ప్లాస్టిక్కే పెనుభూతం.. 'నేపాల్' గుర్తు చేస్తోంది సోదరా!
ఎందుకంటే.. ఏం తీసుకురావాలన్నా.. సంచీలు కావాలి కాబట్టి!. కానీ, ఇప్పుడు షాపింగు కోసమే బయటకు వచ్చినా. .. వెచ్చాల కోసం.. ఇంటి నుంచి బయలు దేరినా.. ఒక్కరు కూడా సంచితీసుకుని బయటకు రావాలన్న స్పృహను కనబరచలేకపోతున్నారు.
By: Tupaki Desk | 6 Sept 2026 2:00 PM ISTవాడి పారేసే ప్లాస్టిక్ బాటిళ్లు.. తాగి పారేసే.. వాటర్ ప్యాకెట్లు.. ఇవన్నీమనకు చాలా తేలిక!. చాలా సులువు కూడా!. ఇక , ఒకప్పుడు కుటుంబంలోని వారు ఏ పనిపై బయటకు వచ్చినా.. చేతిలో సంచీని మాత్రం వదిలి పెట్టేవారు కాదు. ఎందుకంటే.. ఏం తీసుకురావాలన్నా.. సంచీలు కావాలి కాబట్టి!. కానీ, ఇప్పుడు షాపింగు కోసమే బయటకు వచ్చినా. .. వెచ్చాల కోసం.. ఇంటి నుంచి బయలు దేరినా.. ఒక్కరు కూడా సంచితీసుకుని బయటకు రావాలన్న స్పృహను కనబరచలేకపోతున్నారు. దీనికి కారణం.. ఆ కొట్టువాడే ప్లాస్టిక్ సంచీ ఇస్తాడన్న భరోసా!!.
కానీ, ఈ ప్లాస్టిక్కే పెనుముప్పుగా మారుతోంది. ప్రకృతికి శాపంగా కూడా.. పరిణమిస్తోంది. తాజాగా నేపాల్‌లో సంభవిం చిన ప్రకృతి విలయం.. వేలాది మంది ప్రాణాలను బలితీసుకుంది. అదేసమయంలో మరిన్ని వేల మందిని నిరా శ్రయులను చేసింది. కన్నుమూసి తెరిచే లోగా.. విరుచుకుపడ్డ వరద.. ప్రజలను అతలాకుతలం చేసింది. ఫలితం గా నిలువ నీడ కోసం.. ఏళ్ల తరబడి కష్టించి దాచుకున్న సొమ్ము కోసం.. ప్రజలు పడుతున్న ఆవేదనకు అంతులే కుండా పోయింది. ప్రభుత్వాలు సాయం చేస్తున్నా.. అది ఏమూలకు! అనే ప్రశ్న కూడా వస్తోంది.
వరదే కదా!
ఇక్కడ ఓ సందేహం వస్తుంది.. నేపాల్‌లో సంభవించిన వరదలకు.. ప్లాస్టిక్‌కు మధ్య లింక్ ఏంటి? అని. ఇదే విష యాన్ని తాజాగా ప్రపంచ విపత్తు, పర్యావరణ విభాగం నిశితంగా వివరించింది. వరదలు రావడానికి కారణం భూమి వేడెక్కిపోవడమట!. భూములు వేడెక్కిన కారణంగా.. హిమాలయాలు కరిగిపోయి.. ఆ నీరు వరద రూపంలో ముంచుకు వస్తోందన్నది ప్రపంచ సంస్థ చేసిన హెచ్చరిక. ప్లాస్టిక్ కారకాలు.. భూమిలో కరిగిపోకపోవడంతో నేల తల్లి నిలువెల్లా మండిపోతోందని చెబుతున్నారు.
ఉదాహరణకు.. ఒక వ్యక్తి ఏదైనా తిన్నాక.. అది జీర్ణంకాకపోతే.. ఎలా అయితే గ్యాస్ ఫామై.. కడుపు ఉబ్బిపోతుందో.. అలానే భూమి తల్లి కూడా.. ప్లాస్టిక్‌ను జీర్ణించుకోలేక.. ఇబ్బందిపడుతుందని వివరించారు. దీనికితోడు.. కరువవు తున్న పచ్చదనం కూడా.. కడలికి శాపంగా మారుతోంది. తద్వారా.. సముద్రాలు ఉప్పొంగుతున్నాయి. ఇలా జరిగే.. నేపాల్ అతలాకుతలం అయిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించాలని.. చెట్లను పెంచాలని సూచిస్తున్నారు. హిమాలయాలకు చేరువగా ఉన్న దేశాల్లో భారత్ కూడా ఉంది. మరి మనమూ కొన్ని జాగ్రత్తలు ఇప్పటికైనా తీసుకుందామా? లేక.. నేపాల్ మాదిరి సంక్షొభం వచ్చే వరకు వేచి చూద్దామా? అనేది మన చేతుల్లోనే ఉంది!.
