ప్రధాని-రాజధాని.. బిగ్ హాట్ టాపిక్ .. !
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. మే 2న రాజధానికి రానున్నారు. రాజధాని నిర్మాణ పనులకు సంబంధించి .. పునః శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేసేందుకు ఆయన రాజధాని ప్రాంతానికి వస్తన్నారు.
By: Tupaki Desk | 23 April 2025 10:00 PM ISTప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. మే 2న రాజధానికి రానున్నారు. రాజధాని నిర్మాణ పనులకు సంబంధించి .. పునః శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేసేందుకు ఆయన రాజధాని ప్రాంతానికి వస్తన్నారు. అయితే.. సుదీర్ఘ విరామం తర్వాత.. ప్రధాని మరోసారి అమరావతి రాజధానికి వస్తుండడంతో సహజంగానే దీనిపై చర్చ జరుగుతోంది. కానీ.. ఇప్పుడు జరుగుతున్న చర్చ మరింత ఎక్కువగా ఉంది. గతంలో వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఏం చేస్తారన్నది కామనే.
ప్రధానంగా గతంలో వచ్చినప్పుడు పవిత్ర మట్టి, జలాలను మోడీ తెచ్చారు. అయితే.. ఇప్పుడు ఏమిస్తారు? అనేది కీలకం. దీనిపై ఎవరికి వారు సమాధానాలు చెప్పుకొంటున్నారు. ప్రస్తుతం బీజేపీకి దక్షిణాదిలో ఆయువుపట్టుగా ఉన్న ఏపీకి గతానికి భిన్నంగా మోడీ చేయాల్సిన పనులు చాలానే ఉన్నాయి. అందుకే.. ఇప్పుడైనా వాటిని ఇస్తారా? అనేది కీలక ప్రశ్న. రాజధానికి నిధులు పూర్తిగా కేంద్రమే ఇవ్వాల్సి ఉంది. కానీ, అప్పులు ఇచ్చి సరిపుచ్చుతున్నారు.
సరే ఈ విషయంలో రాజీపడ్డారు కాబట్టి.. కీలకమైన మరో విషయం.. కేంద్ర ప్రభుత్వ సంస్థలను రాజధాని లో ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.వాటివిషయాన్ని అయినా.. ఇప్పుడు తేలుస్తారా? అనేది ప్రశ్న. సో.. ఈ విషయాలపైనే ఇప్పుడు చర్చ సాగుతోంది. కానీ.. ప్రధాని మోడీ వ్యూహాలు వేరేగా ఉన్నాయని తెలుస్తోంది. రాజధానికి ఇస్తున్న గ్రాంటు, ప్రపంచ బ్యాంకు నుంచి ఇప్పిస్తున్నరుణాలు వంటివాటిని ఆయన ప్రస్తావిం చే అవకాశం ఉంది. కానీ.. నేరుగా రాజధానికి ప్రత్యేక సాయంపై ప్రకటన చేసే చాన్స్ కనిపించడం లేదు.
మరోవైపు.. రాజధాని ప్రాంతంలో ఇప్పటికై మెట్రోరైలుకు కీలక ప్రతిపాదన కూడాచేశారు. విజయవాడ, అమరావతిని కలుపుతూనే రహదారిని.. కృష్ణానది పై నుంచే నిర్మిస్తున్నారు. దీంతో ఈ విషయాలను కూడా ఆయన ప్రస్తావించే అవకాశం ఉంది. ఇంతకు మించి రాజధాని విషయంలో ప్రత్యేకంగా మోడీ చెప్పేది ఉండదన్నది మేధావులు సైతం చెబుతున్న మాట. సో.. ఎలా చూసుకున్నా.. మోడీ రాకపై చర్చ జోరుగానే సాగుతున్నా.. పైన చెప్పుకొన్న విషయాలు తప్ప.. ఇంతకు మించి ఉండేలా లేవని తెలుస్తోంది.
