Begin typing your search above and press return to search.

హెచ్చ‌రిక‌లు ప‌ట్ట‌ని అధికారులు.. కూలిన విమానం.. మ‌న‌ద‌గ్గ‌రే!

మెద‌క్ జిల్లాలోని తూప్రాన్ శివారులో ఉన్న టాటా కాఫీ పరిశ్రమ సమీపంలో శిక్షణ విమానం కూలింది. భారీగా మంటలు చెలరేగడంతో విమానం పూర్తిగా దగ్ధమైంది.

By:  Tupaki Desk   |   4 Dec 2023 6:49 AM GMT
హెచ్చ‌రిక‌లు ప‌ట్ట‌ని అధికారులు.. కూలిన విమానం.. మ‌న‌ద‌గ్గ‌రే!
X

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మిషంగ్ తుఫాను ప్ర‌భావం కొన‌సాగుతోంది. వాతావ‌ర‌ణం ఏమాత్రం అనుకూ లంగా లేద‌ని అధికారులు హెచ్చ‌రించారు. దీంతో రైళ్లు ర‌ద్దు అయ్యాయి. ఇక‌, వాయు మార్గంలోనూ కొన్ని విమానాల‌ను చాలా ఆల‌స్యంగా న‌డుపుతున్నారు. ఇంత కీల‌క స‌మ‌యంలో వాయు సేన అధికారులు ఈ తుఫాన్ హెచ్చ‌రిక‌ల‌ను ఏమాత్రం ప‌ట్టించుకోలేదు. ఫ‌లితంగా రెండు నిండు ప్రాణాలు కాలి బుగ్గ‌య్యాయి. వారు శిక్ష‌ణ పైల‌ట్లు కావడం మ‌రింత విషాదం.

ఏం జ‌రిగింది?

మెద‌క్ జిల్లాలోని తూప్రాన్ శివారులో ఉన్న టాటా కాఫీ పరిశ్రమ సమీపంలో శిక్షణ విమానం కూలింది. భారీగా మంటలు చెలరేగడంతో విమానం పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలెట్లు సజీవదహనం అయ్యారు. గుర్తుపట్టలేని విధంగా మృతదేహాలు ఉన్నాయి. ఒకరు పైలెట్, మరొకరు ట్రైనీ పైలెట్‌గా గుర్తించారు. ప్రమాదానికి గురైన విమానం దుండిగల్ ఎయిర్‌పోర్ట్‌కు చెందిన శిక్షణ విమానంగా గుర్తించారు.

అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేసేందుకు యత్నిస్తున్నారు. సాంకేతిక కారణాల వల్లే విమానం కూలినట్లు అధికారులు చెబుతున్నా.. వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల హెచ్చ‌రిక‌ల‌ను ప‌ట్టించుకోలేద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఇక‌, మృతుల్లో ఒకరు అభిమన్యు రాయ్‌గా గుర్తించగా.. మరొకరు వియత్నాంకు చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. ఘటన స్థలంలోనే వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు.