పేర్ని వారి మరో లడాయి.. గన్నవరం నేతల గుస్సా.. !
పేర్ని నాని.. వైసీపీ కీలక నాయకుడు, ప్రస్తుతం కృష్ణా జిల్లాలో వైసీపీ తరఫున వినిపిస్తున్న ఏకైక గళం కూడా ఆయనే.
By: Tupaki Desk | 7 Jun 2025 7:42 PM ISTపేర్ని నాని.. వైసీపీ కీలక నాయకుడు, ప్రస్తుతం కృష్ణా జిల్లాలో వైసీపీ తరఫున వినిపిస్తున్న ఏకైక గళం కూడా ఆయనే. అయితే.. ఆయన చేస్తున్న రాజకీయాలపై సొంత పార్టీ నాయకుల్లోనే విమర్శలు వస్తున్నా యి. పేర్ని నానిది మచిలీపట్నం నియోజకవర్గం. ఆయన ఏం చేయాలని అనుకున్నప్పటికీ.. ఈ నియోజ కవర్గంలోనే చేయాలి. కానీ.. నాని మాత్రం.. గన్నవరం నియోజకవర్గానికి తన రాజకీయాలను షిఫ్టు చేశారు. దీనిపైనే సొంత పార్టీ నాయకులు ఆయనను కార్నర్ చేస్తున్నారు.
వాస్తవానికి ఒక పార్టీలోనే ఉన్నా.. ఎవరి నియోజకవర్గంలో రాజకీయాలు వారు చేసుకుంటారు. పొరుగు వా రు అడుగు పెట్టినా.. కాదు, వేలు పెట్టినా కూడా రాజకీయ నాయకులు సహించే పరిస్థితిలేదు. ఈ విష యంలోనే పేర్నికి సొంత పార్టీలో సెగ పుడుతోంది. ఇటీవల వెన్నుపోటు దినం పేరుతో ఆయన నిర్వహిం చిన కార్యక్రమాలు.. పార్టీలో వ్యతిరేకతను పెంచాయి. ``మా నియోజకవర్గంలోకి ఆయన వచ్చారు. ఇది ఎలా జరిగింది? ``అంటూ గన్నవరం వైసీపీకి చెందిన కీలక నాయకుడు ఒకరు పార్టీ అధిష్టానాన్ని ప్రశ్నించారు.
ప్రస్తుతం గన్నవరం నియోజకవర్గంలో వైసీపీకి ప్రాతినిధ్యం లేదు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. ప్రస్తుతం జైల్లో ఉన్నారు. దీంతో ఇక్కడ జెండా పట్టేవారు.. కనిపించడం లేదు. ఈ క్రమంలోనే వంశీ సతీమణి డాక్టర్ పంకజ శ్రీని రంగంలోకి దింపాలని అనుకున్నారు. కానీ.. ఈ వ్యూహంపై ఇంకా నిర్ణయం తీసుకోలే దు. ఆమె అయిష్టంగా ఉన్నారని సమాచారం రావడంతో పార్టీ అధినాయకత్వం ఆమెను దూరం పెట్టింది. మరోవైపు.. వెన్నుపోటు దినానికి పేర్ని.. తన నియోజకవర్గం వదిలేసి.. గన్నవరం వచ్చారు.
గన్నవరం ఆర్డీవో కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. వాస్తవానికి మచిలీపట్నంలోనే కృష్ణాజిల్లా కలెక్టర్ ఆఫీసు ఉండగా.. ఇక్కడకు వచ్చి ఆయన నిరసన తెలపడం ఏంటన్నది వైసీపీ నాయకుల ప్రశ్న. ఇది భవిష్యత్తులో వ్యూహం వేసుకుని చేసిన కార్యక్రమంగా కొందరు చెబుతున్నారు. వంశీ లైన్ కాకపోతే.. తానే ఇక్కడ నుంచి రాజకీయాలు చేయాలన్న వ్యూహం పేర్నిలో ఉందన్నది కొందరు అంతర్గతంగా చెబుతున్న మాట. ఈ నేపథ్యంలో అసలు పేర్ని రాకకు కారణమేంటన్నది తేల్చాలని అధిష్టానంపై ఒత్తిడి పెంచుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
