Begin typing your search above and press return to search.

పవన్ చేతికి రెండు ఉంగరాలు... ఏమిటీ నాగబంధం?

అవును... గత కొంతకాలంగా పవన్ కల్యాణ్ కుడి చేతి మధ్య, ఉంగరం వేళ్లకు రెండు ఉంగరాలు కనిపిస్తున్నాయి.

By:  Tupaki Desk   |   22 Feb 2024 6:30 AM GMT
పవన్  చేతికి రెండు ఉంగరాలు... ఏమిటీ నాగబంధం?
X

చాలా మంది తమ చేతికి కొన్ని రకాల ఉంగరాలు ధరిస్తుంటారు. ప్రధానంగా రకరకాల రంగులలో రాళ్లు పెట్టుకుంటూ ఉంటారు! ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, నలుపు మొదలైన రంగులతో కూడిన ఉంగరాలను ధరిస్తుంటారు. ఫలితంగా తమ జాతకం మారిపోతుందని కొందరు.. తమకు ఎలాంటి ఇబ్బందులూ రావని ఇంకొందరు నమ్ముతుంటారు. ఇలా ఎక్కువగా నమ్మేవారిలో వ్యాపారులు, సినీ నటులు, రాజకీయ నాయకులు ఉంటారని చెబుతుంటారు. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ చేరిన సంగతి తెలిసిందే.

అవును... గత కొంతకాలంగా పవన్ కల్యాణ్ కుడి చేతి మధ్య, ఉంగరం వేళ్లకు రెండు ఉంగరాలు కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగా మధ్య వేలుకి నాగబంధం, ఉంగరం వేలుకి కూర్మావతారం అంగుళికములు కనిపిస్తున్నాయి. దీంతో వీటి విశిష్టత ఏమిటి అనే చర్చ అటు సినిమా, ఇటు రాజకీయ వర్గాల్లో బలంగా నడుస్తుంది. ఈ నేపథ్యంలో నాగ బంధం, కూర్మావతారం ఉంగరాలకు మంచి విశిష్టత ఉందని తెలుస్తోంది.

వివరాళ్లోకి వెళ్తే... స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నప్పుడు... ఆయనను ములాకత్ లో కలిసి వచ్చిన తర్వాత బాలకృష్ణ, లోకేష్ లతో కలిసి పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన చేతి వేళ్లకు ఉన్న రెండు ప్రత్యేక ఉంగరాలు అందరి దృష్టినీ ఆకర్షించాయి! దీంతో వాటిపై చర్చ మొదలైంది!

వీటిలో నాగబంధం ఉంగరం విషయానికొస్తే.. నాగుపాము ఆకారంలో ఉండే ఈ నాగబంధం ఉంగరం వల్ల దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయని.. అనుకోని విపత్తులు నుంచి ఇది రక్షిస్తుందని చెబుతున్నారు. ఇదే సమయంలో... ఎలాంటి దుష్ట శక్తులు పడకుండా ఈ ఉంగరం కాపాడుతుందని.. రాహు కేతు దోషాలు, నరదిష్టి దోషాల నుంచి విముక్తి లభిస్తుందని చెబుతున్నారు.

ఇదే సమయంలో కూర్మావతారం ఉంగరం విషయానికొస్తే.. ఈ ఉంగరం ధరించడం వల్ల అధికార యోగం సిద్ధిస్తుందనేది విశ్వాసం అని చెబుతున్నారు. అధికార యోగం రావాలంటే దైవబలం కావాలని ఆకాంక్షించేవారు.. ఇలాంటి కూర్మావతారం ఉంగరాలు ధరిస్తారని వివరిస్తున్నారు! ఈ క్రమంలో... ఎలాంటి దోషాలు లేకుండా, ఎటువంటి కీడు జరగకుండా అధికార యోగం కోరుకోవడం వల్లే పవన్ ఈ రెండు ఉంగరాలు ధరించివుంటారని పండితులు చెబుతున్నారు!