Begin typing your search above and press return to search.

ఆ పీకేతో బాబు...ఈ పీకే దూరం...!?

ఇద్దరు పీకేలతో ఇంకేంటి చంద్రబాబుకు అని అంతా అనుకోవచ్చు. కానీ ఒక పీకే వచ్చాక మరో పీకే దూరం జరిగారా అన్నది ఇపుడు చర్చకు వస్తోంది.

By:  Tupaki Desk   |   24 Dec 2023 4:30 PM GMT
ఆ పీకేతో బాబు...ఈ పీకే దూరం...!?
X

ఇద్దరు పీకేలతో ఇంకేంటి చంద్రబాబుకు అని అంతా అనుకోవచ్చు. కానీ ఒక పీకే వచ్చాక మరో పీకే దూరం జరిగారా అన్నది ఇపుడు చర్చకు వస్తోంది. ఇంతకీ జరిగింది ఏంటి అంటే చంద్రబాబు ఉండవల్లి నివాసంలో మూడు రోజుల పాటు యాగాలు హోమాలు చేయిస్తున్నారు. ఈ మధ్యలోనే అర్జంటుగా ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకేని వెంటబెట్టుకుని నారా లోకేష్ వచ్చారు.

అలా పీకే విత్ చంద్రబాబు మూడు గంటల పాటు సీరియస్ గా పొలిటికల్ భేటీ వేశారు. మరి ఈ భేటీకి పవన్ ఎందుకు రాలేదు అన్న చర్చ సాగుతోంది. నిజానికి పవన్ కి రమ్మని టీడీపీ పెద్దలు పిలిచారా లేదా అన్నది కూడా ప్రశ్నగా ఉంది అంటున్నారు. ఒక వేళ పిలిచినా పవన్ వెళ్ళలేదంటే పీకే దూరం జరిగారా అన్నది మరో పాయింట్ గా ఉందిట.

ఇవన్నీ పక్కన పెడితే అసలు వాస్తవంగా ఏమి జరిగింది, ఏమి జరిగి ఉంటుంది అన్నది కూడా చూస్తే మాత్రం పవన్ కి చంద్రబాబు పీకేల మీటింగ్ మీద సమాచారం ఉంది అని అంటున్నారు. అయితే పవన్ కావాలనే దీని మీద దృష్టి పెట్టలేదు అని అంటున్నారు. ఒకనాడు ప్రశాంత్ కిశోర్ ని చంద్రబాబు టీడీపీ శ్రేణులు ఇష్టం వచినట్లుగా మాట్లాడి తిరిగి ఆయనతో చేతులు కలపడం పవన్ కి ఇష్టం లేదు అని అంటున్నారు.

అంతే కాదు ఏపీలో వైసీపీని గద్దె దించేందుకు టీడీపీతో పవన్ చేతులు కలిపారు అని అంటున్నారు. అదే టైం లో బీజేపీని కూడా కూటమికి దగ్గరకు చేర్చాలని పవన్ చూస్తున్నారు. అయితే టీడీపీ ఆలోచనలు వేరేగా ఉన్నాయని అంటున్నారు. ఇండియా కూటమి వైపుగా ఆ పార్టీ అడుగులు వేస్తోందా అన్న డౌట్లు ఉన్నాయట.

దాంతో పాటు పీకే కూడా బాబు పక్కన చేరడంతో పవన్ అలెర్ట్ అయ్యారని అంటున్నారు. నిజానికి చూస్తే ఏపీలో బీజేపీ కూటమిలో కలవకపోతే టీడీపీ జనసేన కలసి ఎన్నికలకు వెళ్లాలని పవన్ భావించారని అంటున్నారు. ఒక దశలో బీజేపీతో కూడా పొత్తు తెంచుకోవాలని చూశారని అంటున్నారు.

అయితే ఇపుడు జరుగుతున్న పరిణామాలు చూసిన మీదట పవన్ తొందరపడకూడదని భావిస్తున్నారని అంటున్నారు. జనసేన కోరుకుంటున్న సీట్లు, ఉమ్మడి ఎన్నికల ప్రణాళికలో జనసేనకు ప్రాధ్యాతన. అధికారంలో వాటా మీద స్పష్ట వచ్చాకనే తదుపరి అడుగులు వేయాలని పవన్ ఆలోచిస్తున్నారు అని అంటున్నారు.

ఇక బీజేపీ విషయంలో కూడా పవన్ ఒక ఆప్షన్ పెట్టుకుని ఉన్నారని అంటున్నారు. అన్నీ చూసిన మీదటనే తనదైన కొత్త వ్యూహాన్ని అమలు చేయడానికి పవన్ చూస్తున్నారు అని అంటున్నారు. మొత్తానికి చూస్తే పీకే బాబు భేటీకి పవన్ కావాలనే దూరంగా ఉన్నారా అన్నది మాత్రం బయట ఒక టాక్ గా స్ప్రెడ్ అవుతోంది.

మరి అదే నిజమైతే మాత్రం ఏదో తెలియని ఒక గ్యాప్ మాత్రం రెండు పార్టీల మధ్య ఏర్పడినట్లే అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో. పవన్ ఫ్యూచర్ స్టెప్స్ ఎలా ఉండబోతున్నాయో.