Begin typing your search above and press return to search.

పీతను హింసించిన ఎమ్మెల్యే... రంగంలోకి దిగిన పెటా!

ఎన్సీపీ (శరద్ పవార్) వర్గానికి చెందిన రాజకీయ నాయకుడు రోహిత్ పవార్ ఇటీవల పూణెలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పీతను వేలాడదీశారు.

By:  Tupaki Desk   |   6 April 2024 1:30 PM GMT
పీతను హింసించిన ఎమ్మెల్యే... రంగంలోకి దిగిన పెటా!
X

ఎన్సీపీ (శరద్ పవార్) వర్గానికి చెందిన రాజకీయ నాయకుడు రోహిత్ పవార్ ఇటీవల పూణెలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పీతను వేలాడదీశారు. ప్రత్యర్థి శిభిరాల్లో అవినీతికి వ్యతిరేకంగా ఒక పాయింట్ చేస్తూ తాడుతో డెక్కలు కట్టివేసి ఉన్న పీతను ప్రదర్శించారు. ఇలా బ్రతికున్న పీతతో స్టంట్ చేస్తూ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తున్నందున జంతు హక్కుల సంఘం (పెటా - ఇండియా) ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది.

అవును... ప్రెస్ మీట్ లో ఒక ప్లాన్ ప్రకారం పీతను బందించి తీసుకొచ్చి ప్రదర్శించారంటూ పెటా ఫిర్యాదు చేసింది. జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం.. మహారాష్ట్ర మోడల్ ప్రవర్తన నియమావళి.. ఎన్నికల ప్రచారానికి జంతువులను ఉపయోగించడాన్ని నిషేధిస్తూ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ 2014 మార్చి 24న జారీ చేసిన ఉత్తర్వ్యులను ఉల్లంఘించారని పెటా ఇండియా ఈ సందర్భంగా పేర్కొంది.

ఇదే సమయంలో పశువైద్య సంరక్షణ, పునరావాసం కోసం పీతను తమకు అప్పగిఒంచాలని కోరుతూ పెటా ఇండియా.. ఎమ్మెల్యే రోహిత్ పవార్ కు లేఖ రాసింది. ఇదే సమయంలో ఇది అనుకోకుండా జరిగిన సంఘటన కాదని.. ఇది ముందస్తు ప్రాణాలిక ప్రకారమే జరిగిందని పెటా అభిప్రాయపడింది. ఈ విషయం వీడియోలో స్పష్టంగా కనిపిస్తుందని వెల్లడించింది.

ఇదే క్రమంలో... మీడియా స్టంట్స్ కోసం మూగ జీవాల ప్రాణాలకు నొప్పి, బాధ కలిగించారని శరత్ పవార్ తో పాటు జిల్లా ఎన్నికల అధికారి మినల్ కలస్కర్ కూ రాసిన లేఖలో పెటా ఇండియా అసోసియేట్ శౌర్య అగర్వాల్ పేర్కొన్నారు. ఇదే సమయంలో... పునరావాసం కోసం పీతను తిరిగి ప్రకృతిలోకి వదిలిపెట్టాలని కోరుతూ ఆ లేఖలో పేర్కొన్నారు!

కాగా.. రాజకీయ ప్రచారాల కోసం జంతువులను ఉపయోగించడం, దుర్వినియోగపరచడం వంటివాటిని ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఇందులో భాగంగా... ఎన్నికల ప్రచారాలు, రాజకీయ ర్యాలీల సమయంలో గాడిదలు, గుర్రాలు వంటి జంతువులను తరచూ కొట్టడం.. తన్నడం.. భయబ్రాంతులకు గురిచేస్తున్నాయై పెటా ఇండియా, ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది. ఈ సమయంలో అవి తమ సామర్ధ్యానికి మించిన భారాన్ని మోయాల్సి వస్తోందని.. తగిన ఆహారం, నీరు వాటికి దొరక్క తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాయని పేర్కొంది.

ఈ నేపథ్యంలో... పెటా ఇండియా విజ్ఞప్తికి ప్రతిస్పందనగా... రాజకీయ ప్రచారాలలో జంతువులను ఉపయోగించకూడదని చెబుతూ అన్ని రాజకీయ పార్టీలకు 2012లో ఎన్నికల కమిషన్ ఆదేశించీంది. ఇదే సమయంలో... 2013 నోటిఫికేషన్ లో ఎన్నికల ప్రచార సమయంలో గాడిదలు, ఎద్దులు, ఏనుగులూ, గుర్రాలు, ఆవులను ఉపయోగించడాని నిషేదిస్తూ మహారాష్ట్ర ఎన్నికల సంఘం నిషేధించింది!