పవన్ పోటీ చేసే స్థానం ఫిక్స్... బాబు పర్మిషన్ గ్రాంటెడ్!
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేసే స్థానంపై టీడీపీ - జనసేన మధ్య స్పష్టత వచ్చిందని తెలుస్తుంది.
By: Tupaki Desk | 5 Nov 2023 12:13 PM ISTస్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల ఆరోగ్య సమస్యల కారణంగా హైకోర్టు ఇచ్చిన షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే. దీంతో... రాజకీయంగా చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఒకవేళ ఈ నెల 28న మళ్లీ రాజమండ్రి సెంట్రల్ జైల్లో లొంగిపోవాల్సి వస్తే టీడీపీ-జనసేన చేపట్టాల్సిన పనులపైనా దిశానిర్దేశం చేస్తున్నారని అంటున్నారు. ఇదే సమయంలో పవన్ పోటీచేయబోయే స్థానంపై కూడా ఒక క్లారిటీకి వచ్చారని తెలుస్తుంది.
అవును... జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేసే స్థానంపై టీడీపీ - జనసేన మధ్య స్పష్టత వచ్చిందని తెలుస్తుంది. ఇందులో భాగంగా గతేన్నికల్లో ఓడిపోయిన పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గంనుంచే పవన్ కల్యాణ్ మరోసారి పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. ఈ ప్రతిపాదనకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎదుట పెట్టగా... ఇద్దరూ సానుకూలంగా స్పందించారని సమాచారం.
అయితే పొత్తులో భాగంగా జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తున్నారు, ఎక్కడెక్కడ ఇవ్వబోతున్నారు అనే విషయంపై మాత్రం చంద్రబాబు ప్రస్తుతానికి క్లారిటీ ఇవ్వలేదని తెలుస్తుంది. ప్రస్తుతానికి పవన్ కల్యాణ్ పోటీచేయబోయే స్థానంపై మాత్రమే తేల్చి చెప్పినట్లు తెలుస్తుంది. అన్నీ అనుకూలంగా జరిగితే ఈ నెల 28లోపు ఈ విషయంపై బాబు ఈ విషయంపై ఒక స్పష్టత ఇస్తారని సమాచారం. ఈలోపు స్కిల్ స్కాం కేసులో క్వాష్ పిటిషన్ పై క్లార్టీ ఎలాగూ వచ్చేస్తుంది కాబట్టి.. మిగిలిన నిర్ణయాలు ఆ తీర్పు అనంతరం ఉంటాయని తెలుసుంది.
కాగా... 2014 ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కూటమికి అన్ కండిషనల్ గా మద్దతు ఇస్తూ ఎన్నికల్లో పోటీచేయని పవన్ కల్యాణ్.. 2019 ఎన్నికల్లో బరిలోకి దిగారు. ఇందులో భాగంగా... విశాఖ జిల్లా గాజువాక, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జిల్లా భీమవరం నుంచి పోటీ చేశారు. అయితే భీమవరంలో వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీను చేతిలో 8,357 ఓట్ల తేడాతో ఓడిపోయిన పవన్ కల్యాణ్... గాజువాకలో వైసీపీ అభ్యర్థి తిప్పల నాగిరెడ్డిపై 14,520 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
ఈ రెండింటిలోనూ భీమవరంలోనే కాస్త తక్కువ తేడాతో ఓడిపోయారు. ఇదే సమయంలో ఈ దఫా టీడీపీ - జనసేన మధ్య పొత్తు కూడా ఉండటంతో భీమవరం అయితేనే సేఫ్ అని పవన్ ఫిక్సయ్యారని.. ఆయన చేయించుకున్న సర్వే ఫలితాలు కూడా ఆ విషయాన్ని బలపరుస్తున్నాయని తెలుస్తుంది. అయితే... ఉమ్మడి తూర్పుగొదావరి జిల్లాలో కూడా పోటీచేయాలని పవన్ భావిస్తున్నారంట.
ఇందులో భాగంగా... పిఠాపురం, మండపేట నియోజకవర్గాల పేర్లు ప్రస్థావించారని అంటున్నారు. అయితే వారాహియాత్ర అనంతరం మారిన తాజా రాజకీయ పరిణామాలతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారని తెలుస్తుంది. అయితే సర్వే ఫలితాలు మాత్రం భీమవరంలో పరిస్థితులు కాస్త అనుకూలంగా ఉన్నాయని.. ఈసారి కూడా అక్కడనుంచి పోటీచేస్తే అసెంబ్లీలో అడుగుపెట్టడం సాధ్యమవుతుందని చెప్పాయని తెలుస్తుంది.
