన్వాయ్‌లో 30 శాతం వాహ‌నాలు మాత్ర‌మే ఉండాల‌ని ఆదేశించారు. మిగిలిన వాటిని పార్కింగ్ ప్రాంతాల‌కు త‌ర‌లించాల‌ని ఆదేశించారు. అదేవిధంగా ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌కు వ‌చ్చే వారిలో ఉన్నతాధికారులు .. ప్ర‌జార‌వాణాను వినియోగించే విష‌యంపై ఆలోచ‌న చేయాల‌నిసూచించారు. ఉద్యోగులుకూడా ప్ర‌జార‌వాణాను వినియోగించాల‌న్నారు.

ఢిల్లీలో ముఖ్య‌మంత్రి రేఖాగుప్తా.. త‌న వేత‌నాన్ని త‌గ్గించుకునే ప్ర‌తిపాద‌న‌ల‌పై ఆలోచ‌న చేస్తున్నారు. ఇప్ప‌టికిప్పుడు.. త‌న కాన్వాయ్‌లో 50 శాతం కోత పెట్టాల‌ని నిర్దేశించారు. అదేవిధంగా ప్ర‌భుత్వ కార్యాల యాల‌ను ఖ‌చ్చితంగా సాయంత్రం 6 త‌ర్వాత తెరిచి ఉంచొద్ద‌ని ఆదేశించారు.అ త్య‌వ‌స‌ర సేవ‌ల‌కు మిన హాయింపు ఇచ్చారు. ఉచిత బ‌స్సులు, ప్ర‌జార‌వాణాను వాడుకోవాల‌ని ఉద్యోగుల‌కు సూచించారు. మ‌హారాష్ట్ర‌లోనూ ఇదే త‌ర‌హా ఆదేశాలు వెలువ‌డ్డాయి.

ఏపీ మాటేంటి?

ప్ర‌ధాని మోడీ ఏదైనా విష‌యంపై స్పందిస్తే.. వెంట‌నే దానిపై ప్ర‌చారం చేసే ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బా బు..ఇప్పుడు పొదుపు మంత్రంపై ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటార‌న్న‌ది ఆసక్తిగా మారింది. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు ముఖ్య‌మంత్రి కార్యాల‌యం ఎలాంటి ప్ర‌క‌ట‌న జారీ చేయ‌లేదు. ఇత‌ర రాష్ట్రాల్లో మాదిరిగా ఆయ‌న కూడాకాన్వాయ్‌ను త‌గ్గించుకుని పెట్రోలు, డీజిల్ పొదుపున‌కు ప్రాధాన్యం ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. మ‌రోవైపు.. ప్ర‌ధాని త‌న కాన్వాయ్‌లో వాహ‌నాల‌ను 50 శాతానికి కుదించుకున్న ద‌రిమిలా.. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కూడా.. త‌న కాన్వాయ్‌లో 50 శాతం వాహ‌నాల‌ను పార్కింగ్‌కు పంపేశారు.