Begin typing your search above and press return to search.

పేర్ని నాని ఏమైంది మీకు? అలా చేయటం ఏమిటి?

ఈ సందర్భంగా స్వామి వారిని దర్శించుకున్న ఆయనకు.. ఆలయ మర్యాదల్లో భాగంగా ఆలయ ఆర్చకులు ఆయనకు వేదాశీర్వచనం చేశారు.

By:  Tupaki Desk   |   25 Sep 2023 5:32 AM GMT
పేర్ని నాని ఏమైంది మీకు? అలా చేయటం ఏమిటి?
X

మాటలతోనూ.. చేతలతోనూ తరచూ వార్తల్లో నిలిచే ఏపీ అధికారపక్ష నేతల్లో పేర్ని నాని ముందుంటారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డ మీద విపరీతమైన ప్రేమాభిమానాల్ని ప్రదర్శించే ఆయన.. పవన్ కల్యాణ్ ప్రస్తావన వచ్చినంతనే ఆవేశంలోనూ.. ఆగ్రహాంతోనూ.. వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. పవన్ అభిమానుల ఫస్ట్ టార్గెట్ గా పేర్ని నాని నిలుస్తుంటారు. ఈ మధ్యనే హైదరాబాద్ కు వచ్చిన సందర్భంగా జనసైనికులు ఆయన్ను.. ఆయన వాహనాన్ని అడ్డకోవటం.. దీనికి సంబంధించిన ఫోటోలు.. వీడియోలువైరల్ గా మారాయి.

ఇదిలా ఉంటే.. ఆదివారం ఆయన ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలోని చిన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ కు సతీ సమేతంగా వచ్చారు. ఈ సందర్భంగా స్వామి వారిని దర్శించుకున్న ఆయనకు.. ఆలయ మర్యాదల్లో భాగంగా ఆలయ ఆర్చకులు ఆయనకు వేదాశీర్వచనం చేశారు.

ఈ సందర్భంగా ఆయనకు స్వామివారి శేష వస్త్రాన్ని పేర్ని నానికి కప్పే ప్రయత్నం చేశారు ఆలయ ఆర్చకులు.ఈ సందర్భంగా ఆర్చకులు తనకు శాలువా వేయటాన్ని పేర్ని నాని అడ్డుకొని.. శాలువాను తన చేతులతో తీసుకొని.. తానే భుజానికి వేసుకున్న వైనంపై ఆర్చకులు ఆశ్చర్యపోతున్న పరిస్థితి.

ఇక.. పేర్ని నాని వచ్చారన్న విషయాన్ని తెలుసుకున్న స్థానిక వైసీపీ నేతలు పలువురు.. ఆయన్ను చూసేందుకు గుడి వద్దకు వచ్చారు. వారు ప్రదర్శించే అభిమానాన్ని సైతం పేర్ని నాని తప్పుగా అర్థం చేసుకున్నారు.

ప్రశాంతంగా గుడికి వస్తే.. విహార యాత్రకు.. పెళ్లికి వచ్చినట్లుగా ఇంత మంది ఎందుకు వచ్చారంటూ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ అభిమానులు.. పలువురు విస్మయానికి గురయ్యారు.ఇదంతా ఒక ఎత్తు అయితే.. గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావుకు ఫోన్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన పేర్ని నాని నోటి వెంట మరో ఆసక్తికరవ్యాఖ్య వచ్చింది. ప్రస్తుతం తాను ఎమ్మెల్యే హోదాలో పుట్టిన రోజు విషెస్ చెబుతున్నాని.. వచ్చే బర్త్ డే టైంకు మాత్రం తాను మాజీ ఎమ్మెల్యే హోదాలో విషెస్ చెబుతానని చెప్పటం విశేషం. ఈసారి ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా పోటీ చేయనని స్పష్టం చేయటం చర్చగా మారింది. ఇప్పటికే తాను ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన లేదని చెబుతున్న పేర్ని.. మరో విషయాన్నిఅదే మాటను ప్రస్తావించటం గమనార్హం.