Begin typing your search above and press return to search.

ఉక్రెయిన్‌ తో శాంతి చర్చలు... పుతిన్ కీలక వ్యాఖ్యలు!

ఈ సమయంలో సుమారు 600 పైచిలుకు రోజుల నుంచి జరుగుతున్న రష్యా – ఉక్రెయిన్ ల మధ్య సంది వ్యవహారం కూడా తెరపైకి వచ్చింది

By:  Tupaki Desk   |   23 Nov 2023 8:23 AM GMT
ఉక్రెయిన్‌  తో శాంతి చర్చలు... పుతిన్  కీలక వ్యాఖ్యలు!
X

ప్రస్తుతం ఇజ్రాయేల్ – హమాస్ ఉగ్రవాదుల మధ్య సుమారు 50 రోజులుగా నడుస్తున్న యుద్ధంలో చిన్న గ్యాప్ వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం 4 రోజులు, 50 మంది బందీలు, 150 మంది ఖైదీలు వంటి కండిషన్స్ తో వారి మధ్య ఒప్పందం ఓ కొలిక్కి వచ్చింది. ఈ సమయంలో సుమారు 600 పైచిలుకు రోజుల నుంచి జరుగుతున్న రష్యా – ఉక్రెయిన్ ల మధ్య సంది వ్యవహారం కూడా తెరపైకి వచ్చింది. ఈ సందర్భంగా పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

అవును... ఇజ్రాయేల్ – హమాస్ మధ్య జరుగుతున్న భీకర పోరుకు కాస్త గ్యాప్ వచ్చిన నేపథ్యంలో... గతేడాది నుంచి జరుగుతున్న రష్యా – ఉక్రెయిన్ వార్ సంగతేమిటి.. ఇలా జరగాల్సిందేనా అనే చర్చ తెరపైకి వచ్చింది. పైగా భారత్ అధ్యక్షతన జరుగుతున్న జీ-20 దేశాధినేతల వర్చువల్ సదస్సులో ఈ ప్రస్థావన వస్తుందని అంతా భావించారు. అనుకున్నట్లుగానే ఈ విషయాలపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ స్పందించారు.

ఇందులో భాగంగా... ఉక్రెయిన్‌ తో శాంతి చర్చలకు తాము సిద్ధంగానే ఉన్నామని.. యుద్ధం పరిష్కారం కోసం చర్చలను తామెప్పుడూ వ్యతిరేకించలేదని వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. ఇదే సమయంలో సైనిక చర్య ఎప్పటికీ విషాదకరమే అయినప్పటికీ.. దాన్ని ఎలా ఆపాలన్న విషయంపై కచ్చితంగా ఆలోచనలు చేయాలని.. ఉక్రెయిన్‌ తో శాంతి చర్చలను రష్యా ఎప్పుడూ తిరస్కరించలేదని పుతిన్ అన్నారు.

తాజాగా భారత్‌ అధ్యక్షతన జరిగిన జీ20 దేశాధినేతల వర్చువల్ సదస్సులో పుతిన్‌ దాదాపు 17 నిమిషాలు ప్రసంగించారు. అయితే, పుతిన్‌ మాట్లాడే సమయంలో చైనా, అమెరికా ప్రతినిధులు వర్చువల్ సమావేశంలో లేనట్లు తెలుస్తోంది.

కాగా... భారతదేశ ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన బుధవారం సాయంత్రం జీ-20 దేశానిధినేతల వర్చువల్ సదస్సు జరిగింది. దీనిలో పలువురు జీ20 దేశాధినేతలు పాల్గొన్నారు. అయితే... ఈ సదస్సులో చైనా అధ్యక్షుడు షీ జిన్‌ పింగ్‌ మాత్రం పాల్గొన లేదు. ఆయన స్థానంలో ఆ దేశ ప్రధాని లి కియాంగ్‌ హాజరయ్యారు. ఈ సదస్స్లో ప్రధానంగా ఇజ్రాయెల్‌ -హమాస్‌ పోరుతో పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులపై దేశాధినేతలు చర్చించారని తెలుస్తుంది.

ఇక ఈ భేటీలో ప్రసంగించిన ప్రధాని ప్రధానంగా ఇజ్రాయేల్ – హమాస్ యుద్ధంపై స్పందించారు. ఇందులో భాగంగా... పశ్చిమాసియాలో నెలకొన్ని అనిశ్చితి ఆందోళనకరమని.. ఉగ్రవాదాన్ని ఎవరూ సహించకూడదని తెలిపారు. ఇదే సమయంలో ఇలాంటి ఘర్షణల్లో ఏ దేశం ప్రజలు ప్రాణాలు కోల్పోయినా ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అంశం అని తెలిపారు.