జన సేనానికి యమ డిమాండు : అటు బాబుతో...ఇటు బీజేపీతో...!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేనా కాదు, ఎంపీనా కానే కాదు, ఆయన పార్టీకి ఏపీలో కానీ తెలంగాణాలో కానీ చట్టసభలలో బలం ఉందా అంటే లేదు.
By: Tupaki Desk | 5 Nov 2023 9:27 AM ISTజనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేనా కాదు, ఎంపీనా కానే కాదు, ఆయన పార్టీకి ఏపీలో కానీ తెలంగాణాలో కానీ చట్టసభలలో బలం ఉందా అంటే లేదు. కానీ పవన్ ఇపుడు రెండు రాష్ట్రాలకు కీలకం అయిపోయారు. ఆయనతో కలసి నడవాలని అటు టీడీపీ ఇటు బీజేపీ రెండూ పోటీ పడుతున్నాయి.
ఏపీలో అయితే పవన్ తో బీజేపీ ఆదికి ముందే పొత్తు పెట్టుకున్న చంద్రబాబు అరెస్ట్ తరువాత పవన్ బాహాటంగా టీడీపీతో పొత్తు కలిపారు. ఇక ఏపీలో బీజేపీ ఈ పొత్తులలో చేరుతుందా అన్నది పక్కన పెడితే తెలంగాణాలో కొత్త రాజకీయ సన్నివేశం చోటు చేసుకుంటోంది.
జనసేనతో పొత్తుకు బీజేపీ ఆరాటపడుతోంది. పవన్ ఇంటికి బీజేపీ తెలంగాణా ప్రెసిడెంట్, కేంద్ర మంత్రి అయిన జి కిషన్ రెడ్డి రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ పదే పదే వస్తున్నారు. పవన్ విదేశాల నుంచి వచ్చీ రాగానే ముందుగా చంద్రబాబుని కలిశారు.
ఆయన నివాసానికి వెళ్ళి సుమారు రెండున్నర గంటల పాటు చర్చలు జరిపారు. టీడీపీ జనసేన ఉమ్మడి కార్యాచరణతో పాటు ఎన్నికల మ్యానిఫేస్టో వంటి అంశాలు కూడా చర్చకు వచ్చాయని అంటున్నారు. మరోసారి భేటీ కావాలని కూడా నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.
ఇక తెలంగాణా విషయం తీసుకుంటే తెలంగాణా ఎన్నికల్లో జనసేనకు పొత్తులో భాగంగా సీట్లు కేటాయిస్తారని అంటున్నారు. ఆ తరువాత పవన్ తో వారాహి ద్వారా ప్రచారం చేయించుకోవాలని బీజేపీ చూస్తోంది. ఇలా రెండు వైపులా పవన్ కళ్యాణ్ కోసం డిమాండ్ ఉంది. బీజేపీ పెద్దలు పవన్ సేవలను ముందుగా తెలంగాణాలో వాడుకుని ఆ మీదట ఏపీకి కూడా సేనానితో స్నేహాన్ని పూర్తి స్థాయిలో వాడుకోవాలని చూస్తున్నారు. మరి బీజేపీకి ఇప్పటిదాకా టీడీపీ విషయంలో పొత్తులు ఉంటాయా లేదా అన్న దాంట్లో అయితే ఏమీ తేలడంలేదు.
బీజేపీ జనసేనతో ముందు పొత్తు బంధం కలిపింది ఏపీలో అయినా అది అమలులోకి వస్తోంది మాత్రం తెలంగాణాలో, ఇక చంద్రబాబు టీడీపీతో పవన్ పొత్తు పెట్టుకున్నది ఏపీలో అయినా తెలంగాణాలో ఆ పార్టీతో కలసి ముందుకు సాగడానికి టీడీపీ పోటీలోనే లేదు.
అయితే రెండు వైపులా చూస్తీ కామన్ ఫ్యాక్టర్ గా కామన్ పాయింట్ గా పవన్ కళ్యాణ్ ఉన్నారు అన్నది వాస్తవం. పవన్ డిమాండ్ ఆ రేంజిలో ఉంది అని జనసైనికులు అంటున్నారు. అయితే ఇక్కడ పవన్ జాగ్రత్తగా అడుగులు వేయాలి అని అంటున్న వారూ ఉన్నారు.
కమలం రంగు కాషాయం. టీడీపీ రంగు పసుపు రెండూ పవిత్రమైనవే. కానీ రెండింటినీ మిక్స్ చేసినా లేక వేరు వేరుగా చూస్తూ అడుగులేసినా కూడా ఇబ్బంది లేకుండా ఉన్నంతవరకే అంటున్నారు. ఎందుకంటే టీడీపీ లబ్దప్రతిష్టమైన ప్రాంతీయ పార్టీ, బీజేపీ జాతీయ పార్టీ. వారికి పోయేది ఏమీ లేదు. కార్నర్ అయ్యేది పవనే అని అంటున్నారు. సో ఇలా రెండు పార్టీలతో విజయవంతంగా పవన్ ముందుకు సాగితే ఓకే అనే అంటున్నారు.
