Begin typing your search above and press return to search.

కాకినాడ ఇంటివాడు కాబోతున్న పవన్...!?

వచ్చే ఎన్నికల్లో పవన్ కాకినాడ సిటీ నుంచి పోటీ చేస్తారు అని ప్రచారం అయితే పెద్ద ఎత్తున సాగుతోంది. పవన్ కళ్యాణ్ కాకినాడ నుంచి పోటీ చేయడానికి చాలా రీజన్స్ ఉన్నాయని అంటున్నారు.

By:  Tupaki Desk   |   4 Jan 2024 5:30 PM GMT
కాకినాడ ఇంటివాడు కాబోతున్న పవన్...!?
X

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ ఇంటివాడు కాబోతున్నారా అంటే జరుగుతున్న ప్రచారం బట్టి చూస్తే అదే నిజం అంటున్నారు. పవన్ కళ్యాణ్ కి కాకినాడ మీద ఇటీవల కాలంలో మోజు బాగా పెరిగింది అని అంటున్నారు. కాకినాడ ఒక స్మార్ట్ సిటీ. ఎక్కడ ఏది ఎలా ఉండాలో అలా పేర్చినట్లుగా తీర్చినట్లుగా ఉంటుంది. హ్యాపీ డెస్టినీ గా పేరు గాంచిన కాకినాడ మీద పవన్ కి మనసు అయింది అని అంటున్నారు.

పవన్ కళ్యాణ్ ఇటీవల మూడు రోజుల పాటు కాకినాడలో బస చేసి మరీ వరస పెట్టి సమీక్షలు సమావేశాలు నిర్వహించారు. మళ్లీ మరో మూడు రోజులు అదే కాకినాడలో పవన్ పార్టీ ఇంటర్నల్ మీటింగ్స్ పెట్టబోతున్నారు. మొత్తానికి చూస్తే గత పదిహేను రోజుల వ్యవధిలో పవన్ ఎక్కువగా గడిపింది కాకినాడలోనే అని అంటున్నారు.

ఇదిలా ఉంటే పవన్ గత ఎన్నికల్లో గాజువాక భీమవరం లలో పోటీ చేసారు ఒక చోట పదహారు వేల తేడాతో మరో చోట ఎనిమిది వేల తేడాతో ఆయన ఓటమి పాలు అయ్యారు. ఈసారి పవన్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారు అన్నది పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. అయితే దానికి జవాబు కూడా పవన్ తన యాక్షన్ ద్వారా చెప్పకనే చెప్పేస్తున్నారు అని అంటున్నారు.

వచ్చే ఎన్నికల్లో పవన్ కాకినాడ సిటీ నుంచి పోటీ చేస్తారు అని ప్రచారం అయితే పెద్ద ఎత్తున సాగుతోంది. పవన్ కళ్యాణ్ కాకినాడ నుంచి పోటీ చేయడానికి చాలా రీజన్స్ ఉన్నాయని అంటున్నారు. అందులో మొదటిది అక్కడ బలమైన సామాజిక వర్గం అండదండలు తనకు దక్కుతాయని ఒక లెక్క ఉంది. అంతే కాదు వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద ఆయన వారాహీ యాత్ర వేళ భీషణ ప్రతిన చేసారు. ఆయన్ని ఎలాగైన ఓడించి ఇంటికి పంపిస్తామని అన్నారు.

దానికి ప్రతిగా ద్వారంపూడి కూడా నా మీద ఎవరో పోటీ ఎందుకు పవన్ వస్తే చూసుకుందామని సవాల్ చేశారు. ఇపుడు ఆ సవాల్ కి సరైన జవాబు ఇవ్వాలని పవన్ అనుకుంటున్నారు అని అంటున్నారు. మరో వైపు చూస్తే కాకినాడలో కనుక పోటీ చేస్తే చుట్టు పక్కన కూడా తన ప్రభావం బాగా పడి జనసేన అభ్యర్ధులు కచ్చితంగా గెలుస్తారు అని పవన్ భావిస్తున్నారుట.

దాంతోనే ఆయన కొత్త సీటుగా ఫ్రెష్ గా ఉంటుందని కాకినాడను ఎంచుకుంటున్నారు అని అంటున్నారు. ఈ కారణాల చేతనే ఆయన ఎన్నికలు అయ్యేంతవరకూ కాకినాడ లో ఒక ఇల్లు చూసి పెట్టమని తన పార్టీ నేతలను కోరారని అంటున్నారు. మరి పవన్ ఒక ఇంటివాడు అవుతున్నారు అది కూడా కాకినాడలో అంటే రాజకీయ సమీకరణలు ఎలా ఉంటాయో చూడాలని అంటున్నారు.

ఇక పవన్ తన మీద పోటీ చేస్తాను అంటే సై అంటున్నారు ద్వారంపూడి. పవన్ నోటి వెంట ఆ మాట వస్తే చాలు అని కూడా ద్వారంపూడి అంటున్నారు. మొత్తం మీద చూస్తే పవన్ కళ్యాణ్ కాకినాడ నుంచే తన ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తారా అంటే ఎస్ అనే సైనికుల నుంచి జవాబు వస్తోంది.