వైసీపీలో మరో మహిళా నాయకురాలుగా ఆమె !
ఇక ఉమ్మడి అనంతపురం జిల్లాలో చూసుకుంటే వైసీపీ మహిళా నాయకురాళ్ళను అనేక మందిని తెర మీదకు తీసుకుని వచ్చింది.
By: Tupaki Desk | 19 April 2025 7:00 AM ISTవైసీపీలో అనేక మంది మహిళా నాయకురాళ్ళు ఉన్నారు. వారంతా కీలక బాధ్యతలు కూడా చూశారు. ఇక రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం 2019 నుంచి 2024 మధ్యలో ఇద్దరు మహిళా నాయకురాళ్ళకు హోం మంత్రి పదవిని కూడా ఇచ్చారు. అంతే కాదు వైసీపీకి చెందిన మహిళా నాయకురాళ్ళకు ఉప ముఖ్యమంత్రి దాకా అవకాశాలను జగన్ ఇచ్చారు. ఫైర్ బ్రాండ్ లేడీస్ కూడా ఆ పార్టీలో ఎక్కువే.
ఇక ఉమ్మడి అనంతపురం జిల్లాలో చూసుకుంటే వైసీపీ మహిళా నాయకురాళ్ళను అనేక మందిని తెర మీదకు తీసుకుని వచ్చింది. అయితే వారిలో కొందరే సక్సెస్ అయ్యారు. ఉషశ్రీ చరణ్ కి మంత్రి పదవి ఇచ్చారు. ఆమె సక్సెస్ ఫుల్ గా చేశారు. ఇపుడు పార్టీ ఓటమి తరువాత జిల్లా అధ్యక్షురాలిగా ఆమె వ్యవహరిస్తున్నారు. హిందూపురంలో బాలయ్యకు పోటీగా దీపిక అనే మహిళకు 2024 ఎన్నికల్లో చాన్స్ ఇస్తే ఆమె ఓటమి పాలు అయ్యారు. అదే హిందూపురం నుంచి శాంత అనే మహిళకు 2024 లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు చాన్స్ ఇచ్చారు. ఆమె కూడా ఓటమి పాలు అయ్యారు.
ఇవన్నీ ఇలా ఉంటే ఇపుడు మరో మహిళా నాయకురాలితో రాజకీయ ప్రయోగం చేయడానికి వైసీపీ చూస్తోంది అన్న వార్తలు ప్రచారం అవుతున్నాయి. పెనుగొండ అన్నది అనంతపురం జిల్లాలో కీలక స్థానం ఇక్కడ నుంచి 2019 ఎన్నికల్లో శంకర్ నారాయణ గెలిచారు. ఆయన జగన్ కేబినెట్ లో మంత్రిగా కూడా పనిచేశారు. అయితే ఆయనకు 2024 ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదు.
ఆ ప్లేస్ లోకి అప్పటి మంత్రి ఉషశ్రీ చరణ్ ని తెచ్చి పోటె చేయించారు. ఆమె కళ్యాణ దుర్గం నుంచి 2919లో పోటీ చేసినా 2024 ఎన్నికల్లో చేసిన షిఫ్టింగులలో ఆమె సీటు చేంజ్ అయింది. ఇక చూస్తే కనుక ఆమె వర్గం తో పాటు శంకర్ నారాయణ వర్గంగా పెనుగొండ వైసీపీ ఉందని అంటున్నారు.
ఇపుడు వైసీపీ అధినాయకత్వం ఈ ఇద్దరూ కాకుండా కొత్త వారికి చాన్స్ ఇవ్వడానికి చూస్తోంది అని అంటున్నారు. ఉషశ్రీ చరణ్ ని తిరిగి కళ్యాణ దుర్గానికి పంపించి అక్కడ నుంచి కొత్త ముఖంగా శిల్ప అనే ఒక మహిళా నాయకురాలిని ఇంచార్జి చేయాలని వైసీపీ హైకమాండ్ ఆలోచిస్తోంది అని అంటున్నారు.
ఇంతకీ ఎవరీ శిల్పా అంటే ఆమె పెనుగొండలో విద్య వైద్య రంగాలలో విశేష సేవా కార్యక్రమాలను చేస్తూ వస్తున్నారు. ఆమె ఇప్పటికే జనాలలో ఉంటూ సామాజిక సేవలో కీలకంగా ఉన్నారు. ప్రత్యేకించి ఆమె కడపవాసి. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఆమెకు వైఎస్సార్ కుటుంబంతో మంచి పరిచయాలు ఉన్నాయట. దాంతో ఆమెకు జనంలో ఉన్న పేరుని దృష్టిలో ఉంచుకుని పెనుగొండ కొత్త ఇంచార్జి గా ప్రకటిస్తారు అని అంటున్నారు. ఆమె కూడా సేవా కార్యక్రమాల నుంచి రాజకీయాల్లోకి రావాలని చూస్తున్నారు అని అంటున్నారు.
మరో వైపు చూస్తే ఇప్పటిదాకా వైసీపీ తరఫున ఉమ్మడి అనంతపురం జిల్లాలో రాణించిన మహిళా నాయకురాళ్ళలో ఉషశ్రీ చరణ్ మాత్రమే కనిపిస్తారు. ఇపుడు శిల్ప ఏ విధంగా రాజకీయాల్లో రాణిస్తారు అన్నది చర్చ. పెనుగొండలో టీడీపీకి కూడా బలం ఉంది. వైసీపీలో వర్గ పోరు ఉంది. పైగా సీనియర్ అయిన శంకర్ నారాయణను పక్కన పెడితే ఆయన ఊరుకుంటారా అన్న చర్చ కూడా ఉంది. చూడాలి మరి ఈ ప్రయోగం ఏమవుతుందో. వైసీపీలో కొత్త మహిళా నాయకురాలు ఎంట్రీకి పెనుగొండ వేదిక అవుతుందా లేదా అన్నది కూడా చూడాల్సి ఉంది.
