Begin typing your search above and press return to search.

సేనాని ఆర్డర్ : సినిమాల గురించి మరచిపోండి బ్రో...!

By:  Tupaki Desk   |   4 Aug 2023 10:39 PM IST
సేనాని ఆర్డర్ : సినిమాల గురించి మరచిపోండి బ్రో...!
X

నాకు సినిమాలు అంటే ఇష్టమే కానీ పొలిటికల్ కమిట్మెంట్ కోసం సినిమాలను ఒక ఇంధనంగా వాడుకుంటున్నాను. నేను సినిమాలు చేసి అలా వదిలేస్తాను, కానీ మీరు ఎందుకు దాని గురించి పట్టుకుంటున్నారు అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ ముఖ్య నాయకులకు ఒక రేంజిలో క్లాస్ పీకారని అంటున్నారు.

ముఖ్యంగా బ్రో సినిమా వివాదం మీద ఆయన పార్టీ నేతల మీద గుర్రుగా ఉన్నారని అంటున్నారు. బ్రో సినిమా విషయంలో వైసీపీ మంత్రి ఒకరిని ఒక చోట జస్ట్ అలా ఇమిటేట్ చేసి చూపించారు. అయితే దాని మీద మంత్రి అంబటి రాంబాబు లాగుడూ పీకుడూ చేస్తున్నారు. దాదాపుగా కొన్ని రోజుల నుంచి బ్రో సినిమా కాదు కానీ వైసీపీ నేతలు జనసేన మీద హాట్ కామెంట్స్ చేస్తున్నారు

ఇక టీవీ డిబేట్స్ లో ఇదే అతి పెద్ద ఇష్యూ అయింది. దాంతో జనసేన నేతలు కూడా దానికి కౌంటర్ ఇస్తూ బ్రో మూవీ విషయంలో తమ వాదన వినిపిస్తున్నారు. సరిగ్గా ఇక్కడే పవన్ కళ్యాణ్ అధికార ప్రతినిధుల వైఖరి మీద మండిపడ్డారు. వైసీపీ వారి ఉచ్చులో పడుతున్నారని హెచ్చరించారు.

వారు సినిమాను రాజకీయాలను కలుపుతున్నారని, వివాదం చేయడానికే చూస్తున్నారని, అలాంటిది తెలిసి కూడా మీరు ఎలా ఉచ్చులో పడతారు అని ప్రశ్నించారు అని అంటున్నారు. తాను బ్రో సినిమా చేసి కూడా మరచిపోయాను అని ఆయన అంటున్నారు. అలాంటిది మీకు ఎందుకు ఆ సినిమా గోలా అని ఆయన ప్రశ్నించినట్లుగా అంటున్నారు.

సినిమాల విషయంలో అభిమానులు ఎవరైనా వాదించినా అర్థం ఉంటుంది కానీ జనసేన అధికార ప్రతినిధుల ట్యాగ్ తో టీవీ డిబేట్ లో కూర్చుని వైసీపీ నేతల స్థాయిలో దిగజారిపోతే ఎలా అని ఆయన మండిపడ్డారని అంటున్నారు. మొత్తానికి పవన్ అంటున్నది ఏమిటి అంటే బ్రో సినిమా గురించి మరచిపోమని.

రాజకీయం సినిమాను మిక్స్ చేయడం వల్ల జనసేనకే నష్టం అన్నదే పవన్ కళ్యాణ్ భావన. పవన్ని జస్ట్ సినిమా హీరోగానే జనంలో ఎస్టాబ్లిష్ చేయడమే వైసీపీ ప్లాన్ అన్నది కూడా జనసేన హై కమాండ్ కి తెలుసు అంటున్నారు. తాను ఫక్తు పొలిటీషియన్ అని చెప్పుకోవడానికే పవన్ సిద్ధంగా ఉన్నారు.

తాను సినిమాలు చేసేది రాజకీయాలను నడపడానికే తప్ప మరేమీ కాదని ఆయన అంటున్నారు అలాంటపుడు తనకు లేని మమకారం మీకు ఎందుకు అని ఆయన ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి గత పది రోజులుగా బ్రో సినిమా విషయంలో సాగుతున్న రచ్చకు పవన్ మౌనం వీడి తన అభిప్రాయం చెప్పారని అంటున్నారు. అలా సైలెన్స్ బద్ధలు కొట్టారని అంటున్నారు.

ఇక సినిమాను అలాగే చూడాలని తాను దాన్ని మరచిపోయాను కాబట్టి అంతా అలా జస్ట్ ఎంటర్ టైన్మెంట్ గానే వదిలేయాలని పవన్ అంటున్నారు. మరి ఇది జనేసేనకు చెప్పినట్లుగా ఉన్నా వైసీపీకి కూడా చెప్పినట్లుగానే ఉంది అని అంటున్నారు. మరి బ్రో వివాదం ఇక్కడితో ఆగుతుందా లేక వైసీపీ నుంచి మరింత గా టార్గెట్ అవుతుందా అన్నది చూడాలి.