Begin typing your search above and press return to search.

వదిన సురేఖ నుంచి రెండు కోట్లు... పవన్ పర్సనల్ లోన్స్ ఇవే!

ఏపీలో ఎన్నికల సందడి పీక్స్ కి చేరుతున్న నేపథ్యంలో కీలక విషయాలు తెరపైకి వస్తున్నాయి

By:  Tupaki Desk   |   23 April 2024 11:57 AM GMT
వదిన సురేఖ నుంచి రెండు కోట్లు... పవన్ పర్సనల్ లోన్స్ ఇవే!
X

ఏపీలో ఎన్నికల సందడి పీక్స్ కి చేరుతున్న నేపథ్యంలో కీలక విషయాలు తెరపైకి వస్తున్నాయి. ఇందులో భాగంగా ఈ రోజు జనసేన అధినేత పవన్ కల్యాణ్... పిఠాపురం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన వెల్లడించిన ఆదాయం, పన్నులు, విరాళాలతో పాటు వెలుగులోకి వచ్చిన అప్పులు ఆసక్తిగా మారాయి. ఈ సమయంలో ఆయన పర్సనల్ లోన్స్ వెలుగులోకి వచ్చాయి!

అవును... తాజాగా మంగళవారం నామినేషన్ దాఖలు చేసిన పవన్ కల్యాణ్, ఈ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్ లో తన ఆర్థిక విషయాలను వెల్లడించారు. ఇందులో భాగంగా... ఈ ఐదేళ్లలో ఆయన సంపాదన రూ.114.76 కోట్లు కాగా.. అందులో ఐటీ కింద రూ.47.07 కోట్లు, జీఎస్టీ కింద రూ.26.84 కోట్లు చెల్లించినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయనకు రూ.64.26 కోట్ల అప్పులు ఉన్నట్లు వెల్లడించిన పవన్... అందులో రూ.17.56 కోట్లు బ్యాంకుల నుంచి, రూ.46.70 కోట్లు వ్యక్తుల నుంచి తీసుకున్నట్లు తెలిపారు! దీంతో... ఆయన పర్సనల్ లోన్స్ ఎవరెవరి వద్ద నుంచి ఎంతెంత తీసుకున్నారు అనే విషయాలు ఆసక్తిగా మారాయి. ఈ జాబితాలో ఆయన పెద్ద వదిన, మెగాస్టార్ చిరంజీవి భార్య కొణిదెల సురేఖ నుంచి కూడా పవన్ అప్పు తీసుకున్నారు!

పవన్ వ్యక్తుల నుంచి తీసుకున్న అప్పుల వివరాలు ఇలా ఉన్నాయి!:

విజయలక్ష్మీ వీ ఆర్ - రూ. 8 కోట్లు

హారికా & హాసిని క్రియేషన్స్ - రూ. 6.35 కోట్లు

లీడ్ ఐటీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ - రూ. 6 కోట్లు

యర్నేని నవీన్ - రూ. 5.5 కోట్లు

ఎం.వి.ఆర్.ఎస్. ప్రసాద్ - రూ. 3.5 కోట్లు

ఎం. ప్రవీణ్ కుమార్ - రూ. 3 కోట్లు

మైత్రీ మూవీ మేకర్స్ - రూ. 3 కోట్లు

శ్రీ యశ్వంత్ ఫైనాన్సర్స్ - రూ. 3 కోట్లు

రాహుల్ కుందవరం - రూ. 2.8 కోట్లు

ఎం.వీ.ఆర్.ఎస్. ప్రసాద్ (హెచ్.యూ.ఎఫ్.) - రూ. 2 కోట్లు

కొణిదెల సురేఖ - రూ. 2 కోట్లు

కోటింరెడ్డి సాహిత్య రెడ్డి - రూ. 50 లక్షలు

లింగారెడ్డి లలిత - రూ. 50 లక్షలు

ఎ దయాకర్ - రూ. 45 లక్షలు

డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ - రూ. 10 లక్షలు