Begin typing your search above and press return to search.

జూనియర్ పేర్నికి గట్టిగా బిగుస్తోందా ?

ఇక తన కుమారుడు పేర్ని కిట్టూ అలియాస్ క్రిష్ణమూర్తిని 2024 ఎన్నికల్లో మచిలీపట్నం నుంచి పోటీ చేయించడం ద్వారా నాని పొలిటికల్ ఎంట్రీ ఇప్పించారు.

By:  Tupaki Desk   |   13 Jun 2025 9:32 AM IST
జూనియర్ పేర్నికి గట్టిగా బిగుస్తోందా ?
X

ఉమ్మడి క్రిష్ణా జిల్లాలో పేర్ని కుటుంబానిది దశాబ్దాల రాజకీయ జీవితం. దివంగత పేర్ని క్రిష్ణమూర్తితో మొదలైన రాజకీయాన్ని ఆయన కుమారుడిగా పేర్ని నాని కొనసాగించారు. ఆయది పాతికేళ్లకు పైగా పాలిటిక్స్. ఇక తన కుమారుడు పేర్ని కిట్టూ అలియాస్ క్రిష్ణమూర్తిని 2024 ఎన్నికల్లో మచిలీపట్నం నుంచి పోటీ చేయించడం ద్వారా నాని పొలిటికల్ ఎంట్రీ ఇప్పించారు.

జగన్ కి అత్యంత సన్నిహితుడైన నేత కావడంతో పేర్ని నాని కుమారుడికి గత ఎన్నికల్లో జగన్ టికెట్ ఇచ్చారు. అయితే టీడీపీ కూటమి ప్రభంజనంలో కిట్టూ వికెట్ కొట్టుకుపోయింది. ఎంట్రీతోనే దారుణమైన ఓటమిని ఈ యువ నాయకుడు అందుకున్నాడు. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే పేర్ని నాని మీద ఫోకస్ పెట్టింది.

ఆయన గొడౌన్ లలో రేషన్ బియ్యం పక్కదారి పట్టిందని కేసులు నమోదు చేశారు. ఈ కేసులలో పేర్ని నాని భార్య మీదనే ఫోకస్ చేయడంతో నాని చాలా కార్నర్ అయి చాన్నాళ్ళ పాటు మీడియా ముందుకు సైతం రాలేకపోయారని చెబుతారు. ఇక చూస్తే కనుక ఇపుడు ఆయన రాజకీయ వారసుడు పేర్ని కిట్టు మీద కేసుల చుచ్చు బిగుస్తోందని అంటున్నారు.

ఇపుడు అయితే నకిలీ పట్టాల విషయంలో మరో కేసు తెర మీదకు వస్తోంది. తన కుమారుడిని 2024 ఎన్నికల్లో గెలిపించుకునేందుకు నాని నకిలీ పట్టాలను వేలాదిమందిని ఇచ్చారని టీడీపీ కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. కేవలం రాజకీయ లబ్ది కోసమే నాని ఈ విధంగా వేలాది మందిని మోసం చేశారు అని అంటున్నారు.

ఇపుడు ఈ కేసు విషయంలో గట్టిగానే వ్యవహారం ఉందని అంటున్నారు. ఈ కేసులో పేర్ని నానితో పాటు ఆయన కుమారుడు పేర్ని కిట్టుని కూడా టార్గెట్ చేశారు అని అంటున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ నేతలతో నాని కీలక సమావేశం నిర్వహించి కూటమి వేధింపుల మీద వారితో చెప్పుకున్నారు. తనను తన కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

తాను రాజకీయాల్లో నుంచి తప్పుకుందామని కూడా ఒక దశలో భావించాను అన్నారు. తనలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడని ఆయన అంటున్నారు. అంతే కాదు ఈ రోజు ఎవరెవరు తమను కార్నర్ చేశారో వారందరి లెక్కలూ తీస్తామని తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాటిని తేల్చుతామని ఆయన హెచ్చరిస్తున్నారు. మొత్తానికి చూస్తే చాలా తొందరలోనే నానితో పాటు జూనియర్ పేర్ని కూడా అరెస్టు అవుతారని మచిలీపట్నంలో టాక్ ఆఫ్ ది టౌన్ గా పుకార్లు షికారు చేస్తున్నాయి. మరి ఇవన్నీ ఊహించే నాని కూటమి ప్రభుత్వం మీద తన గొంతు పెంచుతున్నారా అన్నది కూడా చర్చించుకుంటున్నారు.