Begin typing your search above and press return to search.

మరీ ఇంత గ్యాప్ అయితే ఎలా సేనానీ...?

అయితే పవన్ కరెక్ట్ టైం లో ఇలా షూటింగులు పెట్టుకోవడం మీద చర్చ సాగుతోంది. ఎన్నికలు ఎంతో దూరంలో లేవు.

By:  Tupaki Desk   |   9 Sep 2023 2:45 AM GMT
మరీ ఇంత గ్యాప్ అయితే ఎలా సేనానీ...?
X

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇపుడు నిండా మునిగారు అని అంటున్నారు. అదే ఆయన సినిమా షూటింగులతోనే కాలం అంతా గడచిపోతోంది. అల సెట్స్ షూటింగ్స్ తో ఆయన పూర్తి పనులతో క్షణం ఖాళీ లేకుండా మునిగారు అని అంటున్నారు. అయితే పవన్ కరెక్ట్ టైం లో ఇలా షూటింగులు పెట్టుకోవడం మీద చర్చ సాగుతోంది. ఎన్నికలు ఎంతో దూరంలో లేవు. ముందస్తు ఎన్నికలు అని కనుక అనుకుంటే కేవలం మూడు నాలుగు నెలలు మాత్రం టైం ఉంటుంది.

పవన్ ఇప్పటికి అయితే మూడు జిల్లాలలో మాత్రమే వారాహి యాత్ర చేశారు. ఇంకా ఉమ్మడి జిల్లాలు పది దాకా ఉన్నాయి. మరి పవన్ ఎన్నికల టైం దాకా వేచి ఉండి అపుడు జనాల్లోకి వచ్చినా ఫలితం ఉంటుందా అన్న చర్చ కూడా సాగుతోంది. మరో వైపు చూస్తే ఉభయ గోదావరి జిల్లాలలో పవన్ చేసిన వారాహి యాత్ర అయితే సంచలనం రేపింది. నేను వస్తున్నా మాదే అధికారం అంటూ పవన్ గట్టిగా గర్జించసరికి అటు అధికార వైసీపీ ఇటు విపక్ష టీడీపీ సైతం ఉలిక్కిపడే పరిస్థితి ఏర్పడింది.

అయితే ఆ టెంపోని పవన్ కంటిన్యూ చేయడంలో మాత్రం విఫలం అయ్యారని అంటున్నారు. విశాఖలో మాత్రం పవన్ అంత దూకుడు చేయలేదని కూడా వార్తలు వచ్చాయి. ఇక ఆగస్ట్ 18తో పవన్ విశాఖ వారాహి యాత్ర ముగిసింది. వెంటనే మరో జిల్లా నుంచి యాత్ర స్టార్ట్ చేస్తారని ఆ వేడిని అలా ఉంచుతారని అనుకున్నారు. కానీ పవన్ సినిమా షూటింగులతో బిజీ అయ్యారని ప్రచారం కావడంతో జనసైనికులు డీలా పడుతున్నారు.

జనసేనలో అయితే ఆశావహులు అయితే చాలా మంది కనిపిస్తున్నారు. ప్రతీ నియోజకవర్గంలోనూ పవన్ కి జెండాలు కట్టి రేపటి ఎన్నికల్లో పోటీకి రెడీ అయిన జాబితా పెద్దదిగానే ఉంది. ఇటీవల పవన్ పుట్టిన రోజు వేడుకలు జరిగితే ప్రతీ చోటా నాయకులు ముందుకు వచ్చి హడావుడి చేశారు. వారంతా రేపటి ఎన్నికల్లో పోటీకే అంటున్నారు.

ఇలా వారి ఉత్సాహం ఉంటే ఎవరికి టికెట్ వస్తుందో తెలియదు అని అంటున్నారు. అదే టైంలో అధికార పార్టీ నుంచి కూడా టికెట్ దక్కని వారు జనసేనలో చేరాలని చూస్తున్నారు. వారి సంగతి కూడా ఇపుడు అయోమయంగా ఉంది అని అంటున్నారు. తీరా వస్తే తమకు టికెట్ దక్కకపోతే ఏంటి లాభం అని వెనకడుగు వేస్తున్న వారూ ఉన్నారు అంటున్నారు.

ఉమ్మడి విశాఖ జిల్లాలో కొందరు మాజీ ఎమ్మెల్యేలు కూడా జనసేన వైపు చూస్తున్నారు అని టాక్ నడుస్తోంది. అయితే వారు ఊరకే వచ్చి చేరరు అంటున్నారు. తమకు సీటు గ్యారంటీ అంటేనే వస్తారని చెబుతున్నారు. వారు కాకుండా మొదటి నుంచి జనసేన కోసం కష్టపడున్న నాయకులు చాలా మంది ఉన్నారు. వారు జనసేన సోలోగా పోటీకి దిగినా లేక పొత్తులతో దిగినా తమకు బెర్త్ కన్ ఫర్మ్ చేయాలని కోరుకుంటున్నారు.

అన్నింటికీ మించి ఇపుడు చూస్తే ఏపీలో మెల్లగా ఎన్నికల మూడ్ వచ్చేస్తోంది. జమిలి అంటూ కేంద్రం సంకేతాలు పంపుతోంది. ఈ నేపధ్యంలో పవన్ జనంలో ఉంటే పార్టీకి అది ఎంతో మైలేజ్ ని ఇస్తుందని అంటున్నారు.

కానీ ఇపుడు పవన్ కమిట్ అయిన సినిమాలు షూటింగులు అన్నీ పూర్తి చేసుకుని బయటపడేసరికి మరో రెండు మూడు నెలలు పడుతుంది అని అంటున్నారు. అంత గ్యాప్ ఒక రాజకీయ పార్టీకి మంచిదేనా అన్న చర్చ అయితే నడుస్తోంది. మరి పవన్ ఆయన పార్టీ పెద్దలు దీని మీద ఎలా ఆలోచిస్తున్నారో అని కూడా అంటున్నారు.