లక్ష్యం సరే.. ప్రజలకు నచ్చేనా జనసేనానీ?!
కాబట్టి.. ఇలాంటి నాయకుడిని ఓడించాలని, లేదా రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని చెబుతున్న పవన్ వ్యాఖ్యలు ఏమేరకు లబ్ధి పొందుతున్న ప్రజలు రిసీవ్ చేసుకుంటారనేది ప్రశ్న.
By: Tupaki Desk | 17 Sep 2023 3:30 PM GMT''వైసీపీని గద్దెదింపాలి. జగన్‌ను రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలి. ఇదే నా అంతిమ లక్ష్యం''- ఇతమిత్థంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. తన పార్టీ శ్రేణులకు తాజాగా చేసిన దిశానిర్దేశం. పార్టీ లక్ష్యంగా కూడా ఆయన చెప్పుకొచ్చారు. అయితే.. ఇది చెప్పుకొన్నంత తేలిక అయితే కాదని అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. రాజకీయంగా వివాదాలు, విభేదాలు ఎన్నయినా ఉండొచ్చు. కానీ, సింపతీ అనేది ప్రజల్లో ఒకటి ఉంటుంది.
ఇలా చూసుకున్నప్పుడు.. మెజారిటీ ఓటు బ్యాంకుగా పరిగణిస్తున్న రాష్ట్రంలోని మహిళలు, సాధారణ ప్రజలకు ఇప్పుడు జగన్ అంత శత్రువు అయిపోయాడా? అనే ప్రశ్న ఉదయించక మానదు. కొన్ని చోట్ల ప్రజలు ఇదే ప్రశ్నిస్తున్నారు కూడా. ఎందుకంటే.. గత నాలుగేళ్ల కాలంలో సర్కారు చెబుతున్న లెక్కల ప్రకారం లక్షల కోట్ల రూపాయలను పేదలు, ఇతర సామాజిక వర్గాలకు చెందిన లబ్ధి దారుల ఖాతాల్లో జమ చేశారు.
ఇక, ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్టుతో గ్రామాల్లో ఇంటి దగ్గరే వైద్య సేవలు అందిస్తున్నారు. మరోవైపు.. అమ్మ ఒడి వంటి కీలక పథకం అమలు చేస్తున్నారు. ఇలా చూసు కుంటే..అనేక రూపాల్లో సీఎం జగన్ చెరగని ముద్ర వేశారనేది వైసీపీ నాయకులు చెబుతున్న మాట. కాబట్టి.. ఇలాంటి నాయకుడిని ఓడించాలని, లేదా రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని చెబుతున్న పవన్ వ్యాఖ్యలు ఏమేరకు లబ్ధి పొందుతున్న ప్రజలు రిసీవ్ చేసుకుంటారనేది ప్రశ్న.
పైగా.. కేవలం జగన్ ను మాత్రమే టార్గెట్ చేయడం ద్వారా.. ప్రజల్లో ఒక విధమైన చర్చ కూడా వచ్చే అవకాశం ఉంది. కేవలం జగన్ కోసమే టీడీపీ-జనసేన చేతులు కలిపాయనే భావన వారిలో ఏర్పడితే.. కూటమిపై విశ్వాసం కూడా పెరిగే అవకాశం సన్నగిల్లుతుందని అంటున్నారు పరిశీలకులు.
సో.. జనసేన అధినేత తనకు తానుగా నిర్దేశించుకున్న లక్ష్యం బాగానే ఉన్నా.. ప్రజలు ఏమేరకు రిసీవ్ చేసుకుంటారు? ఏమేరకు ఆయన చెప్పింది నమ్ముతారు? అనేది ఇప్పుడు చర్చనీయాంశం. మరి ఏం జరుగుతుందో చూడాలి.