పిఠాపురం వర్మ...అంతలోనే అలా !
పిఠాపురం వర్మగా పేరు గడించిన ఎస్వీఎస్ఎన్ వర్మ టీడీపీ ఇంచార్జిగా జనాలకు సుపరిచితులు.
By: Tupaki Desk | 25 April 2025 4:58 PMపిఠాపురం వర్మగా పేరు గడించిన ఎస్వీఎస్ఎన్ వర్మ టీడీపీ ఇంచార్జిగా జనాలకు సుపరిచితులు. అంతే కాదు ఆయన గతంలో ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేశారు కాబట్టి ఆయనకంటూ ఒక ప్రత్యేక వర్గం ఉంది. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే అక్కడ పవన్ కళ్యాణ్. పైగా ఆయన ఉప ముఖ్యమంత్రి. ఆయనకు సినీ క్రేజ్ కూడా ఎక్కువ. దాంతో పిఠాపురం అంటే జనసేన అడ్డా అని అంటున్నారు ఆ పార్టీ వారు. పవన్ అయితే పొలిటికల్ గా బిగ్ ఫిగర్. ఆయనతో పోటీ అన్నది ఎవరూ ఊహించుకోరు.
ఇక రాజకీయంగా తలపండిన వర్మ కూడా అలాగే ఆలోచిస్తారు కూడా. అయితే తేడా అల్లా క్యాడర్ తోనే వస్తోంది. పిఠాపురం వర్మ తమ అధినేత చంద్రబాబుతో బాగుంటారు. ఇది సహజం. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తోనూ బాగుంటారు.
ఆయనతో అలా ఉండడం వల్ల అంతా బాగుంది అనుకుంటే కూడా పొరపాటే అనే విధంగా సంఘటనలు జరుగుతున్నాయి తాజాగా పవన్ పర్యటనలో పిఠాపురం వర్మ అసహనానికి గురి అయ్యారని అని అంటున్నారు. దానికి కారణం పవన్ సభకు వర్మకు మాత్రమే ఆహ్వానం అందిందట.
ఆయన వెంట వచ్చిన నాయకులను మాత్రం అనుమతిలేదు. దాంతో వర్మలో కట్టలు తెంచుకున్న అసహనం ఏమిటో అంతా చూశారు. పోలీసు అధికారులతో వర్మ మాట్లాడుతూ తనతో వచ్చిన నాయకులను లోపలికి పంపించకుంటే తాను కూడా వెళ్ళిపోతాను అని గట్టిగానే చెప్పారని అంటున్నారు.
ఇక పోలీసులు అయితే వర్మకు నచ్చచెప్పి పవన్ వద్దకే నేరుగా తీసుకుని వెళ్ళారని అంటున్నారు. మొత్తానికి వర్మ తన అనుచరులకు ఏమైనా జరిగితే తగ్గేది లేదు అని అంటున్నారు. నిజమే ఈ నాయకుడికి అయినా కావాల్సింది అనుచరులే. వారి శ్రేయస్సే.
అయితే కొన్ని సార్లు చిన్న చిన్నవి జరుగుతూ ఉంటాయి. వాటిని పెద్దదిగా చేసుకోవడం వల్ల ఇబ్బందే అని అంటున్నారు. టగ్ ఆఫ్ వార్ గా గ్రౌండ్ లెవెల్ లో జనసేన టీడీపీ నేతల మధ్యన పోటీ ఉన్న వేళ వారూ వీరూ అంటూ జోరు చేస్తున్నారు.
దాంతో పోలీసులు ఈ వివాదాలు ఎందుకు అన్నట్లుగా పరిమిత సంఖ్యలో పరిమితమైన నాయకులనే రెండు వైపులా ఆహ్వానిస్తున్నారు. అయితే మరో పద్ధతిలో కార్యక్రమాలను వెళ్ళాలనుకునే నాయులు నేరుగా కీలక నేతలను ఆశ్రయిస్తున్నారు. అలా వారి వెంట వస్తే వీరికి కూడా గ్రాండ్ ఎంట్రీ నో అబ్జెక్షన్ తో ఉంటుందని భావిస్తున్నారు. అలా కుదరని పక్షంలోనే చాలా జరుగుతున్నాయని అంటున్నారు. మొత్తానికి వర్మలో రెండవ కోణంగా తీవ్ర అసహనం కూడా కనిపిస్తోందని అంటున్నారు. అది తన వారి కోసమా లేక వేరే కారణాల కోసమా అన్నదే చర్చగా ఉందిట.