Begin typing your search above and press return to search.

సీపీఎసి రద్దు అంటున్న పవన్..బాబు మాటేంటి....!?

ఉమ్మడి మ్యానిఫేస్టోలో సీపీఎస్ రద్దుని పరిశీలిస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ యువగళం చెప్పారు.

By:  Tupaki Desk   |   21 Dec 2023 3:32 AM GMT
సీపీఎసి రద్దు అంటున్న పవన్..బాబు మాటేంటి....!?
X

ఉమ్మడి మ్యానిఫేస్టోలో సీపీఎస్ రద్దుని పరిశీలిస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ యువగళం చెప్పారు. ఈ సభలో తన మదిలో ఉన్న అనేక విషయాలను హామీలను జనసేన అధినేత వల్లించేసారు. అందులో ఒకటిగా సీపీఎస్ రద్దు ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్ రద్దు విషయం పరిశీలిస్తామని పవన్ అంటున్నారు.

తమ ఉమ్మడి మ్యానిఫేస్టోలోని అంశాలలో ఇది కూడా ఉంటుందని అంటున్నారు. నిజంగా పవన్ వారాహి సభలతో పాటు ఇప్పటం సభలో కూడా సీపీఎస్ రద్దు విషయం గురించి గట్టిగానే చెప్పారు. అది ఆయన సొంత పార్టీ ఎన్నికల ప్రణాళిక. మరి టీడీపీ విషయం అలా కాదు. ఆ పార్టీ 2014 ఎన్నికల్లో సీపీఎస్ రద్దు ఊసే ఎత్తలేదు.

టీడీపీకి దాని అధినేత చంద్రబాబుకూ తెలుసు. సీపీఎస్ రద్దు ఎంతటి గుదిబండనో. ఆర్ధికంగా అది ఎంతలా కృంగదీస్తుందో. ఒక ప్రభుత్వ ఉద్యోగి ఓల్డ్ పెన్షన్ స్కీం ప్రకారం రిటైర్ అయితే లాస్ట్ జీతంలో సగానికి సగం పెన్షన్ కింద ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతీ ఏడాది వేలల్లో రిటైర్మెంట్ ఉంటాయి.అలా చాలా మందికి పెన్షన్లు ఇవ్వడం అంటే ఖజానా పూర్తిగా కొల్లగొట్టడమే అవుతుంది.

పైగా గతంలో వేరు. ఇపుడు జీవన ప్రమాణం పెరిగింది. మనిషి సగటు వయసు డెబ్బై నుంచి ఎనభై ఏళ్ళుగా ఉంది. దాంతో పాటు పదవీ విరమణ వయసు పెంచేశారు. అది అరవై రెండుకు చేశారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి రిటైర్ అయ్యేటప్పటికి కచ్చితంగా సగటు ఉద్యోగి చివరి వేతనం రెండున్నర లక్షల పై మాటగా ఉంటోంది. ఉన్నత స్థాయి ఉద్యోగి అయితే ఇంకా ఎక్కువే. మరి దానిలో సగం పెన్షన్ అంటే ఏ ప్రభుత్వం కూడా భరించలేదు.

అందులో ఏపీ లాంటి విభజన కష్టాలతో కునారిల్లుతున్న ప్రభుత్వం అయితే అసలు భరించలేదు. మరి ఇవన్నీ తెలిసి కూడా సీపీఎస్ రద్దు విషయం పరిశీలిస్తున్నామని పవన్ ఏకంగా సభా వేదిక మీదనే చెప్పేశారు. రేపటి రోజున ఏ అమరావతి వేదిక మీదనో ఉమ్మడి మ్యానిఫేస్టోని రిలీజ్ చేసినపుడు సీపీఎస్ రద్దు అన్నది కనుక అజెండాలో లేకపోతే ఉద్యోగులు గుస్సా అవడం ఖాయం.

మరి జనసేనాని ఇచ్చిన ఈ హామీ విషయంలో టీడీపీ ఎలా రియాక్ట్ అవుతుంది, చంద్రబాబు ఎలా దీన్ని తీసుకుంటారు అన్నది చూడాలి. నిజంగా ఈ హామీ ఇస్తే మాత్రం కూటమికి ప్రభుత్వ ఉద్యోగుల ఓట్లు గుత్తమొత్తంగా పడడం ఖాయం. కానీ ఇది గుదిబండ లాంటి హామీ పాలనకు వచ్చిన తొలి సంవత్సరం నుంచే వత్తిడి వచ్చే భారీ హామీ ఇది. అంతే కాదు తెల్ల ఏనుగు లాంటి హామీ. సో చంద్రబాబు దీని మీద ఏమి చేస్తారు అన్నదే ఇపుడు ప్రభుత్వ ఉద్యోగ వర్గాలలో మెదులుతున్న ఆలోచనగా చూడాలి.