ఫ్లాపు సినిమాకు ఇంత హడావిడి అవసరమా?
చిత్ర పరిశ్రమకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇవ్వడంపై వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు.
By: Tupaki Desk | 24 May 2025 8:33 PM ISTచిత్ర పరిశ్రమకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇవ్వడంపై వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. సినిమా వాళ్లను బెదిరించడానికి మీరెవరని, అసలు వాళ్ల సమస్యేంటనేది మీకు తెలుసా అని పవన్ ను ఆయన ప్రశ్నించారు. ప్రజలు తక్కువ ధరకే సినిమాలు చూడాలని గత ప్రభుత్వం కోరుకుందని, కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో సిట్యుయేషన్స్ దానికి పూర్తి భిన్నంగా ఉన్నాయని ఆయన అన్నారు.
జగన్ ప్రభుత్వంలో టికెట్ రేట్లు తగ్గించినప్పుడు పవన్ నోటికొచ్చినట్టు మాట్లాడారని, మా సినిమా మా ఇష్టమొచ్చినట్టు అమ్ముకుంటామని అన్నారని, కానీ ఇప్పుడు మీరేం చేస్తున్నారని ప్రశ్నించారు. పవన్ అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, ప్రతిపక్షంలో ఉంటే మరో మాట మాట్లాడటం సరికాదని పేర్ని నాని పవన్ ను ఉద్దేశించి అన్నారు.
చిత్ర పరిశ్రమను పవన్ కళ్యాణ్ ఉద్దరిస్తారనుకుంటే థియేటర్ యాజమాన్యాలపైనే విచారణకు ఆదేశించారని, తను నటించిన హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అవుతుందనే కారణంతోనే పవన్ ఈ విచారణ జరిపించారని, ఆయన సినిమా కోసం థియేటర్ల యజమానులను ప్రభుత్వం బెదిరిస్తుందని, అయినా ఫ్లాపు సినిమా కోసం ఇంత హడావిడి అవసరమా అని పేర్ని నాని హరిహర వీరమల్లుపై కామెంట్స్ చేశారు.
హరి హర వీరమల్లు విషయానికొస్తే కోవిడ్ కు ముందు మొదలైన ఈ సినిమాకు ముందు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించగా ఆ తర్వాత ఆయన కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. దీంతో వీరమల్లును ఏఎం జ్యోతికృష్ణ పూర్తి చేశారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా, బాబీ డియోల్ విలన్ గా నటించిన ఈ సినిమా వచ్చే నెల 12న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
