Begin typing your search above and press return to search.

విమానం టేకాఫ్ vs ల్యాండింగ్.. ఏ సమయంలో ఎక్కువ ఇంధనం ఖర్చవుతుంది?

విమాన ప్రయాణం చాలా మంది కల. జీవితంలో ఒక్కసారైనా విమానం ఎక్కి చక్కర్లు కొట్టాలని చాలా మందికి ఉంటుంది.

By:  Tupaki Desk   |   24 April 2025 12:00 AM IST
How Much Fuel Does a Plane Consume?
X

విమాన ప్రయాణం చాలా మంది కల. జీవితంలో ఒక్కసారైనా విమానం ఎక్కి చక్కర్లు కొట్టాలని చాలా మందికి ఉంటుంది. కాకపోతే విమాన ప్రయాణం ఖర్చుతో కూడుకున్న పని కావడంతో చాలా మందికి అది కలగానే మిగిలిపోయింది. ఇటీవల కాలంలో ప్రభుత్వాలు.. మధ్య తరగతి ప్రజలకు కూడా విమాన ప్రయాణం అందుబాటులోకి తేవాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. దీంతో కొంతమందికి విమానంలో ప్రయాణించే అవకాశం లభిస్తోంది. రోడ్డు మీద నడిచే వాహనాలతో పోలిస్తే విమానంలో చాలా ఎక్కువ ఇంధనం అవసరమవుతుంది.అయితే, విమానం ల్యాండ్ అయ్యేటప్పుడు లేదా టేకాఫ్ అయ్యేటప్పుడు.. ఏ సమయంలో ఎక్కువ ఇంధనం ఖర్చవుతుందో ఈ కథనంలో తెలుసుకుందాం.విమానంలో వాడే ఇంధనాన్ని ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) అంటారు. ఇది కిరోసిన్ లాంటిదే.

విమానంలో ఎంత ఇంధనం పడుతుంది?

విమానంలో ఎంత ఇంధనం పడుతుందో తెలుసుకునే ముందు, ఒక కమర్షియల్ విమానం ట్యాంక్‌లో ఎంత ఇంధనం నింపవచ్చో తెలసుకుందాం. ఎయిర్ బస్ A380లో దాదాపు 3,20,000 లీటర్ల ఇంధనం పడుతుంది. అలాగే, బోయింగ్ 747లో దాదాపు 1,80,000 లీటర్ల ఇంధనం పడుతుంది. విమానం ఫ్యూయెల్ ట్యాంక్ పరిమాణం, విమానం బరువు, ప్రయాణించే దూరం, వాతావరణ పరిస్థితులపై ఆధారపడి విమానంలో ఎంత ఇంధనం నింపవచ్చు అనేది మారుతుంది. కొన్ని చిన్న ప్యాసింజర్ విమానాల్లో 20 వేల నుండి 35 వేల లీటర్ల ఇంధనం మాత్రమే నింపుతారు.

ఏదైనా విమాన ప్రయాణంలో విమానానికి పెద్ద మొత్తంలో ఇంధనం అవసరం అవుతుంది. బోయింగ్ 737 విమానానికి ప్రయాణ సమయంలో ప్రతి సెకనుకు దాదాపు 4 లీటర్ల ఇంధనం ఖర్చు అవుతుంది. అంటే ఈ విమానం నిమిషానికి 240 లీటర్ల ఇంధనాన్ని వినియోగిస్తుంది. ఈ లెక్కన బోయింగ్ 737 విమానం 1 కిలోమీటరుకు దాదాపు 12 లీటర్ల ఇంధనాన్ని తీసుకుంటుంది. అదే ఎయిర్‌బస్ A320 విషయానికి వస్తే ఈ విమానం గంటకు 14 వేల లీటర్ల కంటే ఎక్కువ ఇంధనాన్ని ఖర్చు చేస్తుంది.

టేకాఫ్ లేదా ల్యాండింగ్: దేనిలో ఎక్కువ ఇంధనం ఖర్చవుతుంది?

విమానం ల్యాండ్ అయ్యే దానికంటే టేకాఫ్ అయ్యేటప్పుడే ఎక్కువ ఇంధనం అవసరం అవుతుంది. ఎందుకంటే విమానం టేకాఫ్ అయ్యే సమయంలో గాల్లోకి ఎగిరేందుకు దాని ఇంజన్లు పూర్తి సామర్థ్యంతో పని చేస్తాయి. దీనివల్ల ఇంధన వినియోగం చాలా ఎక్కువగా ఉంటుంది. ల్యాండింగ్ సమయంలో విమానం వేగం తగ్గుతుంది. ఇంజన్లు తక్కువ శక్తిని ఉపయోగిస్తాయి. అందువల్ల ఇంధన వినియోగం కూడా తగ్గుతుంది.