మోడీ ఆతిథ్యం.. భారత్ లోనే ఉంటానంటున్న జేడీ వాన్స్ కుమారుడు
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తాజాగా తన కుటుంబంతో కలిసి భారత్‌లో పర్యటించారు.
By: Tupaki Desk | 22 April 2025 8:29 PM ISTఅమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తాజాగా తన కుటుంబంతో కలిసి భారత్‌లో పర్యటించారు. ఈ పర్యటన సందర్భంగా ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. మోదీతో భోజనం చేసిన తర్వాత తన కుమారుడు వ్యక్తం చేసిన ఒక ఆసక్తికరమైన కోరికను జేడీ వాన్స్ వెల్లడించారు.
ఈ సందర్భంగా వాన్స్ మాట్లాడుతూ తన పిల్లలకు ప్రపంచ నేతల్లో ఇద్దరంటే చాలా ఇష్టం ఉందని తెలిపారు. వారిలో ఒకరు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాగా, మరొకరు భారత ప్రధాని నరేంద్ర మోదీ అని పేర్కొన్నారు.
తాము ప్రధాని మోదీ నివాసంలో భోజనం చేసిన తర్వాత జరిగిన ఒక సంఘటన గురించి వాన్స్ వివరించారు. "ప్రధాని మోదీ ఇంట్లో మేం భోజనం చేసిన తర్వాత నా పెద్ద కొడుకు ఇవాన్ (7) భారత్లో నివసించాలనుకుంటున్నానని నాతో చెప్పాడు" అని వాన్స్ పేర్కొన్నారు. ఏడు సంవత్సరాల చిన్నారి అయిన ఇవాన్, భారత్‌లో ఉండిపోవాలనే కోరికను వ్యక్తం చేయడం వాన్స్‌ను ఆశ్చర్యపరిచిందని సమాచారం.
కుటుంబ సమేతంగా భారత్‌కు వచ్చిన జేడీ వాన్స్, ప్రధాని మోదీ ఇచ్చిన ఆతిథ్యం తమను ఎంతగానో ఆకట్టుకుందని, ముఖ్యంగా తమ చిన్నారి హృదయంపై భారత్ వేసిన ముద్ర ఈ సంఘటనతో స్పష్టమైందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య మైత్రి, అక్కడి నాయకుల పట్ల విదేశీయులలో పెరుగుతున్న అభిమానాన్ని ప్రతిబింబిస్తున్నాయి.
