Begin typing your search above and press return to search.

టార్గెట్ చేసినోళ్ల ఫోన్లను ఎలా హ్యాక్ చేయొచ్చు?

గతంలో ఎవరైనా ఏదైనా సెల్ ఫోన్ ను ట్యాప్ చేయాలంటే అందులో మాల్ వేర్ ను చొప్పించాల్సి ఉండేది.

By:  Tupaki Desk   |   26 March 2024 6:25 AM GMT
టార్గెట్ చేసినోళ్ల ఫోన్లను ఎలా హ్యాక్ చేయొచ్చు?
X

సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ లో ఎన్నికల వేళలో టీపీసీసీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి ఇంటికి సమీపంలో ఒక ఆఫీసు సెటప్ చేసి.. అక్కడో ప్రత్యేకమైన డివైజ్ ను ఏర్పాటు చేయటం ద్వారా రేవంత్ ఇంట్లో మాట్లాడుకునే మాటల్ని విన్నట్లుగా సంచలన ఆరోపణలు తెర మీదకు రావటం తెలిసిందే. అదెలా సాధ్యం? దాని వెనుకున్న లాజిక్ ఏంటి? సెల్ ఫోన్ ను హ్యాక్ చేయకుండా.. ఇంట్లో ఉండే ఎలక్ట్రానిక్ డివైజ్ లతో హ్యాక్ చేయటం సాధ్యమేనా? అదెలా వర్కు చేస్తుంది? లాంటి సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఈ ఉదంతం గురించి కొందరు సైబర్ నిపుణులతో మాట్లాడినప్పుడు.. అలా ట్యాప్ చేయటానికి ఉన్్న అవకాశాలు.. దాని సాంకేతికత ఎలా అన్నది వివరిస్తున్నారు. ఇదంతా తెలుసుకున్న తర్వాత.. ఎవరైనా ఎవరినైనా టార్గెట్ చేయాలంటే అంత కష్టమైన పని కాదన్న విషయం అర్థమవుతుంది. ఇంతకూ రేవంత్ ఇంటిని టార్గెట్ చేసిన టెక్నాలజీ ఎలా పని చేసి ఉండొచ్చన్న అంచనాను కొందరు సైబర్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. వారేం చెబుతున్నారంటే..

గతంలో ఎవరైనా ఏదైనా సెల్ ఫోన్ ను ట్యాప్ చేయాలంటే అందులో మాల్ వేర్ ను చొప్పించాల్సి ఉండేది. అయితే.. స్మార్ట్ ఫోన్లలో సెక్యూరిటీ ఫీచర్లు పెరుగుతున్నట్లే.. లొసుగులు కూడా పెరుగుతున్నాయి. ఒకప్పుడు ఫోన్ చేతికి వస్తే తప్పించి వారి ఫోన్ ను హ్యాక్ చేయటం సాధ్యం కాదు. అందులో మాల్ వేర్ జొప్పించకుంటే ఫోన్ లోని సమాచారాన్ని తెలుసుకోవటం సాధ్యమయ్యేది కాదు.

అందుకే పలువురు హ్యాకర్లు లింకులు పంపటం.. వాట్సప్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఒక ఫోటోను పంపి.. దాన్ని క్లిక్ చేసినంతనే మాల్ వేర్ ఇన్ స్టాల్ అయ్యేలా చేయొచ్చు. పెగాసెస్ లాంటి స్పైవేర్ లు వచ్చిన తర్వాత స్మార్ట్ ఫోన్ చేతికి రాకున్నా.. స్మార్ట్ ఫోన్ వాడే ఏదైనా నిత్యావసర యాప్ లోని లొసుగుల్ని ఆధారంగా చేసుకొని మాల్ వేర్ ను ఇన్ స్టాల్ చేయొచ్చని చెబుతున్నారు. తాజాగా వెలుగు చూసిన రేవంత్ ఇంటి వద్ద ఏర్పాటు చేసిన డివైజ్ కూడా ఆ తరహాకు చెందినదే అయి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

రేవంత్ ఇంటికి సమీపంలో ఏర్పాటు చేసినట్లుగా చెప్పిన ఈ డివైజ్ 300 మీటర్ల పరిధిలో ఉండే నెట్ కనెక్టివిటీ ఉన్న ఎలక్ట్రానిక్ పరికరాల్లోకి చొచ్చుకుపోవటానికి సాయం చేస్తుందంటున్నారు. పబ్లిక్ వైఫైలో ఉంటే హ్యాకర్లుకొన్ని పేలోడ్స్ ద్వారా మొబైల్ ఫోన్లు.. ల్యాప్ టాప్ లలో చొరబతారు. ఇజ్రాయెల్ కు చెందిన సంస్థలు తయారు చేసే టూల్స్ అన్ని రకాల ఆపరేటింగ్ సిస్టమ్ లలో ఉండే లొసుగులు.. వాటిలోకి చొరబడేందుకు దోహదపడే పేలోడ్స్ ఉంటాయి. ఆపరేటింగ్ సిస్టమ్ అప్ గ్రేడ్ అయినా.. కొత్త వెర్షన్ వచ్చినా వెంటనే వాటి ఆప్ డేట్స్ ను ఇజ్రాయెల్ సంస్థలు అందజేస్తాయి. ఇప్పుడు వస్తున్న డివైజ్ లు అన్ని కూడా గ్రాఫిక్ యూజర్ ఇంటర్ ఫేస్ గా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటున్నాయని చెబుతున్నారు. మొత్తంగా ఫోన్లలో మాల్ వేర్ జొప్పించకుండా కూడా ట్యాపింగ్ చేసే వీలుందంటున్నారు.