Begin typing your search above and press return to search.

ఫోన్ హ్యాకింగ్‌.. ఎలా తెలుసుకోవాలి? ఎలా జాగ్ర‌త్త ప‌డాలి?

అత్యంత ఖ‌రీదైన ఇలాంటి ఫోన్ల‌ను వినియోగించుకోవ‌డ‌మే కాదు.. వీటిని భ‌ద్రంగా కాపాడుకోవాల్సిన బాధ్య‌త కూడా వినియోగ‌దారుల‌పైనే ఉంది.

By:  Tupaki Desk   |   8 Nov 2023 11:30 AM GMT
ఫోన్ హ్యాకింగ్‌.. ఎలా తెలుసుకోవాలి?  ఎలా జాగ్ర‌త్త ప‌డాలి?
X

ఒక‌ప్పుడు వంద‌లు ఖ‌ర్చు పెట్టి ఫోన్లు కొనేవారు. కేవ‌లం స‌మాచారం ఇచ్చి పుచ్చుకునేందుకు మాత్ర‌మే ప‌రిమితం అయ్యేవారు. కానీ, కాలం మారింది. ఇప్పుడు ఫోన్ అంటే.. కేవ‌లం స‌మాచారం ఇచ్చి పుచ్చుకునేందుకు మాత్ర‌మే కాదు. ఆఫీసు ప‌నులు చేసుకునేందుకు, వ్య‌క్తిగ‌త స‌మాచారాన్ని సైతం నిక్షిప్తం చేసుకునేందుకు, కుటుంబానికి సంబందించిన స్వీట్ మెమొరీస్‌ను ఫొటోలు, వీడియోల రూపంలో దాచుకునేందుకు ఇలా అనేక కోణాల్లో ఫోన్ ఉప‌యోగ‌ప‌డుతోంది.

దీంతో ఫోన్ల కోసం.. స‌గ‌టు భార‌తీయులు వంద‌ల కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేస్తున్నార‌నేది స‌ర్వేలు చెబుతున్న మాట‌. ఇప్పుడు నెల‌కు రూ.40-50 సంపాయించే ఉద్యోగి చేతిలో ఉంటున్న పోన్‌.. 40 వేల పైమాటేన‌ని అసోచామ్ సంస్థ ఇటీవ‌ల వెల్ల‌డించింది. అత్యంత ఖ‌రీదైన ఇలాంటి ఫోన్ల‌ను వినియోగించుకోవ‌డ‌మే కాదు.. వీటిని భ‌ద్రంగా కాపాడుకోవాల్సిన బాధ్య‌త కూడా వినియోగ‌దారుల‌పైనే ఉంది.

అయితే.. దొంగ‌త‌నం నుంచి కాపాడేందుకు, ఫిజిక‌ల్ డ్యామేజీ నుంచి ర‌క్షించేందుకు బీమాలు ఉన్నాయి. కానీ, హ్యాకింగ్ నుంచి ర‌క్షించే ప‌రిస్థితి ఇప్ప‌టి వ‌ర‌కు రాలేదు. ఎవ‌రికి వారే.. త‌మ త‌మ ఫోన్ల‌ను హ్యాకింగ్ నుంచి కాపాడుకోవాల్సిన ప‌రిస్థితి ఉంది. ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా ఐఫోన్ స‌హా హై రేంజ్ స్మార్ట్ ఫోన్ల‌లో హ్యాకింగ్ సంచ‌ల‌నం రేపుతోంది. ఈ నేప‌థ్యంలో హ్యాకింగ్ ఎలా జ‌రుగుతుంది? ఎలా ర‌క్షించుకోవాల‌నే టిప్స్ ఇప్పుడు చూద్దాం.

+ డేటా తొంద‌ర‌గా అయిపోవ‌డం

సాధార‌ణం క‌న్నా..ఎక్కువ‌గా డేటా అయిపోతే.. దానికి మాల్వేర్‌ కారణం కావొచ్చు. స్పైవేర్‌ లేదా మాల్వేర్‌ నిరంతరం ఫోన్‌లో పనిచేస్తూనే ఉంటుంది. డేటాను వాడుకుంటుంది. కాబట్టి అన్‌లిమిటెడ్‌ ప్లాన్‌ తీసుకున్నట్టయితే డేటా వాడకం మీద ఓ కన్నేసి ఉంచాలి.

+ పాపప్‌లు

ఫోన్‌లో ఇంటర్నెట్‌ బ్రౌజ్‌ చేస్తున్నప్పుడు అదేపనిగా అనుచిత పాపప్‌లు ఉబికి వస్తున్నా అనుమానించాలి. ఉన్నట్టుండి యాడ్స్ వ‌చ్చినా.. పోర్న్ సందేశాలు వ‌చ్చినా సందేహించాలి.

+ కొత్త యాప్‌లు

ఫోన్‌లో ముందుగానే డౌన్‌లోడ్‌ చేసిన యాప్‌ల కంటే డౌన్‌లోడ్‌ చేయని యాప్‌లు వ‌స్తే.. మాల్వేర్ అయిన‌ట్టే లెక్క‌.

+ అవుట్‌గోయింగ్‌ కాల్స్‌

కాల్‌ హిస్టరీలో తెలియని నంబర్లు కనిపిస్తే అప్రమత్తం కావాలి. మెసేజ్‌లు వ‌స్తున్నా.. మ‌న‌కు తెలియ‌కుండానే పోన్లు వెళ్తున్నా హ్యాక్ అయిన‌ట్టే.

+ స్పీడ్‌

ఫోన్ సాధార‌ణంగా ఎంతో కొంత వేగంతో న‌డుస్తుంది. ఇది ర్యామ్‌పై ఆధార‌ప‌డి ఉంటుంది. అలా కాకుండా.. స్పీడ్ త‌గ్గిపోతే.. ఖ‌చ్చితంగా అనుమానించాలి. అదేవిధంగా స్పామ్ మెసేజ్‌లు వ‌స్తున్నా.. సందేహించాలి.

+ సెక్యూరిటీ కోడ్ పోయినా..

సాధార‌ణంగా పోన్ల‌కు సెక్యూరిటీ ఉంటుంది. ఇది వ్య‌క్తిగ‌త విష‌యం. అయితే.. అవి మ‌న‌కు తెలియ‌కుండానే డిలీట్ అయితే.. అనుమానించాల్సిన అవ‌స‌రం ఉంటుంది.

ఏం చేయాలి?

ఫోన్‌ హ్యాక్‌ అయ్యిందనిపిస్తే కాంటాక్ట్‌ నంబర్లన్నింటికీ ఫోన్‌ హ్యాక్‌ విషయాన్ని తెలపాలి. మన ఫోన్‌ నుంచి వచ్చే అనుమానిత లింకులేవీ క్లిక్‌ చేయొద్దని తెలియజేయాలి. ఫోన్‌ వై-ఫై, మొబైల్‌ డేటాను టర్న్‌ఆఫ్‌ చేయాలి. ఫోన్‌లోని మాల్వేర్‌ను గుర్తించి, తొలగించటానికి యాంటీ-మాల్వేర్‌ సాఫ్ట్‌వేర్‌ తోడ్పడుతుంది. దీన్ని తరచూ రన్‌ చేస్తుండాలి.