Begin typing your search above and press return to search.

పవ‌న్ నోట ఫ‌స్ట్ టైమ్ సామాన్యుల మాట‌.. ఇది క‌దా కావాల్సింది!!

తాజాగా విశాఖ ప‌ట్నం జిల్లాలోని అన‌కాప‌ల్లి పార్ల‌మెంటు స్థానంలో ప్రచారం చేసిన ప‌వ‌న్‌.. తొలిసారి సామాన్యుల క‌ష్టాల‌పై స్పందించారు.

By:  Tupaki Desk   |   8 April 2024 4:30 PM GMT
పవ‌న్ నోట ఫ‌స్ట్ టైమ్ సామాన్యుల మాట‌.. ఇది క‌దా కావాల్సింది!!
X

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఫ‌స్ట్ టైమ్ సామాన్యుల‌కు క‌నెక్ట్ అయ్యేలా ప్ర‌సంగించారు. ఉమ్మ‌డి విశాఖప‌ట్నం జిల్లాలోని అన‌కాప‌ల్లిలో నిర్వ‌హించి వారాహి విజ‌య‌భేరి స‌భ‌లో 55 నిమిషాల పాటు ప్ర‌సంగిం చిన ప‌వ‌న్‌.. తొలిసారి.. సామాన్యులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావించారు. గ‌డిచిన నాలుగేళ్లుగా ఆయ‌న త‌ర‌చుగా.. స‌భ‌లు స‌మావేశాలు పెడుతున్నా.. ఎప్పుడూ కూడా.. ఆయ‌న సామాన్యుల స‌మ‌స్య‌ల ను ప్ర‌స్తావించ‌లేద‌నే టాక్ ఉంది.

ఎంత సేపూ.. వైసీపీని గ‌ద్దె దింపాల‌ని.. రాష్ట్రంలో అరాచ‌క పాల‌న సాగుతోంద‌ని.. దోచుకుంటున్నార‌ని.. ఇలా.. త‌న‌దైన మాన‌రిజంతో ప‌వ‌న్ ప్ర‌సంగాలు చేశారు. అదేస‌మ‌యంలో తాను 2000 పైగా పుస్త‌కాలు చ‌దివాన‌ని... త‌న‌కు రోజుకు రెండు కోట్లు వ‌స్తాయ‌ని.. సినిమాల్లో సంపాయించుకునే స్కోప్ ఉన్నా.. ప్ర‌జ‌ల కోసం రాజ‌కీయాల్లోకి వచ్చాన‌ని.. ప‌దేళ్లుగా అనేక ఇబ్బందులు ప‌డుతున్నా.. పార్టీని కొన‌సాగిస్తున్నాన‌ని ప‌వ‌న్ చెబుతూ వ‌చ్చాయి. ఇవి పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు, నాయ‌కుల‌కు క‌నెక్ట్ అయ్యాయే త‌ప్ప‌.. సామాన్య ప్ర‌జ‌ల‌కు మాత్రం కనెక్ట్ కాలేదు.

అందుకే.. గ్రామీణ ప్రాంతాల్లోనూ ప‌ట్ట‌ణ ప్రాంతాల్లోనూ జ‌న‌సేన గ్రాఫ్ పెరగ‌లేదు. ప‌వ‌న్ అంటే అభిమానిం చేవారు.. ప‌వ‌న్ సినిమాలు చూసి జేజేలు కొట్టేవారు కూడా.. జ‌న‌సేన‌కు క‌నెక్ట్‌కాలేక పోయారు. ఆయ‌న అభిమానులు త‌ప్ప‌! మ‌రి ఈ నేప‌థ్యంలో ఏమ‌నుకున్నారో .. ఏమో.. తాజాగా విశాఖప‌ట్నం జిల్లాలోని అన‌కాప‌ల్లి పార్ల‌మెంటు స్థానంలో ప్రచారం చేసిన ప‌వ‌న్‌.. తొలిసారి సామాన్యుల క‌ష్టాల‌పై స్పందించారు. కీల‌క‌మైన చెత్త‌ప‌న్ను, ఉద్యోగులు నిరీక్షిస్తున్న సీపీఎస్ ర‌ద్దు, మ‌హిళ‌లకు కీల‌కంగా మారిన అమ్మ ఒడి ప‌థ‌కం, అన‌కాప‌ల్లి బెల్లం రైతుల స‌మ‌స్య‌లు, ఉత్త‌రాంధ్ర సుజ‌ల శ్ర‌వంతి వంటి కీల‌క అంశాల‌ను ప్ర‌స్తావించారు.

చెత్త‌ప‌న్ను ర‌ద్దు చేస్తామ‌ని చెప్పారు. ఇక‌, సీపీఎస్‌పై ఏడాదిలోనే ప‌రిష్కారం చూపిస్తామ‌న్నారు. అమ్మ ఒడిని జ‌గ‌న్ ఒక ఏడాది ఎగ్గొట్టార‌ని చెప్ప‌డం ద్వారా.. మ‌హిళ‌ల‌ను ఆలోచింప జేశారు. ఇలా.. మొత్తంగా సామాన్యుల స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావించడం ద్వారా జ‌న‌సేన‌ను సామాన్యుల‌కు చేరువ చేయ‌డంలో తొలి అడుగు ప‌డింద‌నే చ‌ర్చ సాగుతోంది.