పిఠాపురం వర్మ ఇష్యూను అలా సెటిల్ చేస్తారా ?
పిఠాపురం వర్మ ఇపుడు ఏపీలో హాట్ పాలిటిక్స్ కి కేరాఫ్ గా ఉన్నారు. ఆయన ఏ మాట మాట్లాడినా సెన్సేషన్ అవుతోంది.
By: Tupaki Desk | 10 April 2025 11:00 PM ISTపిఠాపురం వర్మ ఇపుడు ఏపీలో హాట్ పాలిటిక్స్ కి కేరాఫ్ గా ఉన్నారు. ఆయన ఏ మాట మాట్లాడినా సెన్సేషన్ అవుతోంది. ఆయన సొంత సీటుని జనసేనకు కేటాయిస్తున్నారు అన్న వార్తలు వచ్చిన టైంలో ఆయన అనుచరులు చేసిన యాగీ అంతా ఇంతా కాదు, అయితే ఆనక వర్మకు చంద్రబాబు పిలుపుతో ఇక హామీ లభించింది. దాంతో ఆయన శాంతించారు.
అలా ఆనాటి నుంచి పిఠాపురం వర్మ స్టేట్ లెవెల్ లో కీలక నేత అయిపోయారు. ఇదిలా ఉంటే వర్మ వర్సెస్ జనసైనికులు గా సాగుతూ వస్తున పిఠాపురం నియోజకవర్గం లోని రాజకీయం కాస్తా ఇటీవల కాలంలో వేరే టర్న్ తీసుకుంది. ఏకంగా మెగా బ్రదర్ ఎమ్మెల్సీ అయిన నాగబాబు వర్మ మీద పరోక్షంగా చేసిన కామెంట్స్ తో రాజకీయం కాస్తా మరింతగా ముదిరి పాకన పడింది.
ఈ క్రమంలో వర్మ కూడా దూకుడుగానే రాజకీయం చేస్తూ వస్తున్నారు. ఆయన లేటెస్ట్ గా చేసిన ఒక ప్రకటన రాజకీయ వర్గాలలో కలకలం రేపింది. కూటమి గెలుపు వెనక ఉన్నది లోకేష్ అని అన్నారు. ఆయన వల్లనే విజయం తప్ప మరోటి కాదని అన్నారు.
తరచి చూస్తే దీని భావమేంటి అంటే పవన్ కళ్యాణ్ ఇమేజ్ తో కాదు లోకేష్ తోనే అంతా అని అన్నట్లుగా ఉందని కూడా చెప్పుకుంటున్నారు. ఆయన అలా ఇండైరెక్ట్ గా జనసేన అధినాయకత్వానికి తన స్టైల్ లో షాకులు ఇస్తున్నారు అని అంటున్నారు.
ఇక చూస్తే వర్మ సంగతి ఇంతేనా ఆయన ఇలాగే పార్టీలో సైడ్ కావాల్సిందేనా అన్న చర్చ కూడా అనుచరులలో ఉంది. అయితే వర్మకు టీడీపీ అధినాయకత్వం ఒక ఆఫర్ ని ఇచ్చింది అని అంటున్నారు. 2029 ఎన్నికలకు ఇపుడు ఉన్న 175 సీట్లు కాస్తా 225 దాకా అవుతాయని అంటున్నారు. అందులో పిఠాపురం కూడా ఉందని రెండుగా మారుతుందని అంటున్నారు.
అలా విభజన తరువాత వచ్చే కొత్త సీటుని వర్మకు ఇస్తారు అని అంటున్నారు. అప్పటివరకూ ఆయన ఓపిక పట్టాలని కోరుతున్నట్లుగా ఉంది. అదే సమయంలో 2027లో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ సీటులో ఒక దానిని ఇస్తారని కూదా అంటున్నారు.
మొత్తం మీద చూస్తే వర్మకు టీడీపీ అధినాయకత్వం ఏ విధంగానూ అన్యాయం చేయబోదని అంటున్నారు. ఆయన పార్టీ కోసం చేసిన సేవలకు గుర్తుగా ఆయనకు సముచిత స్థానమే ఉంటుందని అంటున్నారు. అయితే వర్మ మాత్రం పిఠాపురం గురించి పట్టుబడితే మాత్రం కష్టమే అని అంటున్నారు. ఎందుకంటే పిఠాపురం జనసేనకు ఇచ్చేసినట్లే అని అంటున్నారు. పొత్తులు ఉన్నంతవరకూ ఈ సీటు జనసేనకే ఉంటుందని చెబుతున్నారు.
మొత్తం మీద చూస్తే కనుక పిఠాపురం వర్మ టీడీపీలో కొత్త నాయకత్వంగా లోకేష్ రావాలని కోరుతున్నారు. ఆయన చంద్రబాబు పట్ల విధేయతగా ఉంటూనే లోకేష్ పట్ల అపరిమితమైన ప్రేమను కనబరుస్తున్నారు. లోకేష్ ఫ్యూచర్ లీడర్ అని వర్మ గట్టిగా నినదిస్తున్నారు.
ఇవన్నీ పక్కన పెడితే వర్మకు జిల్లాలో కూడా కొంత మద్దతు దక్కిందని అంటున్నారు. ఆయనకు అండగా ఉండే సీనియర్ నేత యనమల రామక్రిష్ణుడు ఇపుడు మాజీ ఎమ్మెల్సీ అయిపోయారు. అయితే టీడీపీలో మంచి రోజులు వస్తాయనే వర్మ ఆశగా ఉన్నారు. తనకు ప్రస్తుతం వస్తున్న హామీల మీద కూడా ఆయన ఆలోచిస్తున్నారని టాక్. ఆయన వైసీపీలోకి వెళ్తారు అన్న మాట కూడా తప్పు అని అనుచరులు అంటున్నారు
