Begin typing your search above and press return to search.

వైసీపీ నుంచి భారీ వలసలు అంటున్న పవన్...!

బుధవారం ఆయన సమక్షంలో మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ ఎమ్మెల్సీ వంశీ క్రిష్ణ శ్రీనివాస్ జనసేన తీర్ధం పుచ్చుకున్నారు.

By:  Tupaki Desk   |   27 Dec 2023 3:02 PM GMT
వైసీపీ నుంచి భారీ వలసలు  అంటున్న పవన్...!
X

వైసీపీలోకి వెళ్ళిన వారు అంతా జనసేనలోకి తిరిగి వస్తున్నారు అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన సమక్షంలో మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ ఎమ్మెల్సీ వంశీ క్రిష్ణ శ్రీనివాస్ జనసేన తీర్ధం పుచ్చుకున్నారు.

ఈ సందర్భంగా పవన్ చేసిన కామెంట్స్ ఆసక్తిని రేపుతున్నాయి. జనసేనకు వైసీపీ నుంచి పెద్ద ఎత్తున వలసలు మొదలయ్యాయని అంటున్నారు. ఇంకా చాలా మంది వస్తారని అంటున్నారు. అది కూడా ఉత్తరాంధ్రా నుంచే మొదలైందని ఆయన చెబుతున్నారు.

ఉతరాంధ్రా అభివృద్ధి చెందుతుందని గతంలో చాలా మంది నేతలు పార్టీలు మారి వెళ్ళారని ఆయన గుర్తు చేశారు. అయితే అనుకున్న అభివృద్ధి వైసీపీ ప్రభుత్వ పాలనలో జరగలేదని అన్నారు. దాంతో పరిస్థితిని అర్ధం చేసుకుని మళ్లీ జనసేనలోకే వస్తున్నారు అని ఆయన అంటున్నారు.

ఏపీ భవిష్యత్తు కోసం జనసేన పనిచేస్తుదని పవన్ ఉద్ఘ్గాటించారు. అదే సమయంలో వైసీపీ నుంచి పెద్ద ఎత్తున నేతలు వస్తారని పవన్ అనడం కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే ప్రచారంలో దాని ప్రకారం చూస్తే ఉత్తరాంధ్రా, ఉభయ గోదావరి జిల్లాల నుంచి జనసేనలోకి వలసలు ఉండవచ్చు అని అంటున్నారు

టీడీపీతో జనసేన పొత్తు ఉండడంతో పాటు వైసీపీలో సీట్ల కోసం ఆశలు పెట్టుకున్న వారు అక్కడ నిరాశ ఎదురైతే టీడీపీలోకి వెళ్లకుండా జనసేనలోకి వస్తున్నారు ఇదంతా వ్యూహాత్మకమా అంటున్నారు. ఎందుకంటే టీడీపీలో అయితే చాలా మంది నేతలు ఉన్నారు టికెట్ల కోసం గట్టి పోరు ఉంది.

అదే జనసేనలో పొత్తులలో సీట్లు ఎక్కడ దక్కుతాయో చూసుకుని మరీ జంప్ చేస్తున్నారు అని అంటున్నారు. ఇక జనసేన కూడా వైసీపీలోని అసంతృప్తుల మీద ఒక కన్నేసి ఉంచింది అంటున్నారు. గతంలో ప్రజారాజ్యంలో పనిచేసి అనేక కారణాల వల్ల ఆ పార్టీని వీడిన వారు జనసేనలోకి వచ్చేలా చూస్తున్నారు.

పార్టీని ఎక్కడికక్కడ బలోపేతం చేసుకుని గట్టి క్యాండిడేట్లను పోటీకి దించితే ఎక్కువ సీట్లలో గెలవగలమని జనసేన భావిస్తోంది. అందుకే పార్టీ మారే ఆలోచన మొదట్లో పెద్దగా లేని వంశీని వ్యూహాత్మకంగా జనసేన వైపు తిప్పుకున్నారు అని అంటున్నారు. ఆయనకు సీటు హామీ కూడా ఇచ్చారని అంటున్నారు.

మరో వైపు చూస్తే సీటు హామీ ఉంటేనే వలసలు అని కూడా తెలుస్తోంది. మరి జనసేనకు ఎన్ని సీట్లు టీడీపీ పొత్తులో ఇస్తుంది అన్న దానిని బట్టే ఈ వలసలు వైసీపీ నుంచి ఉంటాయని అంటున్నారు.