Begin typing your search above and press return to search.

టీడీపీ వీక్ అయిందా.. ఇజ్జత్ కే సవాల్ ?

తెలుగుదేశం పార్టీ వీక్ అయింది అంటూ ఏకంగా ఒక బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చేశారు.

By:  Tupaki Desk   |   5 Oct 2023 3:55 PM GMT
టీడీపీ వీక్ అయిందా.. ఇజ్జత్ కే సవాల్ ?
X

తెలుగుదేశం పార్టీ వీక్ అయింది అంటూ ఏకంగా ఒక బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఇది నిజంగా ఒక రాజకీయ పార్టీ గురించి తోటి రాజకీయ పార్టీ ఎపుడూ ఇవ్వని స్టేట్మెంట్. అంటే పొత్తు పేరుతో వచ్చి జత కట్టిన పార్టీ అన్న మాట. ప్రత్యర్ధి పార్టీ అయిన వైసీపీ ఎటూ టీడీపీ వీక్ అయింది అనే అంటుంది.

కానీ టీడీపీకి మిత్రుడిగా ఉంటామని చెబుతూ పొత్తును అఫీషియల్ గా ప్రకటించిన జనసేనాని ఇపుడు టీడీపీ వీక్ అని ఏకంగా ఆ పార్టీ ఇజ్జత్ కే సవాల్ చేశారా అన్న చర్చ అయితే వస్తోంది. టీడీపీ వీక్ అంటే ఎవరూ ఒప్పుకోరు. అసలు ఆ పార్టీని వైసీపీ కూడా బలహీనం అని ఎపుడూ పెద్దగా అన్న దాఖలాలు లేవు. జగన్ సైతం ఈ మధ్యన విజయవాడలో జరిగిన ఒక సభలో మాట్లాడుతూ వచ్చేది కురుక్షేత్ర సంగ్రామం అని చెప్పుకొచ్చారు. అంటే ఆయన ఎక్కడా టీడీపీని తక్కువ చేయలేదు.

ఆ పార్టీతో హోరాహోరు పోరు ఉంటుందని భావిస్తూ క్యాడర్ ని ప్రజలను అలెర్ట్ చేస్తున్నారు. అలాంటిది మిత్రుడు అనుకున్న పవన్ కళ్యాణ్ పుసుక్కున టీడీపీ వీక్ గా ఉందని విశ్లేషించడం ద్వారా తాను చెప్పదలచినది ఏమైనా టీడీపీ హర్ట్ అయ్యేలాగానే ఈ కామెంట్స్ ఉన్నాయని అంటున్నారు. దాని కంటే ముందు ఆయన మంగళగిరిలోని పార్టీ నేతల సమావేశాలలో కూడా పలుమార్లు టీడీపీ ఇపుడు బలహీనంగా ఉందని మనం చులకనగా మాట్లాడవద్దు అని క్యాడర్ కి సూచించారు

వారిని కూడా కలుపుకుని పోయి సమాదరించాలి అని హితబోధ చేశారు. ఆ మాటకు వస్తే టీడీపీకి అంతటి ఉపద్రవం ఏమి వచ్చిందని పవన్ ఈ తరహా కామెంట్స్ చేస్తున్నారు అనందే చర్చగా ఉంది. నిజానికి టీడీపీ 2019 ఎన్నికల్లో సైతం దాదాపుగా న్లభై శాతానికి తగ్గకుండా ఓటు షేర్ తెచ్చుకుంది. వచ్చిన సీట్లు 23తో సంబంధం లేకుండా ఈ భారీ ఓటు షేర్ ని ఆ పార్టీ కలిగి ఉంది. ఇక టీడీపీ 2019లో ఓడినది పది శాతం ఓటు షేర్ మార్జిన్ తో అయినా కూటమి కడితే ఆ తేడా జస్ట్ మూడు శాతానికి వచ్చేస్తుంది.

మరి ఎన్నికల వేళ అది కాస్తా అటూ ఇటూ అయితే మాత్రం విజయం కూడా దక్కే చాన్స్ ఉనిద్. ఇంతలా విన్నింగ్ చాన్సెస్ ఏపీలో ఒక్క టీడీపీకే ఉన్నాయి. వైసీపీని ఈ రోజుకీ ఢీ కొట్టే పార్టీ ఏదైనా ఉంది అంటే అది టీడీపీ మాత్రమే అని అంతా అంటారు. టీడీపీ ఏపీలో గెలిస్తే మొదటి స్థానంలో ఉంటుంది. ఓడితే రెండవ ప్లేస్ లో ఉంటుంది. అంటే అయితే విన్నర్, లేకపోతే రన్నర్. ఇదే టీడీపీ రాజకీయం. ఇదే టీడీపీ బలం.

ఇక గ్రాస్ రూట్ లెవెల్ లో టీడీపీ బలంగా ఉంది. బూత్ స్థాయి నుంచి క్యాడర్ ఉన్నారు. గత నాలుగున్నర దశాబ్దాల హిస్టరీ టీడీపీ సొంతం. అలాంటి పార్టీ వీక్ అని పవన్ అనడం పట్ల టీడీపీలో చర్చ సాగుతోంది. నిజానికి చంద్రబాబు జైలుకు వెళ్ళడం వల్ల ఆ పార్టీ కొంత ఇబ్బందులలో ఉన్న మాట వాస్తవం.

ఆ పార్టీకి సర్వం చంద్రబాబే. అలా ఆయన పార్టీని ఇన్నేళ్ల పాటు నెట్టుకుంటూ వచ్చారు. ఆయన ఒక్కసారి తెర వెనక్కి వెళ్ళేసరికి టీడీపీ తన హిస్టరీలో ఫస్ట్ టైం ఏమీ తెలియని అయోమయంలో అల్లల్లాడిపోతోంది. అంతమాత్రం చేత టీడీపీ వీక్ అయినట్లు కాదు. ఆ పార్టీకి నిబద్ధతతో పనిచేసే లక్ష్యలాది మంది క్యాడర్ ఉంది. సీనియర్ లీడర్స్ నుంచి జూనియర్ లీడర్స్ దాకా చాలా మంది ఉన్నారు.

ఈ నేపధ్యంలో టీడీపీ ఎక్కడ వీక్ అయింది అన్న చర్చ అయితే వస్తోంది. పవన్ మిత్రుడిగా టీడీపీకి నైతిక మద్దతు బలం ఇచ్చి ఉండవచ్చు కానీ టీడీపీ వీక్ అయింది పూర్తి స్థాయిలో అని చెప్పడం మాత్రం ఎంతమాత్రం సమంజసం కాదనే మాట వినిపిస్తోంది. నిజానికి ఇది టీడీపీ క్యాడర్ సైతం జీర్ణించుకోలేని మాటగానే చూస్తున్నారు.

అయితే పవన్ టీడీపీతో పొత్తు కుదుర్చుకున్న సందర్భం టీడీపీ ఎన్నడూ చూడని ఇబ్బందులు ఎదుర్కొన్న నేపధ్యం అన్నీ కలసి పవన్ నోటి వెంట ఆ మాట మాట్లాడించి ఉంటాయని అంటున్నారు. ఎవరేమనుకున్నా కూడా టీడీపీ స్ట్రాంగ్ పార్టీ ఏపీ రాజకీయాల్లో అనే మెజారిటీ జనం అంటారు.

అయితే టీడీపీ పొత్తుల కోసం వెంపర్లాడడం కూడా ఆ పార్టీ వీక్ నెస్ ని గతంలో బయటపెడితే ఇపుడు జైలులో బాబు ఉండగా బయట హడావుడిగా పొత్తు ప్రకటన చేయడం కూడా ఆ పార్టీ వీక్ అన్న ఇమేజ్ ని తీసుకొచ్చాయని అంటున్నారు. మొత్తం మీద పవన్ చేసిన కామెంట్స్ పట్ల అటు టీడీపీలోనూ ఇటు ఏపీ రాజకీయాలలోనూ పెద్ద ఎత్తున చర్చ అయితే సాగుతోంది.